తెలంగాణలో బంజారా సమాజం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలని ఆరా తీసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు
హైదరాబాద్ : రిటైర్డ్ అడిషనల్ డీజీ డీటీ నాయక్ సహా పలువురు బంజారా ప్రముఖులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోమవారం భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని డీటీ నాయక్ నివాసానికి వెళ్లి కవిత మర్యాదపూర్వకంగా ఆయనతో పాటు పలువురు బంజారా ప్రముఖులతో సమావేశమయ్యారు.

ఈనెల 25న కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో బంజారా సమాజం కోసం ఏం చేయాలనే అంశాలపై వారితో కవిత చర్చించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే బంజారాలకు మంత్రివర్గంలో ప్రాతినిథ్యం లేకపోవడం ఇదే మొదటిసారి అని తాము ఏర్పాటు చేయబోయే పార్టీలకు బంజారా సమాజానికి సముచిత అవకాశాలు ఇస్తామని కవిత హామీ ఇచ్చారు. బంజారా ప్రముఖులు తాము ఏర్పాటు చేయబోయే రాజకీయ పార్టీకి సలహాలు, సూచనలు అందజేయాలని కోరారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించాలనుకునే వారికి తాము ఏర్పాటు చేయబోయే పార్టీలోకి స్వాగతం పలుకుతున్నామని తెలిపారు
Also Read-
సమావేశంలో బంజారా ప్రముఖులు, ట్రైబల్ వెల్ఫేర్ మాజీ కమిషనర్, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి లక్ష్మణ్ నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ సింగ్ నాయక్, కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ భీమ్లా నాయక్, బస్కీ నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి హరి నాయక్, ట్రైబల్ ఎలక్ట్రిసిటీ బోర్డు అధ్యక్షుడు నారాయణ, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ మీడియా సెక్రటరీ భీముడు నాయక్, ఎలక్ట్రిసిటీ డీఈఈ బాలాజీ నాయక్, తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్ నాయక్, జాగృతి నాయకులు మోహన్ నాయక్, కళ్యాణ్ నాయక్, సక్రు నాయక్, రవి రాథోడ్, శివ నాయక్, రాంజీ నాయక్, మహేందర్ నాయక్, మానుకోట కళ్యాణ్ నాయక్, సిద్ధు తదితరులు పాల్గొన్నారు.
