తెలంగాణ ఏర్పాటు నుండి 7 రెట్లుగా 200 నుండి 1400కు పెంచిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్
రాష్ట్రంలోని 17,227 మంది రేషన్ డీలర్లకు తీపికబురు అందించిన సర్కార్
రాష్ట్ర ప్రభుత్వం ఏటా అధనంగా 139కోట్ల కేటాయింపు
కరోనాలో చనిపోయిన 100 మంది డీలర్ల వారసులకు షాపుల కేటాయింపు
బీమా, వేబ్రిడ్జిల ఏర్పాటు, డీలర్ రెన్యూవల్ 5ఏళ్లకు పెంపు, రేషన్ భవన్, అంత్యక్రియల సాయం తదితర 13 ప్రధాన అంశాలకు పరిష్కారం
పేదల సంక్షేమం, రేషన్ డీలర్ల సంక్షేమంలో తిరుగులేని తెలంగాణ
దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిదంగా సొంతంగా 91 లక్షల పేదలకు ఆహార ధాన్యాల సరఫరా
కేంద్రం కేటాయింపులు పెంచకున్నా అందిస్తున్న తెలంగాణ
రేషన్ డీలర్ల సంఘాలతో మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ల చర్చలు సఫలం
హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన రేషన్ డీలర్లు
హైదరాబాద్: గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశంతో రేషన్ డీలర్ల సంఘం జేఏసీ ప్రతినిధులతో రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ నేడు రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన చర్చలు సఫలం అయ్యాయి, డిప్యూటీ స్పీకర్ పద్మారావ్ గౌడ్, రేషన్ డీలర్ల సంఘం గౌరవాధ్యక్షురాలు, ఎమ్మల్యే పద్మా దేవేందర్ రెడ్డి డీలర్ల జేఏసీ నేతల సమక్షంలో జరిపిన సమావేశంలో అన్ని అంశాలను కూలంకషంగా చర్చించారు. మెట్రిక్ టన్నుకు ప్రస్థుతమున్న 900 రూపాయల నుండి 1400 రూపాయలకు ముఖ్యమంత్రి గారి ఆదేశంతో పెంచుతున్నట్టు మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ ప్రకటించారు.
ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17,227మంది రేషన్ డీలర్లకు లబ్దీ చేకూరుతుంది, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా 139 కోట్ల అధనపు భారం పడుతుందని, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రంలోని అన్నివర్గాల్లోని ప్రతీ ఒక్కరి సంక్షేమాన్ని చూస్తున్నారని, రేషన్ డీలర్లను సైతం ఆదుకోవాలని ఆదేశించారని మంత్రులు తెలియజేసారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు కేవలం మెట్రిక్ టన్నుకు 200 రూపాయలు మాత్రమే ఉండేదని ప్రస్థుతం దానిని 1400 రూపాయలకు పెంచామన్నారు.

అతి తక్కువ సమయంలో 700 శాతం కమిషన్ పెంచిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. దేశంలోని ఏరాష్ట్రంలోనూ కేంద్ర ప్రభుత్వ కోటాకు అధనంగా ఇవ్వడం లేదని కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలోని 90.05 లక్షల కార్డుల్లో దాదాపు 35.56 లక్షల కార్డుల్లోని 91 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా ఒక్కొక్కరికి ఆరుకిలోల చొప్పున అందించడంతో పాటు కేంద్ర ప్రభుత్వ కార్డులకు సైతం అధనంగా కిలోను కేటాయిస్తున్నామన్నారు. కమిషన్ సైతం కేంద్రం పెంచుకున్నా పెంచి అందిస్తున్నామన్నారు.

ఏకమొత్తంగా 1400 రూపాయలకు కమిషన్ పెంచడమే కాకుండా రేషన్ డీలర్లు అడుగుతున్న ప్రధానమైన 13 అంశాలను ప్రభుత్వం పరిష్కరించింది. కరోనా సమయంలో సేవలందిస్తూ మరణించిన 100మంది డీలర్ల వారసులకు కారుణ్య నియామకం కింద డీలర్షిప్ మంజూరు చేయడం, రాష్ట్రంలో అమలవుతున్న రైతు, నేత, గౌడ తదితర బీమాల తరహాలో రేషన్ డీలర్లకు 5లక్షల బీమా అమలు చేయడం, ఆరోగ్యశ్రీ పరిధిలోకి ప్రతీ డీలర్ను తీసుకురావడం, ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద ఖచ్చితమైన తూకం వేసేలా వేబ్రిడ్జిల ఏర్పాటు, డీలర్షిప్ రెన్యూవల్ని 5 ఏళ్ల కాలపరిమితికి పెంచడం, రేషన్ డీలర్షిప్ వయోపరిమితిని 40 నుండి 50 ఏళ్లకు పెంపు, అంత్యక్రియల నిర్వహణకు తక్షణ సాయం 10 వేలు, 1.5 క్వింటాళ్ల వేరియేషన్ను కేసుల పరిధినుండి తీసివేయడం, హైదరాబాద్లో రేషన్ భవన్ నిర్మాణానికి భూకేటాయింపు తదితర 13 అంశాలపై సానుకూలత వ్యక్తం చేసారు.
డీలర్ల కమిషన్ పెంపు సహా తమ ఇతర సమస్యల పరిష్కారించిన ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రేషన్ డీలర్లు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. తమ కడుపునిండా పెట్టేలా కృషి చేసిన మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ గార్లకు, డిప్యూటీ స్పీకర్ పద్మారావ్ గౌడ్, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డిలకు సమావేశంలోనే ధన్యవాదాలు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు సివిల్ సప్లైస్ కమిషనర్ వి.అనిల్ కుమార్, రేషన్ డీలర్ల జేఏసీ ప్రతినిధులు నాయికోటి రాజు, మల్లిఖార్జున్, రవీందర్, నాయక్ తదితరులు పాల్గొన్నారు.
—————
Minister KTR to Inaugurate Nizamabad IT HUB on Wednesday
Hyderabad: The city of Nizamabad is eagerly preparing for the inauguration of the Nizamabad IT Hub, slated to be on August 09, 2023 (Wednesday). The esteemed guest for the ceremony will be Shri K. T. Rama Rao, Honourable Minister for Information Technology, Government of Telangana. The event will mark a significant milestone in the region’s technological development and open doors to a host of new opportunities.
The Nizamabad IT Hub already garnered considerable attention from various companies, with 15 companies signed up to establish their presence in the hub and recruited their employees to begin their operations, Said Mahesh Bigala, BRS Global NRI Coordinator. The vibrant and dynamic ecosystem of the IT Hub is set to attract investments, generate employment, and create a flourishing IT industry in Nizamabad.
In anticipation of the IT Hub’s inauguration, TASK (Telangana Academy for Skill and Knowledge) organized a Job Fair on July 21st. The fair provided a platform for aspiring individuals, including unemployed youth and graduating students, to explore the numerous job opportunities emerging in the IT sector. To oversee the developments of the IT Hub and various other projects in Nizamabad town MLC Kavitha Kalvakuntla, Mr. Ganesh Bigala, the Urban MLA of Nizamabad, Mr.Baji Reddy Govardhan, MLA Nizamabad Rural visited the IT Hub facilities. Their dedication and commitment to progress have been instrumental in shaping the growth of the city. The enthusiastic response from both IT companies and the local community reflects the anticipation and enthusiasm surrounding the IT Hub in Nizamabad.
The Nizamabad IT Hub’s establishment aligns with the State government’s vision of fostering a thriving technology ecosystem across the State. With its modern infrastructure and strategic location, the hub is poised to be a fulcrum of innovation, collaboration, and economic growth. The integration of technology and employment opportunities will pave the way for digital transformation and contribute to the overall socio-economic development of Nizamabad.
————————-
గిరిజనాభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.
పోడుభూముల పట్టాల పంపిణీలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానం
గిరిజనులను రైతులుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది.
సీఎం కేసీఆర్ పాలన గిరిజనులకు స్వర్ణయుగం
గిరిజన రిజర్వేషన్ 10% పెంచడంతో గిరిజనులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు
రేపు 09/08/2023 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిపుత్రులకు శుభాకాంక్షలు.
◆మంత్రి సత్యవతి రాథోడ్◆
హైదరాబాద్: ఆదివాసీల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని రాష్ట్ర గిరిజన స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి వర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అన్నారు. రేపు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిపుత్రులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. గౌరవ సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారని, ప్రత్యేకంగా గిరిజనులకు ప్రాధాన్యమిస్తున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పాలన గిరిజనులకు స్వర్ణయుగం అని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడ లేని విధంగా గిరిజనుల వెనుకబాటును తొలగించాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని తెలిపారు. ఆదివాసులకు అన్ని మౌళికవసతులు కల్పించడానికి రూ.కోట్లలో నిధులు మంజూరు చేస్తుందని వెల్లడించారు.
ప్రతి తండానూ గ్రామ పంచాయతీగా గుర్తించి.. ‘మా తండాలో మా రాజ్యం’ అనే గిరిజన ప్రజల కలను సాకారం చేసిందన్నారు. గిరిజనులకు పాలనఅధికారం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్ గారికి దక్కుతుందని అన్నారు. అంతే కాకుండా గిరిజన రిజర్వేషన్ 10 శాతం పెంచి గిరిజనులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని పేర్కొన్నారు.
అటవీ భూములను సాగు చేసుకుని బతుకుతున్న గిరి పుత్రులను సీఎం కేసీఆర్ గారు వారిని ఆ భూములకు యజమానులు చేసారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4 లక్షల 6 వేల 369 ఎకరాలకు గాను 1లక్ష51వేల 146 పోడు రైతులకు పట్టాలను అందజేయడం జరిగింది. అంతే కాకుండా అటవీ ఉత్పత్తులపై ఆధారపడ్డ అడవి బిడ్డలకు ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. గిరిజన విద్యాభివృద్ధి కోసం రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను ప్రారంభించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. ఇక దక్షిణ భారత కుంభమేళాగా చెప్పుకునే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ఉనికిగా చెప్పుకునేలా ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నదని చెప్పారు.
ఆదివాసీల ఆత్మగౌరవ ప్రతీకైన కుమ్రం భీం జయంతిని అధికారికంగా ఘనంగా జరుపుకుంటున్నాము. రాష్ట్ర రాజధాని నడిబొడ్డున బంజారా హిల్స్లో 25 కోట్లతో కొమురం భీమ్ ఆదివాసి భవన్ లను నిర్మించుకున్నామని తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా 32 ఆదివాసీ భవన్ లను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది అని తెలిపారు.
కేస్లాపూర్‌లోని నాగోబా జాతర, కొమురం భీం, జంగు భాయ్ వంటి అనేక ఉత్సవాలకు ప్రతి ఏటా ప్రభుత్వమే నిధులు మంజూరు చేస్తున్నదని వెల్లడించారు. ఈ సందర్భంగా మరో సారి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
——————-
నిరుపేద సరస్వతి పుత్రునికి ఎమ్మెల్సీ కవిత ఆర్థిక చేయూత..
మరోసారి పెద్దమననుసు చాటుకున్న ఎమ్మెల్సీ కవిత..
విదేశాల్లో ఉన్నత విద్యకు ఆర్థిక ఆటంకం ఏర్పడిన యువకునికి భరోసా ఇచ్చిన కవిత.
హైదరాబాద్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి తన పెద్దమనుసు చాటుకున్నారు. అభాగ్యులకు ఎప్పుడు అండగా నిలబడే ఆమె తాజాగా నిజామాబాద్ కు చెందిన ఓ నిరుపేద యువకునికి ఉన్నత విద్యాభ్యాసం కోసం ఆర్థిక చేయూత అందించారు.. నగరానికి చెందిన సామల రితీష్ కు అమెరికాలోని నార్త్ వెస్ట్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ సీటు లభించింది.. కానీ చిన్న ఉద్యోగం చేస్తూ తన కుటుంబాన్ని పోషించే రితీష్ తండ్రి అమెరికాకు తన కొడుకుని పంపించే స్తోమత లేక ఇబ్బందుల పాలు అయ్యారు.

ఈ విషయాన్ని రితీష్ ఎమ్మెల్సీ కవిత గారికి తెలియజేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్సీ కవిత రితీష్ అమెరికాకు వెళ్లడానికి అవసరమయ్యే ఖర్చులను భరించారు. వారికి టికెట్ను సొంత ఖర్చులతో ఇప్పించారు.. తన కలను సాకారం చేసుకునేందుకు ఆర్థిక చేయూత అందించి అండగా నిలబడిన ఎమ్మెల్సీ కవితకు రితీష్ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.