రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ తీరు దారుణంగా ఉంది
బీజేపీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు రైతులు, పేద ప్రజల పాలిట శాపంగా మారాయి
వ్యవసాయ కల్లాలకు ఉపాధి హమీ నిధులు ఇవ్వమనడం సరికాదు
వెంటనే ఆ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలి
కేంద్ర ప్రభుత్వ వ్యతిరేఖ వైఖరికి నిరసగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో చేపట్టే ధర్నా కార్యక్రమాలను జయప్రదం చేయాలి: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేఖ విధానాలపై రైతులు, సామాన్య ప్రజలు, పోరాడాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. కల్లాల నిర్మాణం పూర్తయ్యాక, వ్యవసాయ కల్లాలకు ఉపాధి హమీ నిధులు ఇవ్వమనడం సరికాదని, వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. … రైతులకు నష్టం చేసేలా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని బీర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేఖిస్తుందన్నారు.
తెలంగాణ రాష్ట్ర రైతన్నల కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, పార్టీ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల మేరకు కేంద్రం అవలంభిస్తున్న రైతు, వ్యవసాయ కూలీల వ్యతిరేఖ విధానాలకు నిరసనగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో చేపట్టే ధర్నా కార్యక్రమాల్లో రైతులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తులన పాల్గొని జయప్రదం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. రేపు నిర్మల్ పట్టణంలో నిర్వహించే ధర్నాలో తాను కూడా పాల్గొననున్నట్లు మంత్రి తెలిపారు.
గురువారం శాస్త్రినగర్ క్యాంప్ కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ… బీజేపీ కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ, రైతాంగానికి, సామాన్య ప్రజానికి తీవ్ర నష్టం చేసే నిర్ణయాలను తీసుకుంటుందని మండిపడ్డారు. పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా వ్యవహరిస్తూ… వివక్ష చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ ఉపాధి హమీ పథకం క్రింద నిర్మించిన కల్లాలకు నిధులు ఇవ్వకుండా మోకాలడ్డుతుందని కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. రైతులకు ప్రత్యక్షంగా ఉపయోగపడే కల్లాలు వ్యవసాయంలో భాగం కాదని వక్రభాష్యాలు చెప్పి రైతన్నలను, వ్యవసాయ కూలీల పొట్ట కొడుతుందని మండిపడ్డారు.
రైతన్నలు ఆర్థికంగా బలోపేతం కావాలని సీయం కేసీఆర్ ఎన్నో రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే… కేంద్ర ప్రభుత్వం మాత్రం దేశంలోనే అతిపెద్దదైన వ్యవసాయాన్ని రంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందన్నారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాతలను ఆదుకునేలా కేంద్రానికి ఒక విధానమే లేదని విమర్శించారు.