టీపీసీసీ నూతన అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి ఓబీసీ సంఘాలచే ఘనంగా సన్మానం, ముఖ్య అతిధులుగా…

హైదరాబాద్ : రవీంద్రభారతిలో టీపీసీసీ నూతన అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి మాజీ ఎంపీ వి. హనుమంతరావు అధ్యక్షతన రాష్ట్ర ఓబీసీ సంఘాలచే ఘనంగా సన్మాన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిధులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క హాజరైనారు.

కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీలు అమీర్ అలీఖాన్, ఎగ్గే మల్లేశం, ఎమ్మెల్యేలు వినోద్ , వీర్లపల్లి శంకర్, మక్కన్ సింగ్ ఠాకూర్, వ్యవసాయ శాఖ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, కార్పోరేషన్ చైర్మన్లు నిర్మలా జగ్గారెడ్డి, ఈరవత్రి అనిల్, శివసేన రెడ్డి, ప్రితం, మెట్టు సాయి కుమార్, కాల్వ సుజాత, చల్లా నరసింహ రెడ్డి, మత్తినేని వీరయ్య, ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షులు రోహిన్ రెడ్డి, బీసీ సంఘం జాతీయ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి శంకర్ రావు ఇతర ముఖ్య నేతలు పాల్గోన్నారు. నూతన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కి బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఘన సత్కారం జరిగింది.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో తీసుకెళ్తూ పార్టీని ముందుకు నడిపిన వ్యక్తిగా పిసిసి గా నియామకం అయ్యారు. మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర nsui అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను కరీంనగర్ NSUI అధ్యక్షుడిగా ఉన్నను. మహేష్ అన్న నాకంటే ఎక్కువ శ్రమ పడ్డారు. అవకాశాలు వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకున్నారు. వారసత్వ రాజకీయాలు కాకుండా క్షేత్ర స్థాయిలో బలహీన వర్గాల నుండి జెండా పట్టుకొని పైకి వచ్చాం. మాకు ఎవరు ఇస్తారు అవకాశాలు అనుకోకూడదు. పోరాటం చేయాలి గుంజుకోవాలి కొట్లాడాలి. మా నాయకుడు రాహుల్ గాంధీ జీత్నా హిస్సేదారి ఉత్నా భాగీదారి అని కుల గణన చేసి తీరుతామని పార్లమెంట్ లో చెప్పారు.

మంత్రి మాట్లాడుతూ… రాబోయే తరాలలో బలహీన వర్గాలు ఎస్సి ఎస్టీ లకు న్యాయం జరుగుతుంది. బలహీన వర్గాల మంత్రిగా కుల గణన కు సంబంధించి అసెంబ్లీ లో బిల్లు పెట్టుకున్నాం. నిధులు కేటించుకున్నం. బీసీ కమిషన్ ఏర్పడిన వారం రోజుల్లోనే కుల గణన పై కమిటీ వేశాం. కుల గణన పై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది. మీరు ఏం చేసిన కుల గణన చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంది. రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ లకు న్యాయం జరిగేలా రిజర్వేషన్ ల ప్రక్రియలో ఎన్నికలు జరుగుతాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక సంఖ్యలో బీసీ ల ప్రాధాన్యత ఉండాలి.

Also Read-

రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యా కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. పాఠశాలకు మౌలిక వసతులు కల్పిస్తున్నాం. మేమంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివి వచ్చాం. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనీ చేస్తున్నాం. మహేష్ కుమార్ గౌడ్ పార్టీలో మేము ప్రభుత్వంలో బలహీన వర్గాలకు ఎస్సి, ఎస్టీ, బీసీ లకు న్యాయం జరిగేలా ప్రయత్నం చేయాలి. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం. విద్యార్థి స్థాయి నుండి వచ్చి ఎన్ని కష్టాలు వచ్చిన జెండా వదలకుండా పార్టీ మారకుండా పార్టీలోని ఉన్నాం. పార్లమెంట్ సభ్యుల ఓబీసీ కన్వీనర్ గా పని చేశాం. అనేక రాష్ట్రాలు తిరిగాం. గత ప్రభుత్వంలో బీసీ లకు 27 శాతం రిజర్వేషన్లు కూడా అమలు కాలేదు.

10 సంవత్సరాలుగా బీజేపీ బలహీన వర్గాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది. ఈ అంశాలను బయటకు రానివ్వడం లేదు. బలహీన వర్గాలకు అండగా ఉంటూ మాకు రావాల్సిన హక్కులపై ఉండాలి. ఇది సన్మానం కాదు. బడుగు బలహీనవర్గాలకు న్యాయం చేసే దిశలో భారంగా ఉండాలి. పార్టీని బలోపేతం చేస్తూ మనమంతా కలిసి ముందుకు పోవాలి. NSUI బిడ్డగా రాష్ట్ర అధ్యక్షులు అయినా మీకు తమ్ముడిగా మీకు శుభాకాంక్షలు. మీకు అన్ని రకాలుగా శుభం జరగాలని కోరుకుంటున్నను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X