హైదరాబాద్ : వాలెంటెన్స్ డే పేరుమీద అర్ధరాత్రి వరకు హోటల్స్ లో పబ్బులలో అసాంఘికత కార్యక్రమాలు జరుపుతున్నాయని తెలంగాణ రాష్ట్ర బజరంగ్ సేన నాయకులు ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే వీటి పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాచిగూడ లోని రాష్ట్ర కార్యాలయంలో బజరంగ్ సేన నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసారు. నాయకులు మాట్లాడుతూ వాలంటైన్స్ డే రాత్రి 11 గంటల లోపే హోటల్స్ పబ్బులు మూసివేయాలని,వాటిపై నిఘా పెట్టాలని హైదరాబాదులో ఉన్న ముగ్గురు కమిషనర్లకు ఈరోజు మెమోరండం ఇస్తున్నామని తెలిపారు.
వాలెంటెన్స్ డే పేరున హోటల్స్ లో పబ్బుల్లో పార్కుల్లో మత్తు పదార్థాల విక్రయాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని తెలంగాణ రాష్ట్ర బజరంగ్ సేన ఆరోపించారు. రేపు బజరంగ్ సేన రాష్ట్ర కార్యవర్గం మొత్తం హోటల్స్ పైన పబ్బులపైన నిగా పెట్టి అసాంఘిక కార్యక్రమాలు జరిగితే ప్రత్యక్ష దాడులు కూడా వెనుకాడమని హెచ్చరించారు.
వాలెంటెన్స్ డే జరుపుకోవడం మన సాంప్రదాయం కాదు, పాశ్చాత్య సాంప్రదాయాలు. అందరు దూరం ఉండాలని విజ్ఞప్తి చేశారు. రేపు ఎవరైనా ఎక్కడైనా జంటలుగా కనబడితే వారిని తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్లి వారి సమక్షంలో పెళ్లిళ్లు చేస్తామని హెచ్చరించారు.

Telangana State Bajrang Sena Opposes Valentine’s Day
Hyderabad: Telangana State Bajrang Sena has announced its opposition to Valentine’s Day, stating that anti-social activities are being carried out in hotels and pubs under the pretext of celebrations. They have demanded immediate action from the government against such activities.
A press conference was held at the state office in Kachiguda, where Bajrang Sena leaders declared that they would submit a memorandum today to the three police commissioners in Hyderabad, urging them to ensure that all hotels and pubs close by 11 PM on Valentine’s Day and to keep strict surveillance over them.
The organization also alleged that the sale of intoxicating substances in hotels, pubs, and parks is rampant on Valentine’s Day. They warned that the Bajrang Sena state committee will closely monitor these establishments and take direct action if any anti-social activities are found.
Bajrang Sena emphasized that celebrating Valentine’s Day is not part of Indian traditions but a Western practice, urging people to stay away from it.
Furthermore, they warned that if they find couples anywhere tomorrow, they will take them to their parents and arrange their marriage in their presence with Manoj Bajrang Sena city president,Rameshwar mishra city general secretary, vani priya Telengana president,Ashish singh Bajrang Sena youth president,Piyush, ashwin and others members.