“అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్థలం కేటాయింపు లేఖను ఉపసంహరించుకోవాలి”

డా బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో 15 రోజులుగా కొనసాగుతున్న నిరసన

హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ పది ఎకరాల స్థలాన్ని జవహర్ లాల్ నెహ్రు అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి (జె.ఎన్.ఎఫ్.ఏ.యూ) కేటాయించొద్దని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. పది ఎకరాల స్థలం కేటాయించాలనే ప్రభుత్వ ఆలోచనను నిరసిస్తూ, ఆ లేఖను వెంటనే ఉపసంహరించుకోవాలని అంబేద్కర్ వర్షీటీ ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు శనివారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఆందోళనకు దిగారు.

విశ్వవిద్యాలయంలోని డైరెక్టరేట్, మెటీరియల్స్ & పబ్లికేషన్స్ భవనం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. మెటీరియల్స్ & పబ్లికేషన్స్ డైరెక్టర్ ప్రొ. ఆనంద్ పవార్, డిప్యూటీ డైరెక్టర్ డా. పరకుశం వెంకటరమణ మాట్లాడుతూ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేఖను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయంలో గత కొన్ని రోజులుగా కొనసాగతున్న ఈ నిరసనను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

Also Read-

ఈ కార్యక్రమంలో జేఎసీ ఛైర్పర్సన్ ప్రొ. పల్లవీ కాబ్డే; కన్వీనర్ ప్రొ. వడ్డాణం శ్రీనివాస్; డా. యాకేష్ దైదా; డా. ప్రమీల కేతావత్; రాజా బాబు జేఎసీ నేతలు అధ్యాపక, అధ్యాపకేతర, అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్ అసోసియేషన్; టైం స్కేల్, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X