हैदराबाद: बेंगलुरु में रविवार को हुई बेमौसम बारिश ने दुखों से भर दिया। ज्ञात हो कि शहर के केआर चौराहे के पास अंडरपास में कार डूबने की घटना में आंध्र प्रदेश की सॉफ्टवेयर इंजीनियर भानुरेखा (22 वर्ष) की मौत हो गयी थी। मुख्यमंक्षी सिद्दरामय्या ने मृतक महिला के परिजन को पांच लाख रुपये मुआवजे की घोषणा की। केपी अग्रहारा इलाके में एक 31 वर्षीय लोकेश कुमार का शव एक सीवर में मिला था। इसके साथ ही बेंगलुरु में बाढ़ से मरने वालों की संख्या 5 हो गई है।
इसी बीच इस बाढ़ की वजह से बेंगलुरु के एक ज्वेलरी शॉप को काफी नुकसान हुआ है। दुकान में अचानक बाढ़ का पानी आ जाने से सोने के गहने बाढ़ के पानी में बह गए। इस घटना का वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है। बाढ़ के पानी में गहनों के बह जाने के दृश्य देखना स्वर्ण प्रेमियों के लिए हृदय विदारक है।
दुकान में कूड़ा-करकट मिला गंदा पानी एक दम से भर गया। निहान ज्वेलरी की मालकिन प्रिया ने कहा कि उनके कर्मचारी शटर भी बंद नहीं कर पाए। वह यह कहते हुए फूट-फूट कर रोने लगी कि बाढ़ के पानी में सोने के गहने बह गए। उन्होंने कहा कि बाढ़ के पानी में करीब दो करोड़ रुपए के जेवरात बह गए।
कुछ दिनों से हो रही बारिश से बेंगलुरु शहर के साथ-साथ कर्नाटक राज्य के कई हिस्से प्रभावित हो रहे हैं। ओलावृष्टि और तेज हवाएं कहर बरपा रही हैं। कई जगह बड़े-बड़े पेड़ गिर गए। बिजली के खंभे नीचे गिरे पड़े है। बेंगलुरु शहर की सड़कें कचरे और मलबे से भरी हैं। बेंगलुरु के निवासियों से लगभग 1000 शिकायतें मिली हैं कि वे बाहर कदम नहीं रख पा रहे हैं। नगर निगम के कर्मचारी सड़कों पर जमा कचरे को हटाने के लिए मशक्कत कर रहे हैं।
బెంగళూరులో ఆదివారం కురిసిన అకాల వర్షాలు తీవ్ర విషాదం నింపాయి
హైదరాబాద్: బెంగళూరులో ఆదివారం కురిసిన అకాల వర్షాలు తీవ్ర విషాదం నింపాయి. నగరంలోని కేఆర్ కూడలి సమీపంలోని అండర్ పాస్‌లో కారు నీటిలో మునిగిపోయిన ఘటనలో ఏపీకి చెందిన భానురేఖ (22 ఏళ్లు) అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి చెందిన విషయం తెలిసిందే. కేపీ అగ్రహార ప్రాంతంలోని ఓ మురుగు కాల్వలో లోకేశ్ కుమార్ అనే 31 ఏళ్ల యువకుడి మృతదేహం లభ్యమైంది. వరదల కారణంగా బెంగళూరులో మృతి చెందిన వారి సంఖ్య 5కు చేరింది.
ఇదిలా ఉండగా ఈ వరదల కారణంగా బెంగళూరులోని ఓ జ్యువెల్లరీ షాప్ తీవ్రంగా నష్టపోయింది. దుకాణంలోకి ఆకస్మికంగా వరద నీరు రావడంతో ఆ వరద నీటిలో బంగారు ఆభరణాలు కొట్టుకుపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వరద నీటిలో నగలు కొట్టుకుపోతున్న దృశ్యాలను చూస్తుంటే బంగారం ప్రియుల గుండె తరుక్కుపోయేలా ఉంది.
చెత్తా చెదారంతో కలిసిన మురికి నీరు షాపులోకి ఒక్కసారిగా ముంచెత్తాయి. తమ సిబ్బంది షటర్లు కూడా మూయలేకపోయారని ‘నిహాన్ జ్యువెల్లరీ’ దుకాణం యజమాని ప్రియ తెలిపారు. దీంతో బంగారు ఆభరణాలు వరద నీటిలో కొట్టుకుపోయాయని చెబుతూ ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. సుమారు 2 కోట్ల రూపాయల ఆభరణాలు వరద నీటి పాలయ్యాయని ఆమె చెప్పారు.
‘షాపులోకి మురుగు, చెత్తాచెదారంతో కూడిన వరద నీరు రావడం గమనించి వెంటనే మున్సిపల్ అధికారులకు ఫోన్ చేశాం. సహాయం కోరాం. కానీ, మాకు సహాయం చేసేందుకు ఎవరూ రాలేదు. షాపులోని 80 శాతం బంగారం వరదనీటిలో కొట్టుకుపోయింది’ అని ప్రియ తెలిపారు. బెంగళూరులోని మల్లేశ్వర్ ప్రాంతంలో ‘నిహాన్ జ్యువెల్లరీ’ నగల దుకాణం ఉంది. అక్కడికి సమీపంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. తమ షాపులోకి ఆకస్మిక వరద రావడానికి ఆ నిర్మాణ పనులే కారణమని ప్రియ ఆరోపిస్తున్నారు.
బెంగళూరు నగరంతో పాటు కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వడగండ్ల వాన, ఈదురుగాలులు బీభత్సం చేస్తున్నాయి. పలు చోట్ల భారీ వృక్షాలు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. బెంగళూరు నగరంలో రహదారుల నిండా చెత్త, చెదారం పేరుకుపోయింది. బయట అడుగు పెట్టలేని పరిస్థితి ఉందంటూ.. బెంగళూరు నగర వాసుల నుంచి 1000 వరకూ ఫిర్యాదులు అందాయి. రోడ్లపై పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది అవస్థలు పడుతున్నారు. (ఏజెన్సీలు)