हैदराबाद : ग्रुप-1 के पेपर लीक मामले में अहम मुद्दे सामने आ रहे हैं। इस मामले में हर दिन कोई न कोई नया एंगल सामने आ रहा है। एसआईटी के अधिकारी मामले की गहनता से जांच कर रहे हैं। आरोपी के पीछे कौन? अब तक कितने पेपर लीक हो चुके हैं? ऐसे अनेक मुद्दों की जांच कर रहे हैं। इसी क्रम में एक और अहम मुद्दा चर्चा का विषय बन गया है। पुलिस ने पाया कि इस मामले में पहले से गिरफ्तार राजशेखर, प्रवीण कुमार और रेणुका ने पेपर लीक कर कई लोगों से पैसे लिए है।
एसआईटी के अधिकारी मामले की जांच कर रहे हैं कि क्या आरोपी के किसी रिश्तेदार और दोस्त ने टीएसपीएससी की परीक्षा दी है? कितने आरोपियों ने ओरिजिनल पेपर लीक किए हैं? पता लगाने का प्रयास किया जा रहा है। साथ ही अधिकारी ग्रुप-1 में 100 से अधिक अंक लाने वाले अभ्यर्थियों की सूची की जांच कर रहे हैं। नतीजतन, यह पता चला कि मामले के दूसरे आरोपी राजशेखर के करीबी रिश्तेदार प्रशांत ने ग्रुप -1 की परीक्षा लिखी थी। वह न्यूजीलैंड में रह रहा है। पता चला कि उसने पिछले साल अक्टूबर में ग्रुप-1 की प्रारंभिक परीक्षा लिखी है।
एसआईटी ने पाया कि प्रशांत परीक्षा देकर वापस न्यूजीलैंड चला गया। इसके अलावा, प्रशांत को 100 से अधिक अंक मिले हैं। पुलिस इस बात की जांच कर रही है कि उसे पेपर कैसे लीक हुआ। जबकि राजशेखर फिलहाल पुलिस हिरासत में है। उससे प्रशांत को पेपर लीक करने के मामले में पूछताछ की गई। राजशेखर स्वीकार किया कि प्रशांत उनके करीबी रिश्तेदार हैं। लेकिन परीक्षा के पेपर लीक का जिक्र नहीं है। साथ ही सभी आरोपियों से भी इसी नजरिए से पूछताछ की जा रही है। पूछताछ में रेणुका के जरिए यह पता चला कि पेपर ज्यादा लोगों को लीक नहीं हुआ। इसके साथ ही उसकी डिटेल भी जुटाई जा रही है।
पेपर लीक मामले में एसआईटी ने अपनी जांच तेज कर दी है। नेताओं द्वारा लगाए गए आरोपों पर ध्यान केंद्रित किया। इसने आरोपों से संबंधित साक्ष्य प्रस्तुत करने के लिए नोटिस जारी किया है। गुरुवार को ही रेवंत रेड्डी एसआईटी कार्यालय गए और सबूत जमा किए। लेकिन एसआईटी का कहना है कि रेवंत रेड्डी ने कोई सबूत पेश नहीं किये। बीजेपी के अध्यक्ष बंडी संजय को एसआईटी के सामने आज पेश होने वाले है। साथ ही मंत्री केटीआर ने रेवंत रेड्डी और बंडी संजय पर लगे आरोपों पर उन्हें कानूनी नोटिस जारी किया। यह मुद्दा इस समय तेलंगाना में हड़कंप मचा है।
TSPSC Paper Leak Scam: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కొత్త అంశం, రోజుకో కొత్త కోణం…
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 పేపర్ లీకేజీ కేసులో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. రోజుకో కొత్త కోణం ఈ కేసులో బయటపడుతుంది. సిట్ అధికారులు ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేపడుతున్నారు. నిందితుల వెనుక ఎవరెవరు ఉన్నారు? ఇప్పటివరకు ఎన్ని పేపర్లు లీక్ చేశారు? అనే అంశాలపై విచారణ చేపడుతోన్నారు. ఈ క్రమంలో మరో కీలక అంశాలు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన రాజశేఖర్, ప్రవీణ్ కుమార్, రేణుక పేపర్ లీక్ చేసి చాలామంది దగ్గర డబ్బులు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
దీంతో నిందితుల బంధువులు, స్నేహితులు ఎవరైనా టీఎస్‌పీఎస్సీ పరీక్షలు రాశారా? అనే అంశాన్ని సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. నిందితులు ఎంతమందికి అసలు పేపర్లు లీక్ చేశారు? అనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోన్నారు. అలాగే గ్రూప్-1లో 100కుపైగా మార్కులు సాధించిన అభ్యర్థుల జాబితాను కూడా అధికారులు పరిశీలిస్తోన్నారు. దీంతో ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న రాజశేఖర్ సమీప బంధువు ప్రశాంత్ గ్రూప్-1 పరీక్ష రాసినట్లు బయటపడింది. న్యూజిలాండ్‌లో ఉంటున్న అతడు.. గతేడాది అక్టోబర్‌లో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష రాసినట్లు గుర్తించారు.
పరీక్ష రాసిన అనంతరం ప్రశాంత్ తిరిగి న్యూజిలాండ్ వెళ్లినట్లు సిట్ గుర్తించింది. అంతేకాకుండా ప్రశాంత్‌కు 100కుపైగా మార్కులు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అతడికి ఎలా పేపర్ లీక్ చేశారనే అంశాన్ని పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతం రాజశేఖర్ పోలీసుల కస్టడీలో ఉండగా అతడిని ప్రశాంత్‌కు పేపర్ లీక్ చేసిన విషయం గురించి ప్రశ్నించారు. ప్రశాంత్ తన సమీప బంధువు అని రాజశేఖర్ అంగీకరించాడు. కానీ పరీక్ష పేపర్ విషయం చెప్పలేదని సమాచారం. అలాగే నిందితులందరినీ కూడా ఇదే కోణంలో దర్యాప్తు చేపడుతున్నట్లు తెలుస్తోంది. అలాగే రేణుక ద్వారా కూడా చాలామందికి పేపర్ లీక్ అయనట్లు గుర్తించారు. దీంతో ఆమె నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు.
పేపర్ లీక్ కేసులో సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. రాజకీయ నాయకులు చేసిన ఆరోపణలపై దృష్టి పెట్టింది. ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను సమర్పించాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే గురువారం రేవంత్ రెడ్డి సిట్ కార్యాలయానికి వెళ్లి ఆధారాలు సమర్పించారు. అయితే రేవంత్ ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని సిట్ చెబుతోంది. ఇక బండి సంజయ్ సిట్ ముందు హాజరుకావాల్సి ఉంది. అలాగే తనపై చేసిన ఆరోపణలపై రేవంత్, బండికి మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు జారీ చేశారు. దీంతో ఈ అంశం రాష్ట్రంలో దుమారం చెలరేగుతోంది.