देश में सबसे अधिक तापमान आंध्र प्रदेश में दर्ज, जानिए किस जिले में है ज्यादा टेंपरेचर

हैदराबाद : आंध्र प्रदेश में गर्मी का तापमान रिकॉर्ड स्तर पर दर्ज किया जा रहा है। गौरतलब है कि देश में सबसे अधिक तापमान आंध्र प्रदेश में दर्ज किया गया। आईएमडी ने चेतावनी दी है कि अगले तीन दिनों तक हालात ऐसे ही बने रहेंगे। गुरुवार को सबसे अधिक तापमान नंद्याला जिले में 45.6 डिग्री सेल्सियस दर्ज किया गया। इसके बाद विजयनगरम जिले के राजम में 45.5 डिग्री और अल्लूरी जिले के कोंडाईगुडेम में 45.1 डिग्री दर्ज किया गया। एपी आपदा प्रबंधन विभाग के अधिकारियों ने बताया कि वाईएसआर जिले के खाजीपेट में 44.7 डिग्री, कर्नूल जिले के कोडुमुरु में 44.2 डिग्री, अनकापल्ली जिले के देवरापल्ले में 44.1 डिग्री, पूर्वी गोदावरी जिले के नंदराडा, पलनाडु जिले के राविपाडु और श्रीकाकुलम जिले के कोल्लीवलसा में 44 डिग्री सेल्सियस दर्ज किया गया।

विभाग ने कहा कि पूरे एपी में 16 जिलों में 43 डिग्री सेल्सियस से ऊपर तापमान दर्ज किया गया। प्रदेश के 72 मंडलों में भीषण गरम हवाएं चर रही है और 102 मंडलों में गरम हवाएं चल रही है। शुक्रवार को 56 मंडलों में भारी भीषण गरम हवा बहने का अनुमान है। साथ ही आपदा प्रबंधन विभाग के एमडी रोणंकी कुर्मानाथ ने कहा कि अन्य 174 मंडलों में गरम तेज हवाएं चलने की आशंका है। शनिवार को 64 मंडलों में भयंकर तेज गरम हवा बहेगी और 170 गरम हवा चलने की संभावना है। उन्होंने लोगों को सतर्क रहने की सलाह दी है। श्रीकाकुलम जिले में 13, विजयनगरम जिले में 23, पार्वतीपुरम मन्यम जिले में 13, अनाकापल्ली जिले में 3, पूर्वी गोदावरी जिले में 3 और काकीनाडा जिले के एक-एक मंडल में गंभीर तेज गरम हवा चलने की संभावना है।

इसके अलावा, श्रीकाकुलम में 12, पार्वतीपुरम मन्यम में 4, अल्लूरी सीतामराजू जिले में 10, विशाखापत्तनम जिले में 3, काकीनाडा में 17, कोनसीमा में 9, पश्चिम गोदावरी में 4, एलुरु में 14, कृष्णा में 11, एनटीआर जिले में 6 गुंटरू में 14, पलनाडु में18, बापट में 2, प्रकाशम में 8, तिरूपति में 4, नेल्लोर में 1 और सत्यसाई में 5 स्थानों पर भीषण गरम हवाएं चलने की आशंका है। उच्च तापमान और गरम हवा को देखते हुए लोगों को सतर्क रहने की सलाह दी गई है। यथासंभव सुबह 11 बजे से शाम 4 बजे तक बाहर न निकलने की चेतावनी दी। आपदा विभाग के अधिकारियों ने कहा कि धूप से बचने के लिए टोपी, छाता, तौलिया और सूती कपड़े पहनें। हृदय रोग, मधुमेह, बीपी, गर्भवती महिलाओं, बच्चों और बुजुर्गों को सावधानी बरतनी चाहिए। कुर्मनाथ ने सलाह दी कि धूप में न घूमें और धूप में मेहनत न करें।

यह भी पढ़ें:

దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఆంధ్రప్రదేశ్‌లో నమోదు

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ లో వేసవి ఉష్ణోగ్రతలు (Temperatures) రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఆంధ్రప్రదేశ్‌లోనే నమోదుకావడం గమనార్హం. మరో మూడు రోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని ఐఎండీ హెచ్చరించింది. గురువారం అత్యధికంగా నంద్యాల జిల్లానందవరంలో 45.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదుకాగా.. తర్వాతి విజయనగరం జిల్లా రాజాంలో 45.5 డిగ్రీలు, అల్లూరి జిల్లా కొండైగూడెంలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. వైఎస్సార్ జిల్లా ఖాజీపేటలో 44.7 డిగ్రీలు, కర్నూలు జిల్లా కోడుమూరులో 44.2 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా దేవరపల్లెలో 44.1 డిగ్రీలు, తూర్పుగోదావరి జిల్లా నందరాడ, పల్నాడు జిల్లా రావిపాడు, శ్రీకాకుళం జిల్లా కొల్లివలసలో 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ విభాగం అధికారులు వెల్లడించారు.

ఏపీవ్యాప్తంగా 16 జిల్లాల్లో 43 డిగ్రీల సెల్సియస్‌‌పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలిపారు. రాష్ట్రంలోని 72 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 102 మండలాల్లో వడగాల్పులు వీచాయని పేర్కొన్నారు. శుక్రవారం 56 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని అంచనా వేశారు. అలాగే, మరో 174 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ విభాగం ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. శనివారం 64 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 170 వడగాల్పులు వీచే అవకాశం ఉందన్న ఆయన.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శ్రీకాకుళం జిల్లాలో 13 , విజయనగరం జిల్లాలో 23 , పార్వతీపురం మన్యం జిల్లాలో 13 , అనకాపల్లి జిల్లాలో 3, తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లాలో ఒక్కో మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు.

అలాగే, శ్రీకాకుళంలో 12 , విజయనగరంలో 4, పార్వతీపురం మన్యంలో 2, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 10, విశాఖపట్నం జిల్లాలో 3, అనకాపల్లిలో 12, కాకినాడలో 17, కోనసీమలో 9, తూర్పుగోదావరిలో 18, పశ్చిమగోదావరిలో 4, ఏలూరులో 14, కృష్ణాలో 11, ఎన్టీఆర్ జిల్లాలో 6, గుంటూరులో 14, పల్నాడులో 18, బాపట్లలో 2, ప్రకాశంలో 8, తిరుపతిలో 4, నెల్లూరులో 1, సత్యసాయిలోని 5 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అంచనా వేశారు. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ధరించాలని విపత్తుల శాఖ అధికారులు పేర్కొన్నారు. గుండె జబ్బులు, షుగర్, బీపీ ఉన్నవారు, గర్బిణీలు, చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఎండలో తిరగవద్దని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని కూర్మనాథ్ సూచనలు చేశారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X