Telangana Elections: तेलंगाना कांग्रेस की पहली सूची जारी होने का समय तय, जानिए कितने हैं नाम

हैदराबाद: तेलंगाना कांग्रेस पार्टी अक्टूबर के पहले सप्ताह में विधानसभा चुनाव लड़ने वाले उम्मीदवारों की पहली सूची जारी करेगी। दिल्ली के वॉर रूम में दो दिनों से चल रही स्क्रीनिंग कमेटी की बैठक में करीब 60 सीटों पर चुनाव लड़ने वाले उम्मीदवारों की सूची फाइनल कर ली गई है। इसमें करीब 30-35 सीटों पर एक ही उम्मीदवार टिकट की दौड़ में है।

इस बैठक ने इन पर लगभग निष्कर्ष पर पहुंचा दिया है। साथ ही लगभग 25-30 पदों पर पहले से ही दो उम्मीदवार मैदान में हैं, उस पर भी स्पष्टता आई है। कुल मिलाकर करीब 60 उम्मीदवारों के नाम फाइनल हो चुके हैं। स्क्रीनिंग कमेटी द्वारा यह सूची पार्टी की केंद्रीय चुनाव समिति को विचार के लिए भेजी जाएगी। पता चला है कि इस महीने के अंत तक इसे अंतिम रूप दे दिया जाएगा और अक्टूबर के पहले सप्ताह में एआईसीसी द्वारा औपचारिक रूप से जारी कर दिया जाएगा।

उम्मीदवारों को अंतिम रूप देने के लिए स्क्रीनिंग कमेटी की बैठक में पार्टी के रणनीतिकार सुनील कनुगोलु भी शामिल हुए। समिति के अध्यक्ष मुरलीधरन के साथ सदस्य जिग्नेश मेवाणी, सिद्दीकी, राज्य मामलों के प्रभारी माणिकराव ठाकरे, तेलंगाना के नेता रेवंत रेड्डी, मल्लू भट्टी विक्रमार्क, उत्तम कुमार रेड्डी, कोमाटिरेड्डी वेंकट रेड्डी, मधुयाश्की गौड़ और अन्य उपस्थित थे।

यह पता चला है कि स्क्रीनिंग कमेटी के सदस्यों ने तेलंगाना के नेताओं की राय ली। अब तक किए गए सर्वेक्षण, स्थानीय परिस्थितियों और निर्वाचन क्षेत्र से प्राप्त राय को ध्यान में रखा गया। सुनील कनुगुलु से भी फीडबैक लिया और सूची पर अंतिम निर्णय।

लगभग 40 से अधिक पदों पर तीन उम्मीदवारों के नाम शॉर्टलिस्ट कर चूंकि पीसीसी ने पहले ही स्क्रीनिंग कमेटी को सौंप दिए हैं। इसलिए इन पर भी चर्चा हुई। नेताओं ने बताया कि दो दिवसीय बैठक में करीब 60 उम्मीदवारों के नाम फाइनल हो चुके हैं और बाकी पदों पर आज बैठक होगी।

दूसरी ओर, कई विधानसभा क्षेत्रों से टिकट के लिए आवेदन कर चुके दावेदार दिल्ली में ही जमे हुए हैं। एआईसीसी के वरिष्ठ नेताओं से मिलकर टिकट पाने की कोशिश की जा रही है।

కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ విడుదలకు ముహూర్తం ఫిక్స్

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ అక్టోబరు ఫస్ట్ వీక్‌లో విడుదల చేయనున్నది. రెండు రోజులుగా ఢిల్లీలోని వార్ రూమ్‌లో జరుగుతున్న స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో దాదాపు 60 స్థానాల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితా కొలిక్కి వచ్చింది. ఇందులో దాదాపు 30-35 స్థానాల్లో ఒకే అభ్యర్థి టికెట్ రేసులో ఉన్నారు.

వీటిపై ఇప్పటికే క్లారిటీ రాగా దాదాపు 25-30 స్థానాల్లో ఇద్దరు చొప్పున బరిలో ఉండడంతో వాటిని కూడా ఈ సమావేశం దాదాపుగా కొలిక్కి తెచ్చింది. మొత్తంగా సుమారు 60 మంది అభ్యర్థుల పేర్లు ఒక మేరకు ఖరారయ్యాయి. ఈ జాబితాను పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ పరిశీలనకు స్క్రీనింగ్ కమిటీ పంపనున్నది. ఈనెల చివరికల్లా ఖరారు చేసి ఏఐసీసీ ద్వారా అక్టోబరు ఫస్ట్ వీక్‌లో లాంఛనంగా రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.

అభ్యర్థులను ఫైనల్ చేసే స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు కూడా పాల్గొన్నారు. కమిటీ చైర్మన్ మురళీధరన్‌తో పాటు సభ్యులు జిగ్నేశ్ మెవానీ, సిద్దికీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ థాక్రే, రాష్ట్ర నేతలు రేవంత్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధుయాష్కీ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర నేతల నుంచి అభిప్రాయాలను తీసుకున్న స్క్రీనింగ్ కమిటీ సభ్యులు ఇప్పటివరకు జరిగిన సర్వే, స్థానిక పరిస్థితులు, నియోజకవర్గం నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని సునీల్ కనుగోలు నుంచి కూడా ఫీడ్ బ్యాక్ తీసుకుని ఫైనల్ చేసినట్లు తెలిసింది.

దాదాపు 40కు పైగా స్థానాల్లో ముగ్గురు అభ్యర్థుల పేర్లను పీసీసీ ఇప్పటికే షార్ట్ లిస్టు చేసి స్క్రీనింగ్ కమిటీకి అందజేయడంతో వీటిపైనా చర్చ జరిగింది. రెండు రోజుల భేటీలో దాదాపు 60 మంది పేర్లు ఖరారైనందున మిగిలిన స్థానాలపై నేడు సమావేశం జరగనున్నట్లు రాష్ట్ర నేతలు తెలిపారు.

మరోవైపు టికెట్ ఆశిస్తూ ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న పలు నియోజకవర్గాలకు చెందిన ఆశావహులు ఢిల్లీలోనే మకాం వేశారు. ఏఐసీసీ సీనియర్ నేతలను కలిసి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X