हैदराबाद : तेलंगाना में अपने छोटे भाई की मौत का सदमा नहीं सह पाकर एक बड़े भाई की दिल का दौरा पड़ने से मौत हो गई। इस घटना ने सभी को झकझोर कर रख दिया है और परिवार ही नहीं पूरे गांव और आसपास के गांवों को भी शोक में डूबों दिया। एक ही परिवार के दो भाइयों की एक ही दिन में मौत हो गई और परिवार में मातम छा गया। परिजनों और रिश्तेदारों की रोने और चीख-पुकार से सभी के आंखें नम हो गई।
जगित्याल जिले के मेटपल्ली कस्बे में रेड्डी कॉलोनी का रहने वाला भोगा नागभूषणम नाम का शख्स टेंट हाउस चलाता है। इसे तीन बेटे संतान हैं। बड़ा बेटा भोगा सचिन कोरुट्ला शहर में एक बैंक में काम कर रहा है और जीवन यापन कर रहा है। दूसरा बेटा भोगा श्रीनिवास निजी कंपनी में कार्यरत है।
इसी क्रम में दूसरा बेटा श्रीनिवास की कल दोपहर दिल का दौरा पड़ने से मौत हो गई। आज सुबह जब श्रीनिवास का अंतिम संस्कार किया जा रहा था, तब बड़े भोगा सचिन को कब्रिस्तान में दिल का दौरा पड़ने से बेहोश हो गया। परिजन उसे लेकर अस्पताल के लिए रवाना हो गये, मगर रास्ते में ही उसकी मौत हो गई।
छोटे भाई की मौत सहन न कर पाने के कारण बड़े की मौत हो जाने से मोहल्ले में मातम छा गया। एक ही दिन में परिवार के दो बेटों की मौत से परिवार ही नहीं बल्कि कस्बे में भी मातम पसर गया। अंतिम संस्कार में आए परिजन व स्थानीय लोग फूट-फूट कर रोने लगे।
తమ్ముడి మృతి షాక్ తట్టుకోలేక అన్నయ్య గుండెపోటుతో మృతి
హైదరాబాద్ : తెలంగాణలో తమ్ముడి మరణాన్ని భరించలేక ఓ అన్న గుండెపోటుతో మరణించిన విషాదకర ఘటన అందరినీ కలచివేసింది. ఒక్క రోజు వ్యవధిలో ఒకే కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు మరణించడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల, బంధువుల రోదనలు ఆకాశాన్నంటాయి.
జగిత్యాల జిల్లాలోని మెట్‌పల్లి పట్టణంలో రెడ్డి కాలనీకి చెందిన భోగ నాగభూషణం అనే వ్యక్తి టెంట్‌హౌస్ నడిపిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇతనికి ముగ్గురు కుమారులు ఉన్నారు. మొదటి కుమారుడు భోగ సచిన్ కోరుట్ల పట్టణంలోని ఒక బ్యాంకులో ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. రెండవ కుమారుడు భోగ శ్రీనివాస్ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు.
అయితే నిన్న మధ్యాహ్నం సమయంలో రెండో కుమారుడు బోగ శ్రీనివాస్ గుండెపోటుతో మృతి చెందాడు. ఈరోజు ఉదయం శ్రీనివాస అంత్యక్రియలు నిర్వహిస్తుండగా మొదటి కుమారుడు భోగ సచిన్ కూడా స్మశాన వాటికలోనే గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని హాస్పిటల్‌కి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు.
తమ్ముడి మరణం తట్టుకోలేక మనస్తాపంతో అన్న గురై చనిపోవడంతో స్థానికంగా విషాదం నెలకొంది. ఒకే రోజు వ్యవధిలో కుటుంబానికి చెందిన ఇద్దరు కుమారులు చనిపోవడంతో ఆ కుటుంబంలోనే కాకుండా ఊర్లో కూడా విషాదఛాయలు అలుముకున్నాయి. అంత్యక్రియలకు వచ్చిన బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. (Agencies)