हैदराबाद : पूर्व मंत्री वाईएस विवेकानंद रेड्डी की हत्या के मामले में गवाह रहे चौकीदार रंगन्ना गंभीर रूप से बीमार पड़ गए। ज्ञातव्य है कि विवेकानंद रेड्डी की हत्या के दिन वहां मौजूद चौकीदार रंगन्ना द्वारा अदालत को दिए गए 164 बयान में विवेकानंद रेड्डी की उमा शंकर रेड्डी, सुनील यादव और दस्तगिरी की हत्या की गई थी।
चौकीदार रंगन्ना की उम्र के कारण विभिन्न स्वास्थ्य कारणों से स्वास्थ्य की स्थिति खराब हो गई। इसके चलते पुलिस ने रंगन्ना के घर पर सुरक्षा लगा दी थी। 2 मई को उनकी तबीयत बिगड़ने पर परिवार ने उन्हें तुरंत पुलिवेंदुला गवर्नमेंट एरिया हॉस्पिटल में शिफ्ट कर दिया। रंगन्ना को एम्बुलेंस में तिरुपति स्विम्स ले जाया गया क्योंकि डॉक्टरों ने सुझाव दिया कि उन्हें बेहतर इलाज के लिए तिरुपति स्विम्स में ले जाना चाहिए।
पूर्व मंत्री वाईएस विवेकानंद रेड्डी की हत्या के मामले की जांच के तहत सीबीआई अधिकारियों ने 2 मई को विवेकानंद रेड्डी के पीए कृष्णा रेड्डी से पूछताछ की। खबर है कि हत्या से पहले विवेकानंद रेड्डी द्वारा लिखे गए पत्र को कृष्ण रेड्डी द्वारा छुपाए जाने पर और भी सवाल उठे हैं। कृष्णा रेड्डी दोपहर 3 बजे कोठी स्थित सीबीआई कार्यालय पहुंचे और उनसे पांच घंटे से अधिक समय तक पूछताछ की गई।
వివేకా హత్య కేసు : వాచ్ మెన్ రంగన్నకు తీవ్ర అస్వస్థత, తిరుపతి స్విమ్స్‌కు తరలింపు
హైదరాబాద్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగన్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజున అక్కడే ఉన్న వాచ్మెన్ రంగన్న కోర్టుకు ఇచ్చిన 164 వాంగ్మూలంలో వివేకాను ఎర్ర గంగిరెడ్డి, ఉమా శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి హత్య చేసినట్టు తెలిపిన విషయం తెలిసిందే.
వయసు రీత్యా పలు అనారోగ్య కారణాలతో వాచ్ మెన్ రంగన్న ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో రంగన్న ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మే2న ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో కుటుంబ సభ్యులు వెంటనే.. పులివెందుల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతి స్విమ్స్‌కు తరలించాలని వైద్యులు సూచించడంతో అంబులెన్స్‌లో రంగన్నను తిరుపతి స్విమ్స్‌కు తరలించారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు మే2న వివేకా పీఏ కృష్ణా రెడ్డిని ప్రశ్నించారు. హత్యకు ముందు వివేకానందరెడ్డి రాసిన లేఖను కృష్ణా రెడ్డి దాచిపెట్టడంపై మరిన్ని ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. మధ్యాహ్నం 3 గంటలకు కోఠిలోని సీబీఐ కార్యాలయానికి వచ్చిన కృష్ణారెడ్డిని ఐదు గంటలకు పైగా విచారించారు. (ఏజెన్సీలు)