हैदराबाद: सैकड़ों माओवादियों के आत्मसमर्पण से मुश्किल हालात का सामना कर रहे माओवादी पार्टी को एक और झटका लगा है। छत्तीसगढ़ के बस्तर संभाग के कांकड़ जिले में रविवार को बड़ी संख्या में माओवादियों ने फिर आत्मसमर्पण किया। आत्मसमर्पण करने वाले कुल 21 माओवादियों में से 13 महिलाएँ हैं। ये सभी केश्कल संभाग (उत्तर उप-क्षेत्रीय ब्यूरो) कैडर से संबंधित हैं।
माओवादियों ने पुलिस को तीन एके-47 राइफलें, चार एसएलआर, दो इंसास राइफलें, छह 303 राइफलें, दो सिंगल-शॉट राइफलें और एक बीजीएल लॉन्चर सहित 18 हथियार सौंपे। यह आत्मसमर्पण बस्तर रेंज के वरिष्ठ पुलिस अधिकारियों की मौजूदगी में हुआ। माओवादी दल में चार डिवीजन कमेटी सदस्य (डीवीसीएम), नौ एरिया कमेटी सदस्य (एसीएम) और डिवीजन कमेटी सचिव मुकेश सहित आठ पार्टी सदस्य शामिल हैं।
इसी क्रम में हाल ही में जगदलपुर में केंद्रीय समिति के सदस्य रूपेश समेत 210 माओवादियों द्वारा 153 हथियारों के साथ आत्मसमर्पण करने के बाद, एक और बड़ा आत्मसमर्पण हुआ है। केंद्रीय गृह मंत्री अमित शाह ने कहा कि ऑपरेशन कगार के तहत, पूरा बस्तर क्षेत्र मार्च 2026 तक माओवाद-मुक्त होने के अपने लक्ष्य से एक कदम दूर है। पिछले दो वर्षों में छत्तीसगढ़ में रिकॉर्ड संख्या में आत्मसमर्पण हुए हैं। उल्लेखनीय है कि दिसंबर 2023 से अब तक 2,100 से ज़्यादा माओवादी हथियार डाल चुके हैं।
Also Read-
మరో 21 మంది మావోయిస్టుల లొంగుబాటు
హైదరాబాద్ : అగ్రనేతలతోపాటు వందలాది మావోయిస్టులు లొంగిపోతూ గడ్డు పరిస్థితిని ఎదుర్కుంటున్న మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్‌లోని కాంకర్ జిల్లాలో ఆదివారం మరోసారి పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయారు. మొత్తం 21 మంది లొంగిపోయిన మావోయిస్టుల్లో.. 13 మంది మహిళలు ఉన్నారు. వీరంతా కేశ్కల్ డివిజన్ (నార్త్ సబ్-జోనల్ బ్యూరో) క్యాడరుకు చెందిన వారు.
వీరి వద్ద ఉన్న మూడు AK-47 రైఫిల్స్, నాలుగు SLRలు, రెండు INSAS రైఫిల్స్, ఆరు .303 రైఫిల్స్, రెండు సింగిల్-షాట్ రైఫిల్స్, ఒక BGL లాంచర్‌తోసహా 18 ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. బస్తర్ రేంజ్ సీనియర్ పోలీస్ అధికారుల సమక్షంలో ఈ లొంగుబాటు జరిగింది. ఈ బృందంలో డివిజన్ కమిటీ సెక్రటరీ ముకేశ్‌తో సహా నలుగురు డివిజన్ కమిటీ సభ్యులు(DVCMs), తొమ్మిది మంది ఏరియా కమిటీ సభ్యులు(ACMs), ఎనిమిదిమంది పార్టీ సభ్యులు ఉన్నారు.
కాగా ఇటీవలే జగదల్‌పూర్‌లో సెంట్రల్ కమిటీ సభ్యుడు రూపేష్‌తో సహా 210 మంది మావోయిస్టులు 153 ఆయుధాలతో లొంగిపోయిన తర్వాత, మరో భారీ లొంగుబాటు జరగడం విశేషం. ఆపరేషన్ కగర్ లో భాగంగా 2026 మార్చి నాటికి మొత్తం బస్తర్ ప్రాంతాన్ని మావోయిస్టు-రహితంగా చేయాలనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా లక్ష్యానికి అడుగు దూరంలో ఉన్నట్టు పేర్కొన్నారు. గత రెండేళ్లలో ఛత్తీస్‌గఢ్‌లో రికార్డు స్థాయిలో లొంగుబాట్లు జరిగాయి. 2023 డిసెంబర్ నుండి ఇప్పటివరకు 2,100 మందికి పైగా మావోయిస్టులు ఆయుధాలు వదిలిపెట్టడం గమనార్హం. (ఏజెన్సీలు)
