तेलंगाना में आसमान को छू रहे हैं सब्जियों और आवश्यक वस्तुओं के दाम, मुश्किल हो रहा है इनका जीना

हैदराबाद : तेलंगाना में सब्जियों और आवश्यक वस्तुओं की कीमतें आसमान को छू रही हैं। अगर आप सौ-दो सौ रुपये लेकर बाजार जाएंगे तो आपको दो सब्जियां नहीं मिल रही है। दालों के दाम भी बढ़ रहे हैं। इमली की कीमत भी भयानक है। इन दो-तीन दिनों में सब्जियों और आवश्यक वस्तुओं की कीमतें 20 से 30 प्रतिशत तक बढ़ गईं है। इससे आम लोग परेशान हैं।

कल तक टमाटर की कीमत 25 से 30 रुपये थी, लेकिन अब 50-60 रुपये प्रति किलो है। हरी मिर्च 80 रुपये से 120 रुपये हो गया है। तुरई 80 रुपये, बैंगन 60 से 70 रुपये, भिंडी और लौकी 60 रुपये है। शिमला मिर्च जो सोमवार को 68 रुपये प्रति किलो थी, मंगलवार को उसकी कीमत 85 रुपये हो गयी है।

देशी लौकी (सोराकाया) 15-20 रुपये से बढ़कर 48 रुपये हो गया है। एक मुनक्कया 12-15 रुपये का हो गया। सांबार का छोट्टा कट्टा 6 से 10 कर दिया गया। शतावरी (तोटाकुरा) की कीमत पहले 20 रुपये से बढ़कर 50 रुपये है। पालक और चुक्काकुरा के तीन और चार गुच्छों की कीमत 20 रुपये थे। अब 30 से 40 रुपये पर पहुंच गया। 20 रुपये पांच नींबू मिलते थे। अब तीन नींबू भी नहीं दे रहे हैं।

सब्जियों के बाद सबसे ज्यादा खाना पकाने में इस्तेमाल होने वाली दालों के रेट उससे भी ज्यादा हो गए हैं। अब तक 110-120 रुपये प्रति किलो मिलने वाला तुअर दाल अब 200 रुपये तक पहुंच गया है। गुणवत्ता के आधार पर चना 90-100 रुपये, मैसूर दाल 110-120 रुपये, मूंग दाल 140 रुपये और बाजरा दाल 140-150 रुपये है। रेपसीड तेल जहां 180-190 रुपये प्रति किलो है, वहीं सूरजमुखी तेल 120-125 रुपये बिक रहा है। अदरक जहां 200 रुपये प्रति किलो है, वहीं लसून की कीमत 320 रुपये है। इमली भी 120-130 रुपये है। ये सब दाम देखकर आमलोग लोग घबरा रहे हैं।

बाजार में नॉनवेज के दामों का भी वही हाल हैं। ब्रॉयलर स्किनलेस चिकन कल तक 260 रुपये किलोग्राम का था और अब 300 रुपये का हो गया है। खाल के साथ 180-190 रुपये था, अब यह 260 रुपये हो गया। राम (पोट्टेलु) मटन 1000 रुपये प्रति किलो बिक रहा है। मुर्गी अंडे का रेट जो 5 रुपये था वह भी बढ़कर 7 रुपये हो गया है। इसके चलते मध्यम वर्ग के लोग सोच रहे हैं कि जश्न मनाने पर सोच रहे है।

हमेशा की तरह तेलंगाना में सब्जियों की खेती काफी कम है। व्यापारियों का कहना है कि हमें मिलने वाली लगभग 80 प्रतिशत सब्जियाँ पड़ोसी राज्यों से आती हैं। अधिकारियों ने बताया कि चिलचिलाती धूप के अलावा कई इलाकों में भूजल में कमी के कारण इस बार 90 फीसदी सब्जियां आंध्र, कर्नाटक और मध्य प्रदेश राज्यों से आती हैं।

कहा जाता है कि टमाटर चित्तूर जिले के मदनपल्ली और आंध्र प्रदेश के अन्य हिस्सों से आता है। काली मिर्च मध्य प्रदेश से आती है। गाजर और शिमला मिर्च के साथ अन्य सब्जियां ज्यादातर कर्नाटक से आती हैं। इस बार दो तेलुगु राज्यों में खराब बारिश के कारण फसल खराब हो गई है और बाजारों में जरूरत के मुताबिक स्टॉक की आपूर्ति कम हो गई है।

जिनके पास गांव में अपनी जमीन नहीं है और वे रोजी रोटी के चक्कर में शहर काम करने आये है। शहर आकर कुछ लोगों ने प्राइवेट नौकरी की और शादी कर ली। अब उनकी स्थिति तो और भी खराब हो गयी है। वेतन इतना भी नहीं कि घर का खर्च चल सके। 12,000 से 15,000 रुपये की सैलरी के साथ सब्जियों के दाम, मकान का किराया और बिजली बिलों के चलते शहर में जीना मुश्किल हो रहा है।

తెలంగాణలో కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి

హైదరాబాద్ : తెలంగాణలో కూరగాయలు, నిత్యావసర వస్తువుల రేట్లు భగ్గుమంటున్నాయి. వందో, రెండు వందలో పట్టుకుని మార్కెట్​కు పోతే రెండు రకాల కూరగాయలు కూడా రావట్లేదు. పప్పులు వండుకుని తిందామంటే వాటి రేట్లు కూడా అలాగే ఉన్నాయి. చివరకు పచ్చిపులుసుతో అడ్జస్ట్ అవుదామనుకుంటే చింతపండు ధర సైతం భయపెడుతోంది. వారం, పది రోజుల కింది వరకు అందుబాటులోనే ఉన్న ధరలు రెండు, మూడు రోజుల్లోనే 20 నుంచి 30 శాతం పెరిగాయి. దీంతో సాధారణ ప్రజలు అల్లాడుతున్నారు.

నిన్నమొన్నటి వరకు రూ.25 నుంచి 30 వరకు దొరికిన టమాటకు ఇప్పుడు కిలో రూ.50-60 చెబుతున్నారు. పచ్చిమిర్చి క్వాలిటీ ఆధారంగా రూ.80 ఉండగా రూ.120 అయింది. బీరకాయ రూ.80 ఉండగా, వంకాయకు రూ.60 నుంచి 70, బెండకాయ, దొండ కాయకు రూ.60 చెప్తున్నారు. సోమవారం కిలో రూ.68 ఉన్న క్యాప్సికం మంగళవారం రూ.85 పలికింది.

రూ.15–20 ఉండే దేశవాళీ సొరకాయ రూ.48 ఉంది. ఒక్క మునక్కాయ రూ.12–15 అయింది. చిన్నకొత్తిమీర కట్ట రూ.6 ఉండగా రూ.10 చేశారు. తోటకూర ఇంతకుముందు రూ. 20కి నాలుగు కట్టలు ఇచ్చేవారు. ఇప్పుడు రూ.50 పెట్టాల్సి వస్తోంది. పాలకూర, చుక్కకూర 20కి మూడు, నాలుగు కట్టలుండగా రూ. 30 నుంచి రూ. 40కి చేరింది. రూ. 20కి ఐదు నిమ్మకాయలు ఇచ్చేవారు ప్రస్తుత మూడు కూడా ఇవ్వడం లేదు.

కూరగాయల తర్వాత వంటల్లో ఎక్కువగా వాడే పప్పుల రేట్లు అంతకంటే ఎక్కువే అయ్యాయి. మొన్నటి వరకు కిలో రూ.110–120 పలికిన కందిపప్పు ఇప్పుడు రూ.200కు చేరింది. క్వాలిటీ ఆధారంగా శనగపప్పు రూ.90–100, మైసూర్‍ పప్పు రూ.110–120, పెసర పప్పు రూ.140, మినుముల పప్పు రూ.140–150 అయింది. పల్లినూనె కిలో రూ.180–190 ఉండగా.. సన్​ ఫ్లవర్​ ఆయిల్​​120–125 వరకు అమ్ముతున్నారు. అల్లం కిలో రూ.200 ఉంటే ఎల్లిగడ్డ రూ.320 పలుకుతోంది. చింతపండు కూడా రూ.120–130 అవడంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు.

మార్కెట్​లో నాన్‍వెజ్‍ రేట్లు అలానే ఉన్నాయి. బ్రాయిలర్‍ స్కిన్‍లెస్‍ చికెన్‍ నిన్నమొన్నటి వరకు రూ.260 ఉండగా ఇప్పుడు రూ.300 అయింది. విత్‍ స్కిన్‍ రూ.180–190 ఉండగా దీనిని రూ.260 చేశారు. పొట్టేలు మటన్ కిలో రూ.1000 చొప్పున విక్రయిస్తున్నారు. రూ.5 ఉండే కోడిగుడ్డు రేటు కూడా రూ.7కు చేరింది. దీంతో ఆదివారం లేదంటే ఏదైనా సెలబ్రెషన్‍ చేసుకుందామంటే మిడిల్‍ క్లాస్‍ జనాలు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు.

మామూలుగానే రాష్ట్రంలో కూరగాయల సాగు కొంత తక్కువగా ఉంది. ఎండాకాలం మనకు వచ్చే కూరగాయల్లో దాదాపు 80 శాతం పక్క రాష్ట్రాల నుంచే దిగుబడి చేసుకుంటున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. మండే ఎండలకు తోడు..చాలా ఏరియాల్లో గ్రౌండ్‍ వాటర్ తగ్గడంతో ఈసారి 90 శాతం కూరగాయలు ఆంధ్రా, కర్నాటక, మధ్యప్రదేశ్‍ రాష్ట్రాల నుంచి దిగుబడి చేసుకుంటున్నట్లు మార్కెట్‍ అధికారులు తెలిపారు.

టమాట ఆంధ్రప్రదేశ్‍లోని చిత్తూర్‍ జిల్లా మదనపల్లి తదితర ప్రాంతాల నుంచి, మిర్చి మధ్యప్రదేశ్‍, ఇతర కూరగాయలతో పాటు క్యారెట్‍, క్యాప్సికం వంటివి కర్నాటక నుంచి ఎక్కువగా వస్తున్నట్లు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈసారి చెడగొట్టు వానల కారణంగా చేతికొచ్చిన పంట దెబ్బతినడంతో అవసరానికి అనుగుణంగా సాగు లేక మార్కెట్లకు స్టాక్‍ రావడం తగ్గింది.

ఊళ్లో సొంత భూముల్లేక సిటీలో కాయకష్టం చేసుకుందామని వచ్చినోళ్లు ఇప్పుడిప్పుడే ప్రైవేట్‍ ఉద్యోగాలు దొరికి పెళ్లిళ్లు చేసుకున్నోళ్ల పరిస్థితి దారుణంగా తయారైంది. వచ్చే జీతం ఇల్లు గడవడానికి కూడా సరిపోవడం లేదు. రూ.12 వేల నుంచి రూ.15 వేల జీతం వచ్చేటోళ్లు కూరగాయల ధరలు, ఇంటి కిరాయిలు, కరెంట్ బిల్లులతో సిటీలో బతుకుడు కష్టమే అవుతోంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X