RESEARCHERS NEED TO FIND OUT LOCAL HISTORY : Prof Rajendran

Students should be taught history from intermediate
Next Year Puducherry World History Congress in Sri Lanka
Two day PWHC annual conference concluded at BRAOU

Hyderabad: Dr. B. R. Ambedkar Open University (BRAOU), Department of History in collaboration with Puducherry World History Congress (PWHC) two days “Annual Second Session” concluded at the University campus, Jubilee Hills, Hyderabad.

Prof. N. Rajendran, Former Vice Chancellor, Alagappa University, Karaikudi, Tamil Nadu attended Chief Guest for the program. He said that researchers should find out the uncover history of the respective states and regions, and there is no need to impose irrelevant history on the future generations S. Rajendran pointed out. Prof. Rajendran said that national and regional history should be taught as a subject from intermediate education in all states of the country. It has been revealed that all the state governments should take initiation to be instruct in this direction, also he mentioned that, meanwhile the organization will submit a resolution in this regard.

Prof.Rohit Dasanayaka, Peradeniya University, Sri Lanka who participated as the guest of honor in this program, said that the history of South India has been introduced in Sri Lanka and that the history of India has a special place in the history of the world. He announced that Puducherry World History Congress will be held in Sri Lanka next year. And Prof. C. Chennareddy, Former Director, Archaeology & Musuems, Hyderabad, Prof. Srinivas Vaddanam, Professor, Department of History, Dean, Faculty of Social Sciences, Dr.G.Dayakar, Head, Department of History, BRAOU spoke on this occasion.

Dr. Sandeep K Dasari, General Secretary (PWHC) presented a reported the details of the session wise program, he has mentioned that these type of congresses will be useful for research students and teachers. In this two days conference research scholars, students, teachers of various Universities across the country, deans, directors, heads of the departments, historians were participated.

Also Read-

పరిశోధకులు స్థానిక చరిత్రను వెలికి తీయాలి : ప్రొ. ఎన్. రాజేంద్రన్

ఇంటర్మీడియట్ నుంచే విద్యార్ధులకు చరిత్రను భోధించాలి
వచ్చే సంవత్సరం శ్రీలంకలో పుదుచ్చేరి వరల్డ్ హిస్టరీ కాంగ్రెస్ నిర్వహణ
అంబేద్కర్ వర్షీటీలో ముగిసిన రెండు రోజుల వార్షిక సమావేశం

హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న పరిశోధకులు ఆయా రాష్ట్రాలు, ప్రాంతాల వారీగా ఉన్న చరిత్రను వెలికి తీయాలని, అసంబద్ధంగా ఉన్న చరిత్రను భవిష్యత్ తరాలపై రుద్ధాల్సిన అవసరం లేదని అలగప్ప యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొ. ఎస్. రాజేంద్రన్ పిలుపునిచ్చారు. డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం చరిత్ర విభాగం, పుదుచ్చేరి వరల్డ్ హిస్టరీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రెండు రోజుల వార్షిక సమావేశ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రొ. రాజేంద్రన్ మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ విద్యాభ్యాసం నుంచే దేశ, ప్రాంతీయ చరిత్రను ఒక అంశంగా భోధించాలని సూచించారు. ఈ దిశగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించనున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమానికి ప్రపంచ చరిత్ర కాంగ్రెస్ ప్రాంతీయ కార్యదర్శి, విశ్వవిద్యాలయ ఇంచార్జ్ రిజిస్ట్రార్ ప్రొ. ఇ. సుధా రాణి అధ్యక్షత వహించారు. ఆమె మాట్లాడుతూ రెండు రోజుల సదస్సులో దేశ వ్యాప్తంగా వచ్చిన యువ పరిశోధకులు, అధ్యాపకులు సమర్పించిన పరిశోధనా పత్రాలు సమాజ హితం కోరేలా ఉన్నాయని ఇది ఆహ్వానించదగ్గ పరిణామంగా ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా పాల్గొన్న శ్రీలంక, పెరడెనియా విశ్వవిద్యాలయ ప్రొ. రోహిత్ దసనాయకా మాట్లాడుతూ శ్రీలంకలో దక్షిణ భారతదేశ చరిత్రను పాట్యంశంగా ప్రవేశపెట్టినట్లు భారత దేశ చరిత్రకు ప్రపంచ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉందని వెల్లడించారు. వచ్చే సంవత్సరం పుదుచ్చేరి వరల్డ్ హిస్టరీ కాంగ్రెస్ ను శ్రీలంకలో నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.

చరిత్ర విభాగ ప్రొఫెసర్, పురావస్తు శాఖ పూర్వ సంచాలకులు ప్రొ. చెన్నా రెడ్డి, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం సామాజిక శాస్త్రాల డీన్ ప్రొ. వడ్డాణం శ్రీనివాస్; చరిత్ర విభాగ అధిపతి డా. జి. దయాకర్ పాల్గొని ప్రసంగించారు. పుదుచ్చేరి వరల్డ్ హిస్టరీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి డా. సందీప్ కె దాసరి రెండు రోజుల వార్షిక సమావేశ నివేదికను సభలో సమర్పించారు. కార్యక్రమంలో ఇతర విశ్వవిద్యాలయాల చరిత్ర విభాగాల ఆచార్యులు డీన్‌లు, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X