హైదరాబాద్ : టీపీసీసీ ఆధ్వర్యంలో ఈ రోజు చేపట్టిన ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం అయ్యింది. టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఉదయం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు ఆధ్వర్యంలో జెండావిష్కరణ చేశారు. అనంతరం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు కార్యక్రమం గురించి వివరించారు.
ప్రధానంగా ధరణి వెబ్సైట్ మీద సుదీర్ఘంగా చర్చ జరిగింది. ధరణి విషయంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు హర్కర వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి నీలిమ ఆధ్వర్యంలో ధరణి విషయంలో పవర్ పాయింట్ పర్సెంటేషన్ ఇచ్చారు. ఈ విషయం లో న్యాయవాది సునీల్ న్యాయ పరమైన అంశాలను వివరించారు. అలాగే కిసాన్ కాంగ్రెస్ నాయకులు కోదండ రెడ్డి, అన్వేష్ రెడ్డి, జానారెడ్డి, జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీ, మల్లు రవి, సంపత్ కుమార్, తదితరులు ప్రసంగించారు.
అలాగే జనవరి 26వ తేదీ నుంచి జరగనున్న హాత్ సే హాత్ జోడో కార్యక్రమానికి సంబంధించి ఏఐసీసీ పరిశీలకులు గిరీష్ ఛందోకర్ పాల్గొని ప్రసంగించారు. జనవరి 26 నుంచి జరగాల్సిన కార్యక్రమానికి సంబంధించి ముందస్తు చేసే కార్యక్రమాలకు సంబంధించి వివరించారు. అలాగే ఎన్నికల సంఘానికి సంబందించిన అంశంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు నిరంజన్, మీడియా సంబంధాల గురించి దక్కన్ క్రానికల్ చీఫ్ కర్రీ శ్రీరామ్, సోషల్ మీడియాకు సంబంధించి మన్నే సతీష్, ఇన్సూరెన్స్ కు సంబంధించి మల్లాది పవన్ లు వారి వారి కార్యక్రమాలను వివరించారు.
వర్కింగ్ ప్రసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, సంపత్ కుమార్, చిన్నారెడ్డి, సీనియర్ నాయకులు మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, రామచంద్రారెడ్డి, సంభాని చంద్రశేఖర్, ప్రసాద్ కుమార్, కొండ సురేఖ, మాజీ ఎంపీ లు పొన్నం ప్రభాకర్, రాజయ్య, కోదండ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాములు నాయక్, నిరంజన్, పీఏసీ, పిఈసి సభ్యులు, సీనియర్ ఉపాధ్యక్షలు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల చైర్మన్ లు, పీసీసీ ప్రతినిధులు పాల్గొన్నారు.