Exams: ఫిబ్రవరి 28 నుంచి తెలంగాణ ఇంటర్‌ ఎగ్జామ్స్‌, ప్రాక్టికల్స్‌ ఎప్పుడంటే…

హైదరాబాద్‌ : తెలంగాణ ఇంటర్‌ వార్షిక పరీక్షలను వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు నిర్వహించనున్నట్టు ఇంటర్‌ బోర్డు తెలిపింది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్‌బోర్డు కార్యదర్శి శృతి ఓజా గురువారం విడుదల చేశారు.

ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌, ఫిబ్రవరి 29 నుంచి ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇక ఫస్టియర్‌ పరీక్షలు 2024 మార్చి 18, సెకండియర్‌ పరీక్షలు మార్చి 19న ముగియనున్నాయి. అయితే, ప్రధాన పరీక్షలు రెండు రోజుల ముందుగానే పూర్తవుతాయి.

పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో కాస్త ముందుగానే ఇంటర్‌ వార్షిక పరీక్షలను నిర్వహించేలా ఇంటర్‌బోర్డు పరీక్షల షెడ్యూల్‌ను రూపొందించి విడుదల చేసింది. ఒక రోజు ఫస్టియర్‌ వారికి, మరో రోజు సెకండియర్‌ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలుంటాయి. నిమిషం ఆలస్యమైనా పరీక్షలు రాసేందుకు విద్యార్థులను అనుమతించరు.

ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ను 2024 ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు నిర్వహిస్తారు. జనరల్‌, వొకేషనల్‌ కోర్సులో విద్యార్థులకు రెండో శనివారం, ఆదివారం ప్రాక్టికల్స్‌ జరుగుతాయి. ప్రాక్టికల్స్‌ను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఇక ఈ ఏడాది తొలిసారిగా ఫస్టియర్‌ విద్యార్థులకు ఇంగ్లిష్‌ ప్రాక్టికల్స్‌ను కూడా నిర్వహించనున్నారు. ఈ ప్రాక్టికల్స్‌ను ఫిబ్రవరి 16న నిర్వహిస్తారు.

వచ్చే ఫిబ్రవరి 17న ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వ్యాల్యూస్‌ ఎగ్జామినేషన్‌, ఫిబ్రవరి 19న ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు కొనసాగుతాయి. ఈ రెండు పరీక్షలు ఇంటర్నల్స్‌ కాగా, వీటిని విద్యార్థులు చదువుతున్న సంబంధిత కాలేజీల్లోనే నిర్వహిస్తారు. ఈ రెండు పరీక్షలకు హాజరవడం తప్పనిసరి. లేదంటే ఫెయిలైనట్టుగానే పరిగణిస్తారు. (ఏజెన్సీలు)

ఫస్టియర్‌ పరీక్షల షెడ్యూల్‌

28-02-2024 (బుధవారం) సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ -1
01-03-2024 (శుక్రవారం) ఇంగ్లిష్‌ పేపర్‌ -1
04-03-2024 (సోమవారం) గణితం పేపర్‌ – 1ఏ, బాటనీ పేపర్‌ -1, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌ -1
06-03-2024 (బుధవారం) గణితం పేపర్‌ – 1బీ, జువాలజీ పేపర్‌ -1, హిస్టరీ పేపర్‌ -1
11-03-2024 (సోమవారం) ఫిజిక్స్‌ పేపర్‌ -1, ఎకనామిక్స్‌ పేపర్‌ -1
13-03-2024 (బుధవారం) కెమిస్ట్రీ పేపర్‌ -1, కామర్స్‌ పేపర్‌ -1
15-03-2024 (శుక్రవారం) పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌ -1, బ్రిడ్జికోర్సు గణితం పేపర్‌ -1 (బైపీసీ విద్యార్థులకు)
18-03-2024 (సోమవారం) మోడర్న్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ -1, జాగ్రఫీ పేపర్‌ -1

సెకండియర్‌ పరీక్షల షెడ్యూల్‌

29-02-2024 (గురువారం) సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ -2
02-03-2024 (శనివారం) ఇంగ్లిష్‌ పేపర్‌ -2
05-03-2024 (మంగళవారం) గణితం పేపర్‌ -2ఏ, బాటనీ పేపర్‌ -2, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌ -2
07-03-2024 (గురువారం) గణితం పేపర్‌ -2బీ, జువాలజీ పేపర్‌ -2, హిస్టరీ పేపర్‌ -2
12-03-2024 (మంగళవారం) ఫిజిక్స్‌ పేపర్‌ -2, ఎకనామిక్స్‌ పేపర్‌ -2
14-03- 2024 (గురువారం) కెమిస్ట్రీ పేపర్‌ -2, కామర్స్‌ పేపర్‌ -2
16-03-2024 (శనివారం) పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌ -2, బ్రిడ్జికోర్సు గణితం పేపర్‌ -2 (బైపీసీ విద్యార్థులకు)
19-03-2024 (మంగళవారం) మోడర్న్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ -2, జాగ్రఫీ పేపర్‌ -2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X