హైదరాబాద్: తెలంగాణ టీచర్స్ యూనియన్ మహబూబ్ నగర్ జిల్లా క్యాలెండర్ను ఎమ్మెల్యే యేన్నెం శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వన్నదని పేర్కొన్నారు.
అపరిస్కృత ఉపాధ్యాయ సమస్యల పట్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. ఈ సంవత్సరం జరగనున్న 10వ తరగతి పరీక్షల్లో మహబూబ్నగర్ నుంచి మంచి ఫలితాలు సాధించాలని వారు పేర్కొన్నారు.
ఇట్టి కార్యక్రమంలో అధ్యక్షులు జురు నారాయణ యాదవ్, ప్రధాన కార్యదర్శి గుడిసె యాదయ్య, రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు నేస్సి డిపోరా, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు జనార్ధన్ రెడ్డి, కోశాధికారి జిల్లా విజయ్ మోహన్, ఉపాధ్యక్షులు రవి కుమార్, కార్యదర్శి గుర్రాన్ జిల్లా సంయుక్త కార్యదర్శి హన్మంతు, మల్లేష్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.