TS Inter Results 2023 : मंगलवार को तेलंगाना इंटर के नतीजे, इस लिंक पर देखिए नतीजे

हैदराबाद: इंटर बोर्ड के अधिकारी तेलंगाना इंटरमीडिएट के परिणाम जारी करने के लिए तैयार हैं। बोर्ड के अधिकारियों ने घोषणा की है कि राज्य की शिक्षा मंत्री सबिता इंद्रा रेड्डी मंगलवार सुबह 11 बजे इंटर का रिजल्ट जारी करेंगी। नामपल्ली स्थित इंटर बोर्ड कार्यालय में इंटर का रिजल्ट जारी किया जाएगा।

इंटर फर्स्ट और सेकेंड ईयर के नतीजे एक साथ जारी किए जाएंगे। 15 मार्च से 5 अप्रैल तक आयोजित अंतर-नियमित और व्यावसायिक परीक्षाओं के लिए लगभग 9.50 लाख छात्र उपस्थित हुए। इंटर के नतीजे के लिए वेबसाइट https://tsbienew.cgg.gov.in/ पर लॉगइन कर सकते हैं।

TS Inter Results | రేపు ఉద‌యం 11 గంట‌ల‌కు ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌

హైద‌రాబాద్ : తెలంగాణ ఇంటర్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డ్ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. రేపు ఇంటర్ బోర్డ్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు మంత్రి సబితా రెడ్డి ఫస్ట్, సెకండియర్ ఫలితాలను ఒకే సారి విడుదల చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొంది ఇంటర్ బోర్డ్.

ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యాలయంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మార్చి 15 నుంచి 4వ తేదీ వరకు నిర్వహించారు. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు https://tsbienew.cgg.gov.in/ వెబ్ సైట్లోనూ తమ రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు.

తెలంగాణ, ఏపీలో ఒకే సారి ఇంటర్ పరీక్షలు ముగియగా ఏపీలో ఇప్పటికే ఫలితాలు విడుదల చేశారు. పరీక్షలు పూర్తయిన దాదాపు 21 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేసి రికార్డు సృష్టించింది ఇంటర్ బోర్డు. దీంతో తెలంగాణలో ఫలితాలు ఎప్పుడనే అంశంపై జోరుగా చర్చలు సాగాయి.

సోషల్ మీడియాలో వివిధ తేదీల్లో ఫలితాలంటూ ప్రచారం సాగడంతో విద్యార్థుల్లో టెన్షన్ వాతావరణం కనిపించింది. ఇంటర్ బోర్డు సైతం ఫలితాల విడుదల తేదీలపై స్పష్టమైన ప్రకటనలేవీ విడుదల చేయకపోవడంపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి.

ఎట్టకేలకు ఫలితాలను రేపు విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటన విడుదల చేయడంతో సోషల్ మీడియాలో ఊహాగానాలకు, విద్యార్థుల్లో టెన్షన్ కు తెర పడింది. అయితే… గతంలో జరిగిన పొరపాట్లను దృష్టిలో ఉంచి అవి పునరావృతం కాకుండా ఒకటికి రెండు సార్లు ట్రయల్స్ నిర్వహించడం కారణంగానే ఫలితాల విడుదలలో ఆలస్యం అవడానికి కారణంగా తెలుస్తోంది. వాస్తవానికి 20 రోజుల క్రితమే వాల్యుయేషన్ పూర్తి అయ్యింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X