చలికాలం! టిఎస్ ఆర్టీసీ సంస్థ డ్రైవర్లందరూ ప్రమాదాలను నివారించాలి- బాజిరెడ్డి గోవర్ధన్

మన టిఎస్ ఆర్టీసీ సంస్థ డ్రైవర్లందరూ ప్రమాదాలను నివారించాలి.

విధి నిర్వహణలో ఏమాత్రం అలసత్వం వహించవద్దు.

చలికాలం ఉష్ణోగ్రతలు పడిపోతున్న సందర్భంగా రోడ్డుపైన దట్టంగా పొగ మంచు కురుస్తున్న సమయంలో డ్రైవర్ సోదరులు చాకచక్యంగా వ్యవహరించాలి.

చలికాలంలో డ్రైవర్లందరూ పాటించవలసిన టిఎస్ ఆర్టిసి సంస్థ భద్రత సూక్తులు.

టిఎస్ ఆర్టిసి చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ గారు పలు సూచనలు చేశారు.

హైదరాబాద్: ఆగండి.. ఆలోచించండి.. ఆచరించండి.. నివారించండి.. !! మన ఆర్టీసీ సంస్థ ఎంతో కాలంగా ప్రయాణికుల భద్రతకు మారుపేరుగా నిలించింది. జాతీయ స్థాయిలో అతి తక్కువ ప్రమాద రేటులో అనేక అవార్డులు అందుకున్న మన టిఎస్ ఆర్టిసి సంస్థకు ఉంది. కాగా సుశిక్షుతులైన డ్రైవర్లు కలిగి ఉన్న సంస్థ ఆర్టీసీ సంస్థ. చలికాలంలో డ్రైవర్ సోదరులు మరోసారి భద్రతా నియమాలను మననం చేసుకుని తూ.చ పాటిస్తూ సురక్షిత డ్రైవింగ్ చేయడం ఎంతైనా అవసరం ఉందని… టీఎస్ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు తెలియజేశారు..

ప్రస్తుతo చలికాల సమయంలో ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల వేకువజామున పొగ మంచు దట్టంగా కురుస్తుంది. ఈ సందర్భంగా టిఎస్ ఆర్టిసి సంస్థ డ్రైవింగ్ సోదరులకు ప్రమాదాల నివారణ చర్యలో భాగంగా అత్యవసర ఉత్తర్వులను జారీచేసిన సంస్థ చైర్మన్ శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు.

  1. హైవే మరియు ఫారెస్ట్ రోడ్డు, నగర శివారు ప్రాంతాలలో వేగనియంత్రణ పాటించవలెను.
  2. ప్రమాదకరమైన జంక్షన్ మరియు మలుపుల వద్ద ఇండికేటర్ ను ఉపయోగించవలెను.
  3. ముందు వెళ్ళే వాహనముతో సురక్షిత దూరాన్ని పాటించవలెను. పొగ మంచు ఉన్నచోట హారన్, లైట్లు వాడవలెను.
  4. హైవే మరియు అడవి రోడ్డు ప్రాంతాలలో దట్టమైన పొగమంచు ఉన్న ప్రాంతములో డ్రైవింగ్ చేయునపుడు వైపర్ వాడవలెను.
    హెడ్ లైట్ ను lowbeam లో మరియు ఫాగ్ lights తప్పనిసరిగా వాడవలెను. బస్సు వేగాన్ని తగ్గించి నిదానంగా వెళ్లవలెను.
  5. దట్టమైన పొగమంచు వలన ముందు దారి కనపడని సమయములో బస్సును రోడ్డు ప్రక్కన ఆపి హెడ్ లైట్స్ మరియు ఇండికేటర్ వేయవలెను.
  6. Windscreen గ్లాసులను వైపర్ తో బయట వైపు శుభ్రపరచవలెను. లోపల వైపు ఏదైనా క్లాత్ తో శుభ్రపరచవలెను.
  7. డ్యూటికి బయలుదేరుటకు ముందే వైపర్, హెడ్ లైట్స్ పనితీరును పరిశీలించుకొనవలెను. తెల్లవారుజామున 3-5 గంటల సమయములో సమీప బస్ స్టేషన్ నందు ఆపుకొని నీళ్ళతో ముఖంకాళ్ళు చేతులు శుభ్రపరుచుకొనవలెను.
  8. రోడ్డు మరమ్మత్తులో ఉన్నపుడు బస్సును నిదానంగా నడిపించవలెను. డ్యూటికి వచ్చే ముందు తగిన విశ్రాంతి తీసుకొనవలెను.
  9. రోడ్డుపైన దట్టమైన పొగమంచు ఉన్న సమయంలో వాహనాన్ని ఓవర్ టేక్ చేయరాదు.
  10. అకస్మాత్తుగా సడన్ బ్రేక్ వేయకూడదు. తప్పకుండా లైట్లు వేసి వాహనాన్ని నియంత్రణలో నడపాలి.
  11. హైవే రోడ్డులలో దట్టమైన పొగమంచు ఉన్న సమయంలో డ్రైవింగ్ చేయునపుడు ఎదురుగా వచ్చే వాహనదారులతో ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది కనుక ఎట్టి పరిస్థితులో wrong route లో వెళ్లరాదు.
  12. సెంట్రల్ లైన్ క్రాస్ చేయరాదు.
  13. అకస్మాత్తుగా బస్సు యొక్క దిశను మార్చకూడదు.
  14. అతివేగంగా బస్సును నడపరాదు.
  15. అకస్మాత్తుగా ఇండికేటర్ వేయడం వలన వెనుక వచ్చే వాహనాలతో ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది కనుక సడన్ గా ఇండికేటర్ వేయకూడదు.
  16. రోడ్డు మరమ్మత్తులో ఉన్నపుడు అతి వేగం తో డ్రైవింగ్ చేయరాదు.
  17. బ్రేక్ సిస్టమ్ నుంచి ఎలాంటి ఏయిర్ లీకేజీలు ఉన్నాయో గమనించాలి.
  18. ఘాట్ రోడ్డు ప్రయాణంలో ఎట్టి పరిస్థితిలోనూ బస్సును న్యూట్రల్ చేసి నడవకూడదు.
  19. హైదరాబాద్ నగర శివారులో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలి.
  20. బస్సులో ఫుట్ బోర్డు ప్రయాణాన్ని నివారించాలి, ఫుట్ బోర్డు లో ఉన్న ప్రయాణికులను బస్సు లోపలికి చేర్చుకోవాలి.
  21. నగరంలో అనేక మంది ప్రయాణికులు నడిచే బస్సు ఎక్కడం జరుగుతుంది. దీని ద్వారా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వారి యొక్క గమ్య స్థానం లోనే కండక్టర్, డ్రైవర్ గారు ఆపగలరు, బస్సులోకి చేర్చుకోగలరు.
  22. చరవాణి మాట్లాడుతూ, మరియు ఒంటిచేత్తో డ్రైవింగ్ చేయవద్దు.

ఎంతో పేరున్న మన ఆర్టీసీ సంస్థ ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా డ్రైవరు మరియు కండక్టర్ గార్లు సురక్షితంగా బస్సులు నడిపి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకొని సంస్థకు సహకరించాలని సంస్థ చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X