बुद्धिजीवियों की माओवादी से अहम अपील, बोले- “गतिविधि की समीक्षा करें और कानूनी तरीकों से आगे बढ़ें…” మావోయిస్టు పార్టీకి మేధావుల విజ్ఞప్తి

हैदराबाद : तेलंगाना सिविल राइट्स एसोसिएशन के नेताओं और बुद्धिजीवियों ने तेलंगाना सरकार और माओवादी पार्टी से एक अहम अपील की है। इस बारे में शनिवार को एक बयान जारी किया गया। बयान जारी करने वालों में प्रोफेसर जी. हरगोपाल, प्रोफेसर डी. नरसिम्हा रेड्डी, प्रोफेसर रमा मेलकुटे, प्रोफेसर एम. कोदंडराम, प्रोफेसर घंटा चक्रपाणि, अल्लम नारायण, प्रोफेसर कल्पना कन्नभिरन और के. श्रीनिवास शामिल हैं।

सिविल राइट्स ग्रुप के नेताओं और बुद्धिजीवियों ने बयान में कहा, “इतने सालों में लोगों को आत्म-सम्मान के साथ जीने के लिए ज़रूरी सामाजिक-आर्थिक बदलाव में आपने जो योगदान दिया है, वह बहुत ही प्रशसनीय है। आपके संघर्ष की वजह से लोगों की ज़िंदगी में कई बदलाव आए हैं। हम यह भी मानते हैं कि आज के समाज को आप जैसे लोगों की ज़रूरत है जो कमिटमेंट और ईमानदारी से लोगों के लिए खड़े हैं। हालांकि, मौजूदा हालात में, आपकी गतिविधि की समीक्षा करने और कानूनी तरीकों से आगे बढ़ाने की ज़रूरत है। हम माओवादी पार्टी से इस दिशा में फ़ैसला लेने की अपील करते हैं। इसके अलावा, सरकार की ज़िम्मेदारी है कि वह माओवादियों के गतिविधियों की समीक्षा करने में मदद करे। इस ऐतिहासिक संदर्भ में हम सरकार से समाज में शांति को बढ़ावा देने के मकसद से बदलाव में योगदान देने की अपील करते हैं।”

यह भी पढ़ें-

మావోయిస్టు పార్టీకి మేధావుల విజ్ఞప్తి, ‘మీ కార్యాచరణను సమీక్షించుకొని లీగల్ మార్గాల ద్వారా…’

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వానికి, మావోయిస్టు పార్టీకి తెలంగాణ పౌర హక్కుల సంఘం నేతలు, మేధావులు కీలక విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. ప్రకటన విడుదల చేసిన వారిలో ప్రొఫెసర్ జి.హరగోపాల్. ప్రొఫెసర్ డి. నరసింహారెడ్డి. ప్రొఫెసర్ రమా మేల్కొటే, ప్రొఫెసర్ ఎం. కోదండరామ్, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, అల్లం నారాయణ, ప్రొఫెసర్ కల్పన కన్నాభిరాన్, కే. శ్రీనివాస్‌లు ఉన్నారు.

పౌర హక్కుల సంఘం నేతలు, మేధావులు ప్రకటనలో… “ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఆత్మగౌరవంతో జీవించడానికి అవసరమైవ సామాజిక – ఆర్థిక మార్పునకు మీరు చేసిన కృషి చాలా గొప్పది. మీ పోరాటం కారణంగానే ప్రజల జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి. నిబద్ధతతో, నిజాయితీగా ప్రజల కోసం నిలబడిన మీలాంటి వారి అవసరం నేటి సమాజానికి ఉందని కూడా మేము నమ్ముతున్నాం. అయితే వర్తమాన పరిస్థితుల్లో మీ కార్యాచరణను సమీక్షించుకొని లీగల్ మార్గాల ద్వారా ముందుకు తీసుకొనివెళ్ళవలసిన అవసరం కనబడుతున్నది. ఈ దిశగా మీరు నిర్ణయం తీసుకోవాలని మావోయిస్టు పార్టీని విజ్ఞప్తి చేస్తున్నాం. దీంతో పాటు మావోయిస్టులు తమ ఆచరణను సమీక్షించుకోవడానికి సహకరించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఈ చారిత్రక సందర్భంలో, సమాజంలో శాంతిని పెంపొందించే లక్షంతో, మార్పునకు దోహదపడవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం” అని కోరారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X