నవీన్ చెప్పేవన్నీ అన్నీ అబద్ధాలే, పెళ్లి పేరుతో ఇబ్బంది పెట్టాడు, కారు నా పేరు మీద లేదు: బాధిత యువతి

Hyderabad: కిడ్నాప్ కేసులో నిందితుడు నవీన్ తో తనకు పెళ్లి జరగలేదని రంగారెడ్డి జిల్లా మన్నెగూడడాక్టర్ వైశాలి క్లారిటీ ఇచ్చింది. తన పట్ల నవీన్ ఘోరంగా ట్రీట్ చేశాడని… నవీన్ అంటే తనకు ఇష్టం లేదని చాలాసార్లు అతనితో చెప్పానని పేర్కొంది. నవీన్ రెడ్డితో కేవలం పరిచయం మాత్రేమే ఉందని బాధితురాలు తెలిపింది. నవీన్ తనను చాలాసార్లు కొట్టినట్లు స్పష్టం చేసింది. కిడ్నాప్ తర్వాత ఏం జరిగిందన్నది స్పష్టంగా వివరించింది వైశాలి. కిడ్నాప్ తర్వాత.. తనపై చాలా ఘోరంగా దాడి చేశారని వైశాలి తెలిపింది. చాలా ఘోరంగా కొట్టారు. గోళ్లతో గిచ్చారు. కొరికారంటూ వైశాలి కన్నీరుమున్నీరైంది.

అతను చెప్పేవన్నీ అబద్ధపు మాటలేనని… తన పేరుతో ఫేక్ ఇన్ స్టా గ్రామ్ క్రియేట్ చేసి ఫొటోలు మార్ఫింగ్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఏదైనా ఎక్కువ చేస్తే తన తండ్రిని చంపేస్తానని బెదిరించాడని చెప్పింది. తనను కిడ్నాప్ చేసిన కారులో నవీన్ రెడ్డితో పాటు మరో ఆరుగురు కారులో ఉన్నారని చెప్పింది. తనను 10 మంది పట్టుకుని చాలా ఘోరం కారులోపలికి తోశేశారు. నన్ను నవీన్ చాలా ఘోరంగా ట్రీట్ చేశాడని బాధ వ్యక్తం చేశారు. ఇక్కడ సైలెంట్‌గా ఉంటేనే.. అక్కడ మీ డాడీ వాళ్లు సేఫ్‌గా ఉంటారని.. లేకపోతే చంపేస్తామని బెదిరించారని వివరించారు. నవీన్ అంటే తనకు ఇష్టం లేదని.. తమకు పెళ్లైందని అతను చెప్తుంది అబద్దని స్పష్టం చేశారు. పెళ్లయిందని చెప్తున్న రోజు తాను ఆర్మీ ఆస్పత్రిలో డెంటర్ ట్రిట్‌మెంట్ తీసుకుంటున్నాని తెలిపింది.

“నవీన్ రెడ్డీ అంటే నాకు ఇష్టం లేదు. నన్ను నవీన్ చాలా ఘోరంగా ట్రీట్ చేశాడు. నేను చెప్పినట్టు వినకపోతే.. మా డాడీని చంపేస్తామని బెదిరించారు. నన్ను ఇష్టపడి ఇకొకరిని ఎలా పెళ్లి చేసుకుంటావని బెదిరించాడు. ఇష్టం లేదని చెప్పినా పట్టించుకోలేదు. నా ఇష్టంతో పని లేదని అన్నాడు. కార్లో చాలా ఘోరంగా కొట్టాడు. నా లైఫ్, కెరియర్ మొత్తం పాడుచేసాడు. నాకూ అతనికి పెళ్లి జరిగిందన్నది పచ్చి అబద్దం. ఆ రోజు నేను డెంటల్ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నా. కావాలంటే.. ఆధారాలు కూడా ఇస్తా. ఎలాంటి ఆధారాలు లేకుండా ఏవేవో చెప్తున్నారు.

నేను నన్ను వేదింపులు గురిచేస్తున్నాడని 3 నెలల క్రితమే పోలీసులకు పిర్యాదు చేశా. కానీ.. పొలీసులు పట్టించుకోలేదు. పోలీసులు కనుక పట్టించుకుని ఉంటే ఇంత వరకు వచ్చేది కాదు. ఒకవేళ నేనూ ఇష్టపడి ఉంటే.. నా కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకునే దాన్ని కదా. నాకు ప్రొటెక్షన్ కావాలి. కిడ్నాప్ చేసిన నవీన్‌తో పాటు అతనితో ఉన్న వాళ్లందరినీ కఠినంగా శిక్షించాలి.” అంటూ వైశాలి కన్నీరుమున్నీరైంది.

నవీన్ చెప్పేవన్నీ అన్నీ అబద్ధాలే అని బాధితురాలు తెలిపింది. పెళ్లి పేరుతో నవీన్ తనను ఇబ్బంది పెట్టాడని చెప్పింది. తనకు భయంగా ఉందని…తనకు సెక్యూరిటీ కావాలని పోలీసులను వేడుకుంది. కారు తన పేరు మీదనే ఉంది అనేది అవాస్తమని బాధిత వైశాలి స్పష్టం చేసింది. (Agencies)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X