హైదరాబాద్ : టీపీసీసీ ఆధ్వర్యంలో బోయినిపల్లి గాంధీ ఐడియాలోజి కేంద్రంలో టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ అధ్యక్షతన శిక్షణ కార్యక్రమం ప్రారంభమైనది. శిక్షణ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, సంపత్ కుమార్, చిన్నారెడ్డి, సీనియర్ నాయకులు మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, రామచంద్రారెడ్డి, సంభాని చంద్రశేఖర్, కోదండ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, మల్లు రవి, హర్కర వేణుగోపాల్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాములు నాయక్, నిరంజన్, పీఏసీ, పిఈసి సభ్యులు, సీనియర్ ఉపాధ్యక్షలు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల చైర్మన్ లు, పీసీసీ ప్రతినిధులు పాల్గొన్నారు.
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… “దేశ సరిహద్దులను ఆక్రమణలకు గురవుతున్న ప్రధాని మోదీ స్పందించడం లేదు. అలాంటిదేమీ లేదని ప్రధాని చెప్పడం దురాక్రమనలకు అనుమతి ఇచినట్లే. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ కు కృషి చేసిన పార్టీ కాంగ్రెస్. ప్రధానిగా అవకాశం వచ్చినా సోనియా పదవి స్వీకరించలేదు. దేశానికి మంచి నాయకత్వాన్ని సోనియా అందించారు. ఎముకలు కొరికే చలిలో సైతం రాహుల్ జోడో యాత్ర చేస్తున్నారు. దేశంలో విష్చిన్నకర శక్తులకు భయపడకుండా ప్రాణాలకు తెగించి యాత్ర చేస్తున్నారు. జనవరి 26న జెండా ఎగరేయడంతో బాధ్యత తీరలేదు.”
“అందుకే కాంగ్రెస్ జాతీయ నాయకత్వం హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమం చేపట్టాలని సూచించింది. ప్రతీ గడపకు తట్టి రాహుల్ గాంధీ సందేశాన్ని ప్రజలకు చేరవేయాలి. పార్టీ ప్రతిష్టను పెంచేలా సందేశాన్ని తీసుకెళ్ళాల్సిన బాధ్యత నాయకులపై ఉంది. ధరణి తో లక్షలాది మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఓటరు లిస్టులో కాంగ్రెస్ సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తే వాటిని తిరిగి చేర్పించాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై , కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలపై చార్జిషీట్ విడుదల చేద్దాం. వాటిని ప్రజల్లోకి తీసుకెళదాం. నిపుణులు అందరి సూచనలతో భవిష్యత్ కార్యాచరణ రూపొందిద్దాం. 2003 లో ఎలాంటి విపత్కర పరిస్థులను ప్రజలు ఎదుర్కొన్నారో 2023లో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఈ పరిస్థితుల నుంచి ప్రజలను రక్షించేది కాంగ్రేస్. మనందరం కష్టపడితే కేసీఆర్ ఒక లెక్క కాదు. బండ్లతోని, గుండ్లతోని అయ్యేది ఏం లేదు. అందరం కలిసికట్టుగా కష్టపడితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం.”