बीआरएस को हराने के लिए तीन BRS (बंडी, रेवंत, शर्मिला) एकजुट हो गये
తెలంగాణాను కాపాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్
మన పిల్లల భవిష్యత్…రాష్ట్ర భవిష్యత్ నిర్ణయించేది బీఆర్ఎస్ పార్టీ
నా చివరి రక్తం బొట్టు వరకు కార్యకర్తల ముఖంలో చిరునవ్వు కోసం పని చేస్తా
ఏ ఒక్క కార్యకర్తకు బాధ కలిగినా నాకు కలిగినట్టే
ప్రజల మన్ననలు పొందే దిశగా పనులు చేయాలి
పార్టీని కార్యకర్తలు కాపాడితే..కార్యకర్తలను పార్టీ కాపాడుకుంది
రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు కలిగిన ఏకైక పార్టీ బీఆర్ఎస్
రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధితో పచ్చగా ఉన్న తెలంగాణను చూసి ఓర్వ లేక, ఇక్కడి వనరులు, నిధులు కొల్లగొట్టాలని బండి సంజయ్, రేవంత్ రెడ్డి, షర్మిల ముగ్గురు బీ.ఆర్.ఎస్ లు ఏకమయ్యారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం నగునూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కరీంనగర్ రూరల్ మండల బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ….నా బలమే కార్యకర్తలు అని… ఏ ఒక్క కార్యకర్తకు బాధ కలిగినా నాకు కలిగినట్టేనని, నా చివరి రక్తం బొట్టు వరకు కార్యకర్తల ముఖంలో చిరునవ్వు కోసం పని చేస్తానని అన్నారు. మనమందరం కెసిఆర్ బలగమని… మనమంతా ఐకమత్యంగా ఉండి బిఆర్ఎస్ పార్టీని మరింత బలపేతం చేసుకుందామన్నారు. తెలంగాణ రాకముందు మనమందరం ఉన్నామని… ఎంతో మంది సిఎం, పిఎంలు వచ్చారు పోయారే తప్ప మనకోసం చేసిందేమి లేదన్నారు. కానీ మన పరిస్థితులు ఎలా ఉండేవో ఆలోచించుకోవాలన్నారు.
సమైక్య పాలనలో… కరెంట్ ఎప్పుడు వస్తుందో పోతుందో తెలియదని… తాగునీటి కోసం ట్యాంకర్ల వద్ద యుద్దాలు చేసిన రోజులు ఉండేవని, కాని తెలంగాణ వచ్చిన తర్వాత కరెంట్, తాగునీటి ఇబ్బందిలేకుండా చేశామని అన్నారు. సమైక్య పాలనలో 75 సంవత్సరాలుగా పేరుకుపోయిన దరిద్ర్యాన్ని తొలగిస్తున్నామని అన్నారు. తెలంగాణ లో ముఖ్యమంత్రి గా కెసిఆర్ ఉన్నారు కాబట్టే మన వనరులను మనం సంరక్షించుకొని వాడుకునే పరిస్థితి ఉందని అన్నారు. పచ్చని తెలంగాణను చూసి విపక్షాలకు, కడుపు మంట, కళ్ళ మంట ప్రారంభం అయిందని, మన వనరులను కొల్లగొట్టాలని, రాజ్యాధికారం కావాలని మాయమాటలు చెప్పి ఓట్లు దండుకోవలని చూస్తున్నారని అన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అధిష్టానం ఢిల్లీలో ఉందని అక్కడి నుండి కంట్రోల్ చేస్తూ ఇక్కడి వనరులను దోచుకోవడానికి చూస్తున్నారని అన్నారు. తెలంగాణను కాపాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని మన పిల్లల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది టిఆర్ఎస్ పార్టీ అని అన్నారు. రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు కేవలం టిఆర్ఎస్ పార్టీకే ఉందని చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు ఇదే విషయం చెప్తారని అన్నారు.
మనమంతా ఒక కుటుంబమని కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు సహజమని వాటిని అంతర్గతంగా పరిష్కరించుకుందామని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నారని ఆయన చేతులకు మనమంతా బలం కావాలని అన్నారు. కార్యకర్తలు పార్టీని కాపాడితే పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటుందని క్రమశిక్షణ కలిగిన పార్టీ టిఆర్ఎస్ అని అందరూ క్రమశిక్షణ దాటద్దని సూచించారు.