हैदराबाद : तेलंगाना में सूरज आग उगल रहा है। गर्मी की शुरुआत में ही सूरज प्रचंड रूप से दिखा रहा है। आने वाले मई महीने के बारे में सोचे तो ही डर लग रहा है। सुबह 7 बजे के बाद लोग सड़कों पर आने के लिए कतरा रहे हैं। लोग तेज़ धूप और गर्मी से भयभीत हो रहे हैं। मंगलवार को तेलंगाना के नौ जिलों में अधिकतम तापमान दर्ज किया गया।
मौसम विभाग के अधिकारियों ने बताया कि भद्राचलम शहर में सबसे अधिक तापमान 44.7 डिग्री सेल्सियस दर्ज किया गया। नलगोंडा, जगित्याला, राजन्ना सिरिसिला और महबुबाबाद जिलों के कई मंडलों में तापमान 44.5 डिग्री दर्ज हुआ। चेतावनी जारी की गई है कि बुधवार और गुरुवार को तेलंगाना में धूप की तीव्रता बढ़ेगी और कई जगहों पर गर्म हवा चलेगी।
मंगलवार को लू लगने से दो लोगों की मौत हो गई। करीमनगर जिले के शंकरपट्टनम मंडल के मोलंगुर के चिट्ला रामक्का (78) की लू लगने से मौत हो गई। सूर्यापेट जिले के फनिगिरी निवासी संगम सुंदरय्या (70) शराब की खाली बोतलें इकट्ठा करके और बेचकर जीवन यापन करता था। दोपहर को कोडकांडला मंडल के मोंड्राई में बोतलें इकट्ठा करते समय लू लगने से वह सड़क पर ही गिर पड़ा और उसकी मौके पर ही मौत हो गई।
अधिकारियों ने बताया कि ज्यादा धूप के चलते सुबह 11 से दोपहर 3 बजे तक बाहर न जाना ही बेहतर होगा। यदि आपको किसी आपातकालीन स्थिति में जाना पड़े तो आपको उचित सावधानी बरतनी चाहिए। गहरे रंग के कपड़ों की बजाय हल्के रंग के कपड़े ही पहनें। गर्मी के दिनों में शराब से परहेज करना ही बेहतर है। लू लक्षण दिखते ही उपचार करें। अन्यथा बीपी और पल्स गिर सकता है और कभी-कभी जान भी जा सकती है। धूप से झुलसे व्यक्ति को ठंडे वातावरण में ले जाना चाहिए। प्राथमिक उपचार के तौर पर गर्दन और चेहरे पर आइस पैक लगाना चाहिए। बदन पर के कपड़ों को ढीला कर दें और सुनिश्चित करें कि हवा का संचार अच्छे से हो। पानी और तरल पदार्थो का अच्छा सेवन करें। यदि सनबर्न के लक्षण गंभीर हैं, तो तुरंत अस्पताल जाना सबसे बेहतर है।
నిప్పుల గుండంలా తెలంగాణ
హైదరాబాద్ : తెలంగాణలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వేసవి కాలం మొదట్లోనే ఎండలు తీవ్ర స్థాయిలో మండిపోతున్నాయి. ఇక రాబోయే మే నెల గురించి ఆలోచిస్తేనే చెమటలు పట్టేస్తున్నాయి. ఉదయం 7 తర్వాత ప్రజలు రోడ్లపైకి రావాలంటే జంకుతున్నారు. తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. మంగళవారం (ఏప్రిల్ 16) తొమ్మిది జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాష్ట్రంలోనే అత్యధికంగా భద్రాచలం పట్టణంలో 44.7 డిగ్రీల సెల్సియస్ నమోదనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నల్గొండ, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్ జిల్లాల్లో అనేక మండలాల్లో 44.5 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదైయ్యాయి. నేడు, రేపు రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతుందని.. పలు ప్రాంతాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ చేశారు.
ఇక వడదెబ్బ కారణంగా మంగళవారం ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్‌కు చెందిన చిట్ల రామక్క (78) వడదెబ్బతో మృతి చెందింది. సూర్యాపేట జిల్లా ఫణిగిరికి చెందిన సంగం సుందరయ్య (70) ఖాళీ మద్యం సీసాలు ఏరుకుని అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. మధ్యాహ్నం కొడకండ్ల మండలం మొండ్రాయిలో సీసాలు ఏరుకుంటూ వడదెబ్బతో రోడ్డుపైనే కుప్పకూలి స్పాట్‌లోనే కన్నుమూశాడు.
ఎండత తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు బయట తిరగకపోవడమే మంచిది. అత్యవసర పరిస్థితిలో వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముదురు రంగు దుస్తులు కాకుండా తేలికపాటి లేత రంగు దుస్తులను మాత్రమే ధరించాలి. ఎండాకాలంలో మద్యానికి దూరంగా ఉండటం మంచిది. వడదెబ్బ లక్షణాలు కనిపించగానే చికిత్స అందించాలి. లేదంటే బీపీ, పల్స్ పడిపోయి కొన్నిసార్లు ప్రాణాలు పోవచ్చు. వడదెబ్బ తగిలిన వ్యక్తిని చల్లని వాతావరణంలోకి తీసుకెళ్లాలి. ప్రథమ చికిత్సగా మెడ, ముఖంపై ఐస్ ప్యాక్ పెట్టాలి. ఒంటిపై దుస్తులను వదులుగా చేసి గాలి బాగా ఆడేలా చూడాలి. నీరు, ద్రవాహారాలను బాగా అందించాలి. వడదెబ్బ లక్షణాలు తీవ్రంగా ఉంటే వెంటనే హాస్పటల్‌కు తీసుకువెళ్లడం ఉత్తమం. (ఏజెన్సీలు)
