हैदराबाद: तेलंगाना में फिलहाल छह एमएलसी सीटें खाली हैं। दो एमएलसी सीटों के लिए इस महीने की 29 तारीख को चुनाव होंगे। वहीं राज्यपाल कोटे से भी दो एमएलसी सीटें खाली हैं। बहुत सारे उम्मीदवार इन पदों के लिए आस लगाये बैठे हैं। सीएम रेवंत रेड्डी ने राज्यपाल कोटा एमएलसी सीटों को लेकर अहम घोषणा की है। तेलंगाना जन समिति के नेता प्रोफेसर कोदंडराम को राज्यपाल कोटा विधानसभाओं को भेजेंगे। सीएम ने कहा कि उन्हें तुरंत एमएलसी बनाना उनकी जिम्मेदारी है और सदन में उनके जैसे लोग होने चाहिए। इससे एक एक एमएलसी की स्थिति स्पष्ट हो गयी है। अब यह चर्चा का विषय बन गया है कि दूसरे पद के लिए उम्मीदवार के रूप में किसे चुना जाएगा।
दूसरे स्थान पर मशहूर शिक्षण संस्थानों के प्रमुख जफर जावेद का नाम प्रमुखता से सुनने को मिल रहा है। हैदराबाद में मुफकन्ज़ा और सुल्तान उल उलूम जैसे शैक्षणिक संस्थान चलाने वाले जावेद जफर के नाम पर कांग्रेस विचार कर रही है। चूंकि उनका राजनीति से कोई लेना-देना नहीं है। इसलिए वह उन्हें शिक्षा क्षेत्र की ओर से नामांकित करना चाहते हैं। पिछली बीआरएस सरकार में दासोजू श्रवण और कुर्रा सत्यनारायण को एमएलसी के रूप में नामित किया गया था। राज्यपाल ने उन्हें लंबित रखा था। राज्यपाल ने तत्कालीन सरकार से पूछा कि वे बताएं कि किस आधार पर उन्हें एमएलसी मनोनीत किया गया। बाद में उनकी उम्मीदवारी रद्द कर दी गई।
शिक्षण संस्थानों के प्रमुख जफर जावेद
इससे कांग्रेस को उम्मीद है कि इस बार ऐसे कड़वे अनुभव से बचा जा सकता है। भले ही प्रोफेसर कोदंडराम एक राजनीतिक दल के अध्यक्ष हैं, लेकिन सरकार से आने वाली फाइल में विशेष विवरण का उल्लेख करने का ध्यान रखा जाता है ताकि इसे राजनीति से जोड़ा न जाए। प्रोफेसर कोदंडराम की तेलंगाना आंदोलन में निभाई गई भूमिका और प्रोफेसर के रूप में उनकी सेवाओं के आधार पर संभावना है कि उनके नाम को राज्य कैबिनेट द्वारा अनुमोदित कर राज्यपाल के पास भेजा जाएगा। रेवंत सरकार जल्द ही कैबिनेट निर्णय लेने और आगामी राज्य बजट बैठकों में इसे अंतिम रूप देने वाले हैं।
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ: సీఎం రేవంత్ రెడ్డి సరైన నిర్ణయం, కోదండరామ్ ఒకరు, మరొకరు ఆయనేనా?
హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుతం ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈనెల 29న 2 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక గవర్నర్ కోటాలోనూ 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అయితే ఈ స్థానాలకు భారీగా ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డీ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ జనసమితి అధినేత, ప్రొఫెసర్ కోదండరాంను గవర్నర్ కోటాలో చట్టసభలకు పంపుతామని చెప్పారు. తక్షణమే ఆయన్ను ఎమ్మెల్సీ చేయాల్సిన బాధ్యత తమపై ఉందని.. ఆయన లాంటి వారు సభలో ఉండాలని సీఎం అన్నారు. దీంతో ఓ స్థానంపై స్పష్టత వచ్చింది. మరో స్థానంలో ఎవర్ని అభ్యర్థిగా ఎంపిక చేస్తారనేది హాట్ టాఫిక్‌గా మారింది.
రెండో స్థానంలో ప్రముఖ విద్యాసంస్థల అధినేత జాఫర్ జావీద్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. హైదరాబాద్‌లో ముఫకంజా, సుల్తాన్ ఉల్ ఉలూమ్ లాంటి విద్యాసంస్థలను నిర్వహిస్తున్న జావీద్ జాఫర్ పేరును కాంగ్రెస్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి కావడంతో విద్యారంగం తరఫున ఆయనను ప్రతిపాదించాలనుకుంటుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాసోజు శ్రవణ్, కుర్ర సత్యానారాయణను ఎమ్మెల్సీగా ప్రతిపాదించగా.. గవర్నర్ పెండింగ్‌లో పెట్టారు. వారిని ఏ ప్రాతిపదికన ఎమ్మెల్సీగా నామినేట్ చేశారో చెప్పాలని గవర్నర్ అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనంతరం వారిద్దరి అభ్యర్థిత్వాన్ని పక్కన పెట్టారు.
దీంతో ఈసారి అలాంటి చేదు అనుభవం ఎదురుకాకుండా వ్యవహరించాలని కాంగ్రెస్ భావిస్తుంది. ప్రొఫెసర్ కోదండరాం రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ రాజకీయాలతో ముడిపెట్టకుండా ఉండేలా ప్రభుత్వం నుంచి వెళ్ళే ఫైల్‌లో నిర్దిష్టంగా వివరాలను పేర్కొనేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ కోదండరాం పోషించిన పాత్ర, ప్రొఫెసర్‌గా సేవల ఆధారంగా ఆయన పేరును రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించి గవర్నర్‌కు పంపే అవకాశముంది. త్వరలోనే క్యాబినెన్ నిర్ణయం తీసుకుని రాబోయే స్టేట్ బడ్జెట్ సమావేశాల్లోపే ఫైనల్ చేయాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. (ఏజెన్సీలు)