“మామూలు ధాన్యం ధ‌ర‌కే త‌డిసిన ధాన్యాన్ని కొంటాం”

మాట ఇచ్చిన మ‌న సీఎం మ‌న‌సున్న మ‌హారాజు

రైతులు ధైర్యంగా ఉండాలి

వ‌ర్షాలు ఆగిన త‌ర్వాతే పంట న‌ష్టాల అంచ‌నాలు

రైతుల‌ను రెచ్చ‌గొడుతున్న ప్ర‌తిప‌క్షాలు… వాళ్ళు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారు?

రైతుల జీవితాల‌తోనూ విప‌క్షాల రాజ‌కీయాలా?!

మీడియాతో మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు

వ‌రంగ‌ల్ : ఆకాల వ‌ర్షాలు రైతాంగాన్ని ఆపార న‌ష్టాల్లోకి నెడుతున్నాయి. మొన్న‌టి దాకా పంట న‌ష్టాలు, ఇప్పుడు వాటితోపాటు ధాన్యం త‌డిసి మోపెడు అవుతున్న‌ది. అందుకే మ‌నసున్న మ‌న సీఎం కెసిఆర్ గారు త‌డిసిన ధాన్యాన్ని మామూలు ధ‌ర‌కే కొంటామ‌ని ప్ర‌క‌టించార‌ని, రైతులు ధైర్యంగా ఉండాల‌ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

అయితే, ప్ర‌తిప‌క్షాలు మాత్రం ఇందుకు భిన్నంగా రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తున్నాయ‌ని, కానీ వారు పాలిస్తున్న రాష్ట్రాల్లో, దేశంలో ఎక్క‌డైనా స‌రే, ఈ విధంగా చేస్తున్నారా? రైతుల‌ను ఆదుకుంటున్నారా? ఇక్క‌డ మాత్రం రైతుల‌ను ఎందుకు రెచ్చ‌గొడుతున్నారు? రైతులు ప్ర‌తిప‌క్షాల కుటిల నీతిని గుర్తించాల‌ని, సంయ‌మ‌నం పాటించాల‌ని ఆయ‌న కోరారు. బుధ‌వారం హ‌న్మ‌కొండ‌లోని అతిథి గృహంలో మంత్రిని కొంద‌రు మీడియా వ్య‌క్తులు ఆకాల వ‌ర్షాలు, పంట‌ల న‌ష్టాల‌పై ప్ర‌శ్నించ‌గా, మంత్రి ఈ విధంగా స్పందించారు.

దేశంలో ఎక్క‌డా లేని విధంగా రైతుల పంట‌ల‌ను కొనుగోలు చేస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్ర‌మే. అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే రైతుల పంటల న‌ష్టాల‌కు ఎక‌రాకు రూ.10వేలు ప్ర‌క‌టించింది. కౌలు రైతుల‌కు కూడా న‌ష్టాల ప‌రిహారం అందేలాచేస్తున్న‌ది. ఇంత‌గా చేస్తున్న ప్ర‌భుత్వం దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేద‌ని మంత్రి అన్నారు. అయితే ప్ర‌భుత్వం ధాన్యం కొనుగోలు చేస్తున్న ఈ స‌మ‌యంలో అకాల వ‌ర్షాలు ధాన్యాన్ని న‌ష్ట ప‌రిచాయ‌న్నారు.

ఈ ద‌శ‌లోనూ మ‌న ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు గారు త‌డిసిన ధాన్యాన్ని కూడా మామూలు ధాన్యం ధ‌ర‌కే కొనుగోలు చేస్తామ‌ని ప్ర‌క‌టించ‌డం ఆయ‌న విశాల హృద‌యానికి నిద‌ర్శ‌న‌మ‌న్నారు. అయితే, ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేయాల‌ని చూస్తున్న ప్ర‌తిప‌క్షాలు లేనిపోని డిమాండ్లు పెట్టి, రైతుల‌ను ఆగం ప‌ట్టిస్తున్నాయ‌ని అన్నారు. వారు పాలిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ త‌హార రైతుల‌కు ప్రోత్సాహ‌కాలు, ప‌రిహారాలు ఇచ్చి మాట్లాడాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి డిమాండ్ చేశారు. రైతులు ఓపిక‌గా ఉండి, ప్ర‌భుత్వం ధాన్యం కొనుగోలు చేసే వర‌కు ఆగాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

అజంజాహీ మిల్లును మించిన మెగా టెక్స్ టైల్ పార్క్ వ‌రంగ‌ల్ లోనే నిర్మ‌స్తున్నం

టెక్స్ టైల్ పార్క్ లో ఉద్యోగాలు స్థానికుల‌కే ద‌క్కేలా చ‌ర్య‌లు

హెల్త్ హ‌బ్ గా వ‌రంగ‌ల్…రూ.1100 కోట్ల‌తో సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్‌

కార్య‌క‌ర్త‌ల‌ను కంటికి రెప్ప‌లా కాపాడుకునే ఏకైక పార్టీ బిఆర్ఎస్‌

ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను కార్య‌క‌ర్త‌లు ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాలి

వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం 35వ డివిజ‌న్ ఆత్మీయ స‌మ్మేళ‌నంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

వ‌రంగ‌ల్ : ఒక‌ప్పుడు వ‌రంగ‌ల్ లో అజంజాహీ మిల్లు కూత‌కు మ‌న‌మంతా లేచేది. ఆ కూత పోయింది. మిల్లు పోయింది. కాంగ్రెస్ పార్టీ ఆ మిల్లును అమ్ముకుంది. ఆ మిల్లుపై ఆధార‌ప‌డిన వారిని ఆగం చేసింది. సీఎం కెసిఆర్ సీఎం అయ్యాక‌, అజంజాహీ మిల్లును మించిన మెగా టెక్స్ టైల్ పార్క్ వ‌రంగ‌ల్ లోనే ఏర్పాటు చేశారు. మంత్రి కెటిఆర్ చొర‌వ‌తో ఆ మెగా టెక్స్ టైల్ పార్క్ గీసుకొండ స‌మీపంలో ప‌నులు ప్రారంభం అయ్యాయి.

అందులో స్థానికుల‌కే ఉద్యోగాలు ద‌క్కేలా చేస్తాన‌ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం 35వ డివిజ‌న్‌లో బుధ‌వారం జ‌రిగిన బిఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌ల ఆత్మీయ స‌మ్మేళ‌నం ఆ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే న‌న్న‌ప‌నేని న‌రేంద‌ర్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగింది. ఈ స‌మావేశానికి మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి మాట్లాడుతూ, ఒక‌ప్పుడు అజంజాహీ మిల్లు 10వేల మంది కార్మికుల‌కు ఉపాధినిచ్చింది. ఇక్క‌డే చుట్టుముట్టు కార్మికులంతా నివ‌సించే వారు. ఆ మిల్లు కూత‌కు లేచే వారు. అలాంటి మిల్లును దివాలా తీయించి, అప్ప‌టి పాల‌కులు అమ్మేశారు. 10వేల మంది కార్మికుల‌ను రోడ్డున ప‌డేశారు. దానికి బ‌దులుగా వేలాది మందికి ఉపాధి ల‌భించే విధంగా సిఎం కెసిఆర్ గారు మెగా టెక్స్ టైల్ పార్క్ ని అందుబాటులోకి తెచ్చారు. ఆ మిల్లులో స్థానికుల‌కే ఉద్యోగాలు ద‌క్కేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు.

అలాగే, వ‌రంగ‌ల్ న‌గ‌రం హెల్త్ హ‌బ్ గా మారుతున్న‌ది. ఇప్ప‌టికే ఉన్న ఎంజిఎంకు తోడు, పిఎంఎస్ ఎస్ వై హాస్పిట‌ల్ అందుబాటులోకి వ‌చ్చింది. తాజాగా, వ‌రంగ‌ల్లోనే రూ.1100 కోట్ల‌తో సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్ నిర్మాణం జ‌రుగుతున్న‌ది. త్వ‌ర‌లోనే అది ప్రారంభం అవుతుంది. ఇక ఇక్క‌డి చుట్టుముట్టు ప్ర‌జ‌లు ఆరోగ్యం కోసం హైద‌రాబాద్ కు పోవాల్సిన ప‌ని లేదు. ఆ స్థాయి వైద్యం ఇక్క‌డే అందుబాటులోకి వ‌స్తుంద‌ని మంత్రి ఎర్ర‌బెల్లి వివ‌రించారు.

అలాగే రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన ప‌లు ప‌థ‌కాల‌ను మంత్రి సోదాహ‌ర‌ణంగా వివ‌రించారు. ఆయా ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ళే బాధ్య‌త‌ను కార్య‌క‌ర్త‌లు తీసుకోవాల‌ని పిలుపునిచ్చారు. త్వ‌ర‌లోనే వ‌రంగ‌ల్ జిల్లాకు పార్టీ కార్యాల‌యం వ‌స్తుంద‌ని తెలిపారు. క‌లెక్ట‌రేట్ నిర్మాణం జ‌రుగుతుంద‌న్నారు.

దేశంలో కార్య‌క‌ర్త‌ల‌ను కంటికి రెప్ప‌లా కాపాడుకునే పార్టీ బిఆర్ ఎస్ మాత్ర‌మేన‌ని, ఇలాంటి పార్టీ దేశంలో ఎక్క‌డా లేద‌ని, 80 ల‌క్ష‌ల మంది సైన్యంగా గ‌ల కార్య‌క‌ర్త‌లు పార్టీని, ప్ర‌భుత్వాన్ని కాపాడే బాధ్య‌త‌ను తీసుకోవాల‌ని, ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను, ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ళ‌డంలో కీల‌కంగా ప‌ని చేయాల‌ని సూచించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యేతోపాటు, స్థానిక నేత‌లు, డివిజ‌న్ల కార్పొరేట‌ర్లు, పార్టీ ముఖ్యులు, కార్య‌క‌ర్త‌లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

దీనికంటే ముందు వ‌రంగ‌ల్ లో మంత్రి కెటిఆర్ ప‌ర్య‌ట‌న‌ను విజ‌య‌వంతం చేయ‌డానికి ప్ర‌తి ఒక్క‌రూ శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేయాల‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు పార్టీ ఎమ్మెల్యేలు, ఇత‌ర నేత‌లను ఆదేశించారు. ఈ మేర‌కు బుధ‌వారం హ‌న్మ‌కొండ‌లోని త‌న క్యాంపు కార్యాల‌యం ఆర్ అండ్ బి అతిథి గృహంలో ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య్ భాస్క‌ర్‌, మేయ‌ర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు అరూరి ర‌మేశ్‌, తాటికొండ రాజ‌య్య‌, న‌న్న‌ప‌నేని న‌రేంద‌ర్‌, ఒడితెల స‌తీశ్‌, డిసిసిబి చైర్మ‌న్ మార్నేని ర‌వింద‌ర్ రావు, కుడా చైర్మ‌న్ సుంద‌ర్ యాద‌వ్ త‌దిత‌రుల‌తో మంత్రి స‌మీక్షించారు.

ఈ నెల 5న వరంగల్ కు రాష్ట్ర మంత్రి కేటిఆర్ పర్యటనకు రానున్న సంధర్భంగా నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చేస్తారు. కేటిఆర్ పర్యటన సంధర్భంగా ఏర్పాటు చేయాల్సిన ఏర్పాట్ల‌పై మంత్రి ఎర్రబెల్లి నేత‌ల‌కు దిశానిర్దేశం చేశారు.

ఈ నెల 5వ తేదీన మంత్రి కేటిఆర్ ఉ. 10 గంటలకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల‌తోపాటు పబ్లిక్ మీటింగ్ లో పాల్గొంటారు. మ.3 గంటలకు హసన్ పర్తి (ఎర్రగట్టుగుట్ట) కిట్స్ కళాశాలలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొని.. ఇంక్యుబేషన్ సెంటర్ను ప్రారంభించి, అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిట్స్ తిలకిస్తారు. అనంతరం హెచ్.ఒ.డిలు, విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. సా.4 గం.లకు హసన్ పర్తి బాలాజీ గార్డెన్స్ లో కేసిఆర్ కప్ ను విజేత‌ల‌కు అంద‌చేస్తారు. సా.4.30 గం.లకు హనుమకొండ జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. సా.5.30 గం.లకు హంటర్ రోడ్ లో సైన్స్ సెంటర్ ను ప్రారంభిస్తారు. సా.5.50 గం.లకు లష్కర్ బజార్ మర్కజీ స్కూల్లో నగరంలోని వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. సా.6.15 గం.లకు గాంధీనగర్ లో(అంబేధ్కర్ భవన్, టి.వి టవర్ దగ్గర) మోడల్ వైకుంఠధామాన్ని ప్రారంభిస్తారు. సా.6.45 గం.లకు సెయింట్ గ్యాబ్రిల్ స్కూల్లో పార్టీ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా ప్ర‌సంగిస్తారు. ఈ మొత్తం కార్య‌క్ర‌మాల విజ‌య‌వంతానికి కృషి చేయాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ఆయా నేత‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. అధికారిక కార్య‌క్ర‌మాల్లో అధికారులు భాగ‌స్వాముల‌వుతారు. ఇక పార్టీ కార్య‌క్ర‌మాల్లో మాత్రం పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌ను విస్తృతంగా పాల్గొనేలా చూడాల‌ని మంత్రి సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X