Aaj Tak Sahitya Sammelan: విచ్ఛిన్నకారుల పట్ల కవులు కలానికి పదునుపెట్టాలి – MLC కవిత

వచ్చే ఏడాది నుంచి భారత్ జాగృతి ఫౌండేషన్ ‌- ఇండియా టుడే సాహిత్య పురస్కారం

ఆజ్ తక్ సాహిత్య సమ్మేళనంలో ప్రకటించిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

नई दिल्ली : टीआरएस एमएलसी के कविता रविवार को नई दिल्ली में आयोजित आजतक (इंडिया टुडे) संगठन के साहित्य सम्मेलन कार्यक्रम में शामिल हुईं। उन्होंने घोषणा की कि अगले वर्ष से भारत जागृति फाउंडेशन-इंदु टुडे संस्था साहित्य के क्षेत्र में महत्वपूर्ण योगदान देने वालों को संयुक्त रूप से साहित्यिक पुरस्कार देगी।

న్యూఢిల్లీ: సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్న వారి పట్ల కలాన్ని పదును పెట్టి సమాజాన్ని ఐక్యంగా ఉంచేలా కృషి చేయాలని కవులకు, రచయితలకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, భారత్ జాగృతి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ఈ దేశంలో సమాజాన్ని విడదీసే వాతావరణాన్ని మనం చూస్తున్నామని, ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో ఈ దేశంలో సహృద్భావ వాతావరణం సృష్టించడానికి సాహిత్య కారులు కృషి చేయాలని కోరారు.

ఆదివారం రోజున న్యూఢిల్లీలో జరిగిన ఆజ్ తక్ (ఇండియా టుడే) సంస్థ వారి సాహిత్య సమ్మేళనం కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. సాహిత్య రంగానికి విశేషంగా కృషి చేసిన వారికి వచ్చే ఏడాది నుంచి భారత్ జాగృతి ఫౌండేషన్ ‌- ఇండియూ టుడే సంస్థ సంయుక్తంగా సాహ్యిత పురస్కారాన్ని అందిస్తాయని ప్రకటించారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ “సాహిత్యం జ్ఞానాన్ని ఇస్తుందటారు. సాహిత్యం జ్ఞానాన్ని ఇవ్వాలి అదే సమయంలో సమాజంలో మంచి వాతావరణం సృష్టించేలా సాహిత్యం ఉండాలి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు రీత్యా దేశంలో మంచి వాతావరణం కల్పించే బాధ్యత కవులు, రచయితలపై ఉంటుంది. సాహిత్యకారులను ప్రోత్సహించడానికి, వారికి అండగా ఉండడానికి అవార్డును నెలకొల్పాము” అని వ్యాఖ్యానించారు.

ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా కవులు, రచయితలు దేశం పట్ల మరింత బాధ్యతలో రచనలు చేస్తారని అభిప్రాయపడ్డారు. దేశంలో సమాజాన్ని విడగొట్టడానికి, మనస్సులను దూరం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్న పరిస్థితి నెలకొందని, కాబట్టి కలానికి పదును పెట్టాలని కవులు, రచయితలకు పిలుపునిచ్చారు. విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తే కవులు సమాజాన్ని కలిపేందుకు కృషి చేయాలని అన్నారు.

ఆ కృషికి భారత్ జాగృతి ఫౌండేషన్, ఇండియా టుడేతో పాటు తామంతా అండగా నిలబడుతామని, కలిసి నడుస్తామని స్పష్టం చేశారు. సాహిత్యకారులను సన్మానించుకుంటే సమాజపు గౌరవం పెరుగుతుందని చెప్పారు. యువతకు సాహిత్యం అర్థంకాదని… భారతీయ సంస్కృతిని ముందుకు తీసుకెళ్లడంలో కలిసి రావడం లేదని కొంత మంది అంటారని, కానీ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత పాల్గొనడం గర్వంగా ఉందని స్పష్టం చేశారు.

దేశ సాహిత్యం భారత యువత చేతుల్లో భద్రంగా ఉందని భావిస్తున్నానని కవిత తెలియజేశారు. సాహిత్య ప్రేమికురాలిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నానని తెలిపారు. శబ్దమే శక్తి అని తాను బలంగా విశ్వసిస్తానన్నారు. ఒక శబ్దం లక్షాలది హృదయాలను కదిలిస్తుందని చెప్పారు. ప్రస్తుతం దేశంలో పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నామని అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X