విప్లవ రచయితల ముందు మాటలతో వచ్చిన‘ఉరి కంబం నీడలో’, ఎందుకు చదవాలంటే…

ఒక బహుజనుడి ఆత్మకథ
ఒక విప్లవాత్మక పుస్తకం
చదవండి, చదవించండి

‘ఉరి కంబం నీడలో’ అనే తెలుగు పుస్తకం రచయిత కె. రాజన్న చేతుల్లోకి వచ్చింది. ఒక బహుజనుడి ఆత్మకథగా రూపొందిన ఈ పుస్తకం కోసం తెలుగు పాఠకులు ఏడేళ్లుగా ఆసక్తిగా ఎదురుచూశారు. ఇప్పుడు వారి నిరీక్షణ ఫలించింది. ఈ రచన సమాజంలోని అన్యాయాలను ఎదుర్కొని, విప్లవ స్ఫూర్తిని రగిల్చే సందేశాన్ని అందిస్తుంది.

అనువాదం, సవరణలో కీలక పాత్ర పోషించినఅమెస్కో ఎడిటర్ డి. చంద్రశేఖర్ రెడ్డి, డాక్టర్ కారం శంకర్

డాక్టర్ కారం శంకర్ ఈ పుస్తకాన్ని హిందీ నుంచి తెలుగులోకి అనువదించారు. ఈ రచన ప్రపంచ చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అమెస్కో ఎడిటర్ డి. చంద్రశేఖర్ రెడ్డి ఈ పుస్తకాన్ని సవరించి, సమాజానికి శక్తివంతమైన సందేశాన్ని అందించేలా రూపొందించారు. వ్యవస్థలను అప్రమత్తం చేసే ఈ రచన సామాజిక మార్పుకు దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.

Also Read-

విప్లవ రచయిత నిఖిలేశ్వర్ గారి సహకారం

విప్లవ రచయిత నిఖిలేశ్వర్ ఈ పుస్తకాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించారు. ఈ రచనలో రచయిత ధైర్యంగా ఎదుర్కొన్న సవాళ్లను, మార్పు యుగానికి చిహ్నంగా నిలిచిన కాలాన్ని వివరించారు. ఈ పుస్తకం ప్రతి ఒక్కరికీ ఇబ్బందులను ఎదుర్కొని ముందుకు సాగే స్ఫూర్తిని అందిస్తుందని ఆయన అన్నారు.

విప్లవ రచయిత అల్లం రాజయ్య గారి ముందుమాటలో తెలంగాణ ఉద్యమం

విప్లవ రచయిత అల్లం రాజయ్య 12 పేజీల ముందుమాట రాశారు. ఈ ముందుమాటలో తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం, భూస్వాముల అన్యాయం, నిరంకుశత్వం, అణచివేతలను రచయిత తన కళ్లతో చూసి, ప్రజలతో చర్చించిన విషయాలను వివరించారు. ఎవరూ ముందుకు రాకపోవడంతో, రచయిత స్వయంగా తిరుగుబాటు చేశారని ఆయన పేర్కొన్నారు.

హీరోగా రచయిత గుర్తింపు

‘‘దిశా నిర్దేశం’’ చీఫ్ ఎడిటర్ యాటకర్ల మల్లేష్ రచయిత కె. రాజన్నను నిజమైన హీరోగా అభివర్ణించారు. గ్రామాలలో ఉన్న దొరల ఆగడాల నుంచి ఒకే ఒక్కడులా శిక్షించి తాను మరణశిక్ష వరకు వెళ్లాడు. ఆ మరణ శిక్ష నుంచి తృటిలో తప్పించుకున్న రచయిత రాజన్న ఆలోచనలు కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలను అప్రమత్తం చేస్తున్నాయని, రాబోయే ప్రమాదాల గురించి హెచ్చరిస్తున్నాయని యాటకర్ల మల్లేష్ తెలిపారు.

పుస్తకం ఎలా పొందాలి?

పుస్తకం కొనుగోలు కోసం రూ. 200ను గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా 9492925120 నంబర్‌కు చెల్లించి, స్క్రీన్‌ షాట్‌తో పాటు చిరునామాను పంపవచ్చు.

– ఈదుల్ల మల్లయ్య

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    Recent Posts

    Recent Comments

      Archives

      Categories

      Meta

      'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

      X