14 వ తేదీన తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం, హాజరుకానున్న…

సోమాజీగూడా ప్రెస్ క్లబ్ లో ఉదయం 11గంటలకు ప్రారంభంకానున్న సమావేశం

రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరుకానున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు & బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ మేధావులు, కవులు, కళాకారులు, ప్రొఫెసర్లు, తెలంగాణ ఉద్యమ కారులు మరియు ఎస్సీ , ఎస్టీ మరియు బీసీ సంఘాల నాయకులు

తెలంగాణ తల్లి విగ్రహా రూపాన్ని మార్చడం.. తెలంగాణ అధికారిక కార్యక్రమాల్లో విష సంస్కృతి తీసుకురావడం.. తెలంగాణ అస్తిత్వం పై దాడిని ముక్త కంఠంతో ఖండించడానికి ఏకం కానున్న తెలంగాణ సమాజం

బయ్యారం ఉక్కు – తెలంగాణ హక్కు

బీజేపీకి తెలంగాణపై ప్రేమ ఉంటే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలి

బయ్యారం ఉక్కు పరిశ్రమపై కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలి

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

14న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

ఎమ్మెల్సీ కవితను కలిసిన తెలంగాణ సగర, వంశరాజుల సంఘం నాయకులు

హైదరాబాద్ : బీజేపీకి తెలంగాణ పట్ల చిత్తశుద్ధి, ప్రేమ ఉంటే బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఉక్కు పరిశ్రమ కోసం కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తడి తీసుకురావాలని సూచించారు.

బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడం సాధ్యంకాదని లోక్ సభ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ప్రకటన పట్ల ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

[इच्छुक ड्रामा प्रेमी 12 जनवरी 2025 को मंचित होने वाले शो के टिकटों और अन्य जानकारी के लिए मोबाइल नंबर 93460 24369 पर संपर्क कर सकते हैं]

ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కాదని పార్లమెంటు సాక్షిగా తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించడం బాధాకరమని అన్నారు. రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బిజెపి ఎంపీలను గెలిపిస్తే ఒక్కరు కూడా స్పందించకపోవడం శోచనీయమన్నారు. ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో ఎంపీగా ఉన్న సమయంలో ఉక్కు పరిశ్రమ కోసం డిమాండ్ చేశారని, కానీ ఇప్పుడు మాత్రం మాట్లాడటం లేదని విమర్శించారు.

Also Read-

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఉక్కు పరిశ్రమలు ఏర్పాటు చేయించాలని డిమాండ్ చేశారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన చట్టంలో ఉందని, కాబట్టి కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న చట్టాన్ని మాత్రం అమలు చేయాల్సిందేనని తేల్చిచెప్పారు.

“బయ్యారం ఉక్కు – తెలంగాణ హక్కు” అంటూ తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేస్తున్నామని, తెలంగాణ రాష్ట్రం రాకముందే 2013లోనే బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు కేసీఆర్ లేఖ రాశారని గుర్తు చేశారు.

బయ్యారం ప్రాంతంలో లక్షా 41 వేలకు పైగా ఎకరాల్లో 300 మిలియన్ టన్నులకుపైగా ఐరన్ ఓర్ నిల్వలు ఉన్నాయని, అక్కడ ఉక్కు పరిశ్రమ వస్తే స్థానికంగా ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు పెరుగుతాయి అన్నది కేసీఆర్ ఆలోచనని పేర్కొన్నారు.

10 సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్న బిజెపి హామీని అమలు చేయడం లేదని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారని చెప్పారు. ఐరన్ ఓర్ నాణ్యత నేపథ్యంలో ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదని బిజెపి ప్రభుత్వం సాకు చూపిస్తోందని ఆరోపించారు. ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కావడానికి అవసరమైన మరో 100 మిలియన్ టన్నుల ఐరన్ ఓర్ ను ఛత్తీస్ ఘడ్ నుంచి తీసుకువచ్చేందుకు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వంతో కేసీఆర్ మాట్లాడారని తెలిపారు. కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం ఆ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

ఎమ్మెల్సీ కవితను కలిసిన తెలంగాణ సగర, వంశరాజుల సంఘం నాయకులు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను గురువారం నాడు తన నివాసంలో తెలంగాణ సగర, వంశరాజుల సంఘాల నాయకులు వేర్వేరుగా కలిశారు. ఇటీవల డెడికేటెడ్ కమిషన్ కు బీసీ కుల గణనపై నివేదిక సమర్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బొల్ల శివ శంకర్ యుపిఎఫ్ నాయకులు
వంశ రాజ రాష్ట్ర అధ్యక్షులు, ఇదిగిచ్చే మురళీకృష్ణ చిందం పాండు నిమ్మల వీరన్న, సగర సంఘ రాష్ట్ర అధ్యక్షులు శెన్ శెట్టి విజయేంద్ర సాగర్ మరియు ఎస్ పి శ్రీను సాగర్, బోశెట్టి భాస్కర్ సాగర్, శ్రీధర్ సాగర్ , గోపి సాగర్, చెన్నయ్య సాగర్, సిద్ది రాములు సాగర్ పాల్గొన్నారు

అయితే, తమ సమస్యలపై శాసన మండలిలో ప్రస్తావించాలని సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విజయేందర్ సాగర్ విజ్ఞప్తి చేశారు. తమకు ప్రభుత్వం ఆరోగ్య భద్రత కల్పన కోసం కృషి చేయాలని కోరారు. ప్రస్తుతం తాము బీసీ – డీ లో ఉన్నామని, దాన్ని బీసీ – ఏ కి మార్చే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే, తాము సంచారజాతులుగా ఉంటూ ఆర్థిక, రాజకీయ, విద్య, సామాజిక రంగాల్లో వెనుకబడి ఉన్నామని, కాబట్టి తమ సమస్యలను శాసన మండలిలో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వంశరాజుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మురళి, ప్రధాన కార్యదర్శి పాండు కోరారు.

14న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చి తెలంగాణ సంస్కృతి, అస్థిత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడి చేయడం, అధికారిక ఉత్సవాలు, వేదికలపై విష సంస్కృతిని ప్రవేశపెట్టడంపై ఈ నెల 14వ తేదీన సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వంలో రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మేధావులు, కళాకారులు, కవులు, రచయితలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నాయకులు పాల్గొననున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X