AP MLA కోటా MLC ఎన్నికల్లో TDP ఒక సీటును గెలుచుకోవడం రాజకీయంగా సంచలనం సృష్టించింది

హైదరాబాద్/అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఒక సీటును గెలుచుకోవడం రాజకీయంగా సంచలనం సృష్టించింది. టీడీపీ గెలుపును అడ్డుకోవాలని అధికార వైసీపీ నాయకత్వం ఎంతగా ప్రయత్నించినా తమ ఎమ్మెల్యేలను కట్టడి చేయడంలో విజయం సాధించలేకపోయింది. టీడీపీకి అనుకూలంగా ఓటు వేసిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరనేది మరికాసేపట్లో తేలిపోనుంది. ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అనే ప్రచారం సాగుతోంది. కానీ ఆ ఇద్దరు కచ్చితంగా వీరేనా? లేక మరెవరైనా ఉన్నారా? అన్నది తేలాల్సి ఉంది. ఇదిలా ఉంటే 2019లో తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ఏపీ సీఎం జగన్‌కు శాసనమండలి కలిసిరాలేదనే చర్చ జరుగుతోంది.

అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో ఆమోదింపజేసుకున్న జగన్‌ నాయకత్వం టీడీపీకి మెజార్టీ ఉన్న మండలిలో మాత్రం ఈ బిల్లును గట్టెక్కించుకోలేకపోయింది. అలా ఈ బిల్లు ఆలస్యం కావడానికి కారణమైంది. మూడు రాజధానుల విషయంలో తమ అభిమతానికి భిన్నంగా వ్యవహరించిన శాసనమండలిని రద్దు చేయాలని సీఎం జగన్ అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. దానిని కేంద్రానికి పంపారు.

అయితే ఆ తరువాత కాలం గడుస్తున్న కొద్దీ వైసీపీకి మండలిలో పూర్తి మెజార్టీ రావడంతో మండలిని రద్దు చేయాలనే విషయంలో సీఎం జగన్ కాస్త మెత్తబడ్డారు. అయితే తాజాగా మండలికి ప్రాతినిథ్యం వహించే పట్టభద్రుల ఎన్నికల్లోనూ వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఇక్కడ టీడీపీ విజయం సాధించింది. ఎన్నికలకు ముందు మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న టీడీపీకి ఈ ఎన్నికలు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చాయి. తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీడీపీ ఊహించని విధంగా ఒక సీటును గెలుచుకుంది.

క్యాంపు రాజకీయాల్లో చంద్రబాబు దేశంలోనే నంబర్‌ వన్‌ : సజ్జల రామకృష్ణారెడ్డి

ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ జరగడంపై ప్రభుత్వ సలహదార సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. వాస్తవానికి వైసీపీ మొత్తం 7 సీట్లు గెలుపొందేందుకు అన్ని అవకాశాలు ఉండగా చంద్రబాబు క్యాంపు రాజకీయలు, ప్రలోభాలకు గురి చేసి ఒక స్థానాన్ని సంపాదించుకున్నారని ఆరోపించారు. ప్రలోభాలకు లోనైన వారు వారి భవిష్యత్‌ను గురించి ఆలోచించలేదని పేర్కొన్నారు.

క్యాంపు రాజకీయాలకు, ప్రలోభాలకు గురి చేయడంలో చంద్రబాబు దేశంలోనే నంబర్‌వన్‌ అని విమర్శించారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి చెందిన ఇద్దరు ప్రలోభాలకు గురై ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. క్రాస్‌ ఓటింగ్‌ పై వైసీపీ సీనియర్‌ నాయకులు లోతుగా విశ్లేషించి తగు చర్యలు తీసుకుంటారని వెల్లడించారు. టీడీపీ లెక్క ప్రకారం 19 ఉన్నాయి. ఒక్కస్థానం కూడా గెలిచే అవకాశం లేదు. నెల్లూరు రూరల్‌ తిరుగుబాటు ఎమ్మెల్యే ఒకరు, జనసేన నుంచి వచ్చిన ఒకరు, టీడీపీ నుంచి వచ్చిన మరో ఇద్దరు టీడీపీకి ఓటేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

అయితే టీడీపీ అభ్యర్థిని నిలబెట్టాక తాము అన్ని స్థానాల్లో గెలుపొందాలని ప్రయత్నం చేశామని అన్నారు. అయితే లోపాయికరి ఒప్పందం జరగడంతో క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందన్నారు. మొత్తం వైసీపీ ఓటిమి చెందిందని అనుకోవడం లేదని వెల్లడించారు. ఇప్పటికైనా చంద్రబాబు ఏపీలో 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు.

ఆంధ్ర ప్రదేశ్ జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ ఊహించని రీతిలో గెలుపొందిన విషయం తెలిసిందే. అసలు అభ్యర్థినే నిలబెట్టడం కష్టమని అందరూ అనుకున్నారు. కానీ అనురాధను అభ్యర్థిగా నిలబెట్టడమే కాదు గెలిపించుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. క్రాస్ ఓటింగ్ టీడీపీకి కలిసిరాగా వైసీపీ అభ్యర్థి కోలా రాఘవులు ఓటమిపాలయ్యారు. ఎన్నికల ముందు సెమీ ఫైనల్‌ భావిస్తున్న ఈ ఎన్నికల్లో చంద్రబాబు చక్రం తిప్పి అభ్యర్థిని గెలిపించుకోవడంతో వైసీపీకి బిగ్ షాక్ తగిలినట్లయ్యింది. ఈ ఎన్నికల్లో అనురాధ గెలుపుకోసం చంద్రబాబు ఏం చేశారు? ఎవరితో టచ్‌లోకి వెళ్లారు? అసలు క్రాస్ ఓటింగ్ చేసిందెవరు? అనే విషయాలు వైసీపీ పెద్దలకు అంతు చిక్కక తలలు పట్టుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఎన్నికల్లో చంద్రబాబు వ్యూహం గ్రాండ్ సక్సెస్ అయ్యిందనే చెప్పొచ్చు. ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపైనే వైసీపీకి అనుమానాలు వచ్చాయట. అటు సోషల్ మీడియాలోఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలు ఈ విషయం కోడై కూయడంతో ఎట్టకేలకు తనపై వచ్చిన ఆరోపణలకు శ్రీదేవి వివరణ ఇచ్చుకున్నారు (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X