హైదరాబాద్ : ఐదవ రోజు కామపల్లి మండలం లచ్చ తండా నుంచి మొదలైన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో పాదయాత్ర. యాత్రలో రేవంత్ రెడ్డిగారిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్న మరణించిన జవాన్ కుటుంబ సభ్యులు.
తమకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉపాధి, ఉద్యోగం కల్పించేలా చూడాలని కోరిన జవాన్ భూక్య రమేష్ భార్య రేణుక. రెనుకకు ముగ్గురు పిల్లలు. జనవరి 5న విధుల్లో ఉండగా మరణించిన జవాన్ భూక్యా రమేష్. జీవనాధారం లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబం.
హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా బర్లగూడెంలో ఓ ఇంటికి హాత్ సే హాత్ జోడో డోర్ స్టిక్కర్ ను అంటించి, కర పత్రం అందించిన రేవంత్ రెడ్డి గారు. కామపల్లిలో గతంలో మరణించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు. ఎస్ కె సోనా కృపాకర్ చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబాన్ని పరామర్శించిన రేవంత్ రెడ్డి గారు.
పొన్నెకల్ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద రైతుల ఆందోళనకు మద్దతు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు. 24 గంటల కరెంటు ఇస్తున్నామని చెప్పి వ్యవసాయానికి కనీసం 5 గంటలు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు.
రైతులతో సబ్ స్టేషన్ ముందు బైఠాయించి సమస్యలు తీగెలుసుకున్న రేవంత్ రెడ్డి. ఏసీడీ చార్జీల భారం మోపుతున్నారని,పంట చేతికి వచ్చే సమయంలో కరెంటు కోతలతో ఇబ్బందులు పడుతున్నామన్న రైతులు.
కొన్నేకల్ లో చిన్నారులతో కలిసి రేవంత్ రెడ్డిని కలిసిన నిర్మాలయ స్కూల్ ఉపాధ్యాయులు. యాత్రలో రేవంత్ రెడ్డి గారిని కలిసిన రాయగూడెంకు చెందిన గౌడన్నలు. తమ ప్రాంతాన్ని ఏజెన్సీగా సాకు చూపి సొసైటీలను రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేసిన గౌడన్నలు. సొసైటీ ఏర్పాటు చేసుకునేలా అవకాశం కల్పిస్తే ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకునే వీలు ఉంటుందన్న గౌడన్నలు. పూర్తి వివరాలు తెలుసుకుని న్యాయం చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డిగారు.
బండిపహాడ్ లో ఇటుకబట్టీ కార్మికుల సమస్యలు తెలుసుకున్న రేవంత్ రెడ్డి. వారు నివసించే గుడిసెలోకి వెళ్లి కాసేపు ముచ్చటించిన రేవంత్. సావధానంగా వారి సమస్యలు విన్న రేవంత్. కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని హామీ.