హైదరాబాద్ : ఇండియన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ (ఐడియా), డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం సంయుక్తంగా, ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో), తెలంగాణ విద్యా మండలి; ఇంఫ్లిబ్నెట్ ( INFLIBNET) గుజరాత్ భాగస్వామ్యంతో బుధ, గురు వారాల్లో “సరిహద్దులకు అతీతంగా సరికొత్త దిశలో సార్వత్రిక విద్య” అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సును సీసటీడీ బిల్డింగ్ సభాగారంలో నిర్వహిస్తోంది. డిజిటల్ పరివర్తన, విధానపరమైన చట్రాలు, విద్యకు సమ్మిళిత గుర్తింపు పై దృష్టి సారిస్తూ, సార్వత్రిక దూర విద్యా విధానం (ODL) వ్యాప్తికి తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా చర్చించడమే ఈ జాతీయ సదస్సు ప్రధాన లక్ష్యం.
ఈ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమం విశ్వవిద్యాలయం వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి అధ్యక్షతన జరగనుంది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ఆనందరావు విష్ణు పాటిల్ (IAS) ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. IGNOU ఉపకులపతి ప్రొఫెసర్ ఉమా కంజిలాల్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. కేరళ డిజిటల్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ సాజి గోపీనాథ్ విశిష్ట అతిథిగా పాల్గొంటారు. న్యాక్ (NAAC) మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. ఎస్. ప్రసాద్ కీలకోపన్యాసం చేయనున్నారు. (ఐడియా) అధ్యక్షుడు ప్రొ. కె. సీతారామారావు, (ఐడియా) గౌరవ అధ్యక్షుడు ప్రొఫెసర్ మురళి మనోహర్ గౌరవ అతిథులుగా పాల్గొంటారు. విశ్వవిద్యాలయం విద్యా విభాగం డైరెక్టర్, కాన్ఫరెన్స్ డైరెక్టర్ ప్రొ. పుష్ప చక్రపాణి, రిజిస్ట్రార్, ఐడియా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎల్. వి. కె. రెడ్డి పాల్గొననున్నారు.
“డిజిటల్ టెక్నాలజీ పై రౌండ్ టేబుల్ సమావేశం : డిజిటల్ టెక్నాలజీ : ఓ డి ఎల్ భవిష్యత్తు“ (Digital Technologies: Future of ODL) అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. దీనికి ప్రొ. ఘంటా చక్రపాణి అధ్యక్షత వహిస్తారు. దేశ విదేశాలలోని ప్రముఖ విద్యా సంస్థలకు చెందిన విశిష్ట నిపుణులు ఇందులో ప్యానలిస్టులుగా పాల్గొంటారు. అనంతరం నిర్వహించే ప్లీనరీ సమావేశంలో ఇంఫ్లిబ్నెట్ (INFLIBINET) నిపుణులు ప్రసంగిస్తారు. అనంతరం, సాంకేతిక సమావేశాలు నిర్వహిస్తారు. రెండవ రోజు, డిజిటల్ లెర్నింగ్ స్పెషలిస్ట్ ప్రొఫెసర్ సంజయ్ మిశ్రా “ఓపెన్ డిస్టెన్స్ పాలసీ – నాయకత్వం: నిబంధనల పాటింపు, విమర్శనాత్మక భాగస్వామ్యం ” అనే అంశంపై ప్రొఫెసర్ జి. రామ్ రెడ్డి స్మారక ఉపన్యాసంతో ప్రారంభమవుతుంది.
దీని తర్వాత “డ్యూయల్ మోడ్ విశ్వవిద్యాలయాలు: సమస్యలు సవాళ్లు” అనే అంశంపై ప్యానెల్ చర్చ జరుగుతుంది. ఓడీఎల్లోని కీలక అంశాలపై పలు సాంకేతిక సమావేశాలు జరుగుతాయి. ముగింపు సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, ఐఏఎస్ అధికారి డాక్టర్ యోగిత రాణా, ఐఏఎస్, ముఖ్య అతిథిగా హాజరవుతారు. గౌరవ అతిథులుగా ఉత్తరాఖండ్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నవీన్ చంద్ర లోహాని పాల్గోననుండగా ఈ సమావేశానికి ప్రొ. ఘంటా చక్రపాణి అధ్యక్షత వహిస్తారు. సదస్సులో ఎనిమిది సాంకేతిక సమావేశాలు నిర్వహించనుండగా ఇందులో దేశవ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాల నుంచి 100 కు పైగా పరిశోధకులు హాజరై తమ పరిశోధనా పత్రాలను సమర్పించనున్నారు.
Also Read-
Two-Day National Conference on “Beyond Boundaries: The New ODL Landscape”
Hyderabad : The Indian Distance Education Association (IDEA), in collaboration with Dr. B. R. Ambedkar Open University (BRAOU), hosting in association with Indira Gandhi National Open University (IGNOU), Telangana Council for Higher Education, and INFLIBNET, is organizing a two-day National Conference titled “BEYOND BOUNDARIES: THE NEW ODL LANDSCAPE” on 25th and 26th March at CSTD Building Confrence Hall. The conference aims to deliberate on the evolving dimensions of Open and Distance Learning (ODL), focusing on digital transformation, policy frameworks, and inclusive access to education.
The conference will commence with an Inaugural Session presided over by Prof. Ghanta Chakrapani, Vice Chancellor, BRAOU. Anandrao Vishnu Patil, IAS, Additional Secretary, Ministry of Education, Government of India, will attend as Special Guest. Prof. Uma Kanjilal, Vice Chancellor, IGNOU, will be the Chief Guest. Prof. Saji Gopinath, Vice Chancellor, Digital University, Kerala, will participate as Distinguished Guest. The keynote address will be delivered by Prof. V. S. Prasad, Former Director, NAAC. Guests of Honour include Prof. K. Seetharama Rao, President, IDEA, and Prof. Murali Manohar, Honorary President, IDEA. Prof. Pushpa Chakrapani, Director (Academic) will serve as Conference Director, and Dr. L. V. K. Reddy, Registrar, as Secretary General.
A Round Table Meeting on “Digital Technologies: Future of ODL” will be held., chaired by Prof. Ghanta Chakrapani, with distinguished panellists from leading institutions across the country and abroad. In the afternoon, a Plenary Session on “ONOS and INFLIBNET Services to Academic Community” will feature experts from INFLIBNET. This will be followed by parallel technical sessions focusing on “Expanding Access: Reaching the Unreached.”
The second day will begin with the Prof. G. Ram Reddy Endowment Lecture on “Open Distance Policy and Leadership: From Compliance to Critical Engagement,” to be delivered by Prof. Sanjay Mishra, Digital Learning Specialist, and former COEL Educational Technologist. A panel discussion on “Dual Mode Universities: Issues and Challenges” will follow, along with multiple parallel technical sessions addressing key themes in ODL. The conference will conclude with the Valedictory Session., presided over by Prof. Ghanta Chakrapani. Dr. Yogitha Rana, IAS, Principal Secretary, Education, Government of Telangana, will be the Chief Guest. Guest of Honour Prof. Navin Chandra Lohani, Vice Chancellor, Uttarakhand Open University.
In addition to the various sessions, the conference will feature eight technical sessions, during which approximately 90 research papers will be presented. The conference is expected to bring together academicians, policymakers, and practitioners to discuss innovative strategies and future directions in Open and Distance Learning, strengthening the role of technology in expanding equitable access to education.
