రైతుల తలరాత మార్చే కాళేశ్వరం ప్రాజెక్ట్ కు రూ. 80 వేల కోట్లంటే గగ్గోలా?-కేటీఆర్

రూ. లక్షా 50 వేల కోట్ల మూసీ ప్రాజెక్ట్ తో మురిసే రైతులెంతమందీ?

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకన్నా…మూసీ ప్రాజెక్టంటేనే ముఖ్యమంత్రికి మక్కువా ?

వేల కోట్లు తన్నుకుపోయేందుకే మూసీ అంచనా వ్యయం మూడింతలు పెంపు

తట్టెడు మన్ను తీయకముందే..వేల కోట్ల కుంభకోణానికి కాంగ్రెస్ కుట్ర

హైదరాబాద్ : “మూసీ రివర్ ఫ్రంట్”పేరుతో మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రూ. లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పటం వెనుక పెద్ద ఎత్తున బాగోతాలు జరుగుతున్నాయని భారత రాష్ట్ర సమతి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ముందు రూ. 50 వేల కోట్లు అని చెప్పి ఇప్పుడు ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని మూడింతలు పెంచటమంటే కాంగ్రెస్ ధన దాహం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. తట్టెడు మట్టి కూడా తీయకుండా వేల కోట్లు తన్నుకుపోయే కుట్ర జరుగుతుందని కేటీఆర్ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కుంభకోణాల కాంగ్రెస్ ఆటలు సాగనివ్వమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఆడుతున్న డ్రామాను ప్రజలు గమనిస్తున్నారని కేటీఆర్ అన్నారు.

మూసీ తో మురిసె రైతులెందరూ?

మూసీ సుందరీకరణ పేరుతో రూ. లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేస్తే ఎంత మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా సాగులోకి వచ్చే ఎకరాలెన్ని? నిల్వ ఉంచే టీఎంసీలెన్ని?పెరిగే పంటల దిగుబడి ఎంత? తీర్చే పారిశ్రామిక అవసరాలెంత? కొత్తగా నిర్మించే భారీ రిజర్వాయర్లెన్నిఅంటూ కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ రైతుల తలరాతను మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ. 80 వేల కోట్లయితేనే గల్లీ నుంచి ఢిల్లీ దాకా గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతుందన్నారు. ఉట్టి సుందరీకరణకే రూ. లక్షా యాభై వేల కోట్లా అంటూ కేటీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. లండన్ లోని థేమ్స్ లాగా మారుస్తామనే వ్యూహం వెనక థీమ్ ఏంటి ? గేమ్ ప్లాన్ ఏంటీ? అని కేటీఆర్ నిలదీశారు.

Also Read-

పాలమూరు-రంగారెడ్డి కన్నా మూసీయే ఎక్కువ?

ఈ ముఖ్యమంత్రికి కనీసం తను పుట్టిన గడ్డ మీద కూడా మమకారం లేదని కేటీఆర్ అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకన్నా…మూసీ ప్రాజెక్టుపైనే ముఖ్యమంత్రి ఎందుకు ఎక్కువ మక్కువ చూపుతున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. చివరిదశలో ఉన్నపాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కోల్డ్ స్టోరేజీలోకి నెట్టి మూసీ చుట్టే ఎందుకింత మంత్రాంగమో చెప్పాలన్నారు. కేవలం వేల కోట్ల రూపాయలను దోచుకునేందుకే మూసీ పేరుతో డ్రామాలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.”మూసీ రివర్ ఫ్రంట్” పేరిట బ్యాక్ డోర్ లో జరుగుతున్న బాగోతాన్నితెలంగాణ సమాజం అనుక్షణం గమనిస్తోందన్నారు. కుంభకోణాల కాంగ్రెస్ కు ప్రజలు సరైన సమయంలో కర్రుకాల్చి వాత పెడతారని కేటీఆర్ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X