హైదరాబాద్: ఈరోజు తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సునీత రావు గారి అధ్యక్షతన గాంధీభవన్లో స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ మరియు ఆషాడ మాసం అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు అందరూ సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయూ ఆరోగ్యాలతో ఉండాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగింది. మరియు పెంచిన కూరగాయల ధరలు నిత్యవసర వస్తువుల ధరలను తగ్గించాలని మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కూరగాయలతో నిరసన ప్రదర్శన చేయడం జరిగింది.
బిఆర్ఎస్ బిజెపి ప్రభుత్వాలు పెంచిన కూరగాయల ధరలకు సబ్సిడీ ఇవ్వాలని పక్క రాష్ట్రాల నుండి కూరగాయలు నిత్యవసర వస్తువులు తీసుకువచ్చి సబ్సిడీ ఇవ్వాలని మహిళా తరపున డిమాండ్ చేస్తున్నాము అన్నారు. మధ్యతరగతి ప్రజలకు కూరగాయలు కొనలేని పరిస్థితుల్లో ఉన్నారు. టమాటాలు 180 రూపాయలు. పచ్చిమిర్చి బీన్స్ 200 రూపాయలు ఏ కూరగాయలు కొనాలన్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వెంటనే ప్రభుత్వాలు దిగివచ్చి ప్రజలకు న్యాయం చేయాలని ఈ రెండు మొండి ప్రభుత్వాలను తరిమి కొట్టాలని సునీత రావు అన్నారు. కార్యక్రమంలో డిస్టిక్ ప్రెసిడెంట్లు. స్టేట్ వైస్ ప్రెసిడెంట్లు. జనరల్ సెక్రెటరీలు. సెక్రెటరీ లు ఆర్గనైజింగ్ సెక్రటరీ లు బ్లాక్ ప్రెసిడెంట్లు. మండల ప్రెసిడెంట్లు. డివిజన్ ప్రెసిడెంట్లు. టౌన్ ప్రెసిడెంట్లు మొదలవారు పాల్గొన్నారు.