हैदराबाद : तेलंगाना राज्य लोक सेवा आयोग के पेपर लीक मामले में रिमांड रिपोर्ट में मुख्य बिंदुओं का खुलासा हुआ है। एसआईटी की रिमांड रिपोर्ट में कहा गया है कि इस मामले में अब तक 12 आरोपियों को गिरफ्तार किया जा चुका है। शुरू में गिरफ्तार किए गए नौ आरोपियों के अलावा तीन और आरोपियों को गिरफ्तार किया गया है।
एसआईटी ने पुष्टि की कि तीन में से दो टीएसपीएससी के कर्मचारी है और निष्कर्ष निकाला कि अब तक टीएसपीएससी के कुल चार कर्मचारियों को गिरफ्तार किया जा चुका है। सीआईटी रिमांड रिपोर्ट में प्रवीण टीएसपीएससी के सचिव पीए को ए1 आरोपी, नेटवर्क एडमिनिस्ट्रेशन राजशेखर रेड्डी को ए2आरोपी, शमीम एएसओ को ए10 आरोपी, डाटा एंट्री ऑपरेटर रमेश को ए12 आरोपी के रूप में शामिल किया है।
रिमांड रिपोर्ट में एसआईटी ने 19 गवाहों से पूछताछ की है कि इन आरोपियों में चार और सरकारी कर्मचारी हैं। TSPSC कर्मचारी शंकर लक्ष्मी मुख्य गवाह हैं, उनके साथ TSPSC और तेलंगाना राज्य तकनीकी सेवा के कर्मचारियों को SIT द्वारा गवाह के रूप में नामित किया गया है।
इसके अलावा कर्मनघाट स्थित एक होटल का मालिक व कर्मचारी गवाह बताया जा रहा है। प्रवीण और राजशेखर रेड्डी द्वारा दी गई सूचना के आधार शमीम, रमेश और सुरेश को गिरफ्तार कर लिया गया। 23 मार्च को गिरफ्तार किए गए इन तीनों आरोपियों के पास से एक लैपटॉप और तीन मोबाइल फोन जब्त किया है।
TSPSC Paper Leak Scam : నిందితుల రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజ్ కేసులో రీమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెల్లడవుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికి వరకు 12 మంది నిందితులను ఆరెస్ట్ చేసినట్టు సిట్ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది. మొదట అరెస్ట్ చేసిన తొమ్మిది మంది నిందితులతో పాటు మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్టు తెలిపింది.
ఈ ముగ్గురిలో ఇద్దరు టీఎస్పీఎస్సీ ఉద్యోగులు ఉన్నట్టుగా నిర్ధారించిన సిట్ ఇప్పటవరకు మొత్తం నలుగురు టీఎస్పీఎస్సీ ఉద్యోగుల అరెస్టయినట్టు తేల్చింది. అందులో A1 నిందితుడిగా ప్రవీణ్ టీఎస్పీఎస్సీ సెక్రెటరీ పీఏ, A2 గా రాజశేఖర్ రెడ్డి, నెట్వర్క్ అడ్మిన్, A10 గా షమీమ్ ఏఎస్ఓ, A12 గా రమేష్ డాటా ఎంట్రీ ఆపరేటర్ ను సిట్ రిమాండ్ రిపోర్టులో చేర్చింది.
ఈ నిందితుల్లో మరో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారన్న సిట్ 19 మంది సాక్ష్యులను విచారించినట్టు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది. అందులో టీఎస్పీఎస్సీ ఉద్యోగి శంకర్ లక్ష్మిని ప్రధాన సాక్షి అని ఆమెతో పాటు టీఎస్పీఎస్సీ, తెలంగాణ స్టేట్ టెక్నీకల్ సర్వీస్ ఉద్యోగులను సాక్షులుగా సిట్ పేర్కొంది.
అంతే కాకుండా కర్మన్ ఘాట్ లోని ఒక హోటల్ యాజమని, ఉద్యోగిని సాక్షిగా ఉన్నట్టు తెలిపింది. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు షమీమ్, రమేష్, సురేష్ లను సిట్ ఆరెస్ట్ చేయగా మార్చి 23న అరెస్ట్ చేసిన ముగ్గురు నిందితుల నుండి ఒక ల్యాప్ టాప్, మూడు మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. (ఏజెన్సీలు)