హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమ ప్రభుత్వం కొనసాగుతోందన్నారు జాతీయ రైతు సంఘాల నాయకులు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన జాతీయ రైతు సంఘాల నాయకుల బృందం.. రెండు రోజులుగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. ఈరోజు బిఆర్కే భవన్ లోని వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ను కలిసింది.

రాష్ట్రంలో రైతులు, వ్యవసాయ కోసం అమలవుతున్న పథకాలపై ఆరా తీశారు. ప్రధానంగా దేశంలో ఎక్కడా లేనివిదంగా రాష్ట్రంలో ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ పథకం ద్వారా రైతులు రుణ విముక్తులయ్యారని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి.. జాతీయ రైతుసంఘం బృందానికి వివరించారు. అదేవిదంగా సన్నాలకు 500 రూపాయల బోనస్ ద్వారా రాష్ట్రంలో సన్నాల సాగు అమాంతం పెరిగిందని దాని ద్వారా రైతులు ఆర్ధికంగా ఎదుగుతున్నట్లు తెలిపారు.
Also Read-
ఇక రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లాంటి పథకాలు కూడా వివరించారు. జాతీయ రైతు సంఘం నేతలు సైతం రెండు రోజులుగా రాష్ట్రంలో పర్యటించిన విషయాలపై కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు కేవీఎన్ రెడ్డి, భవానీ రెడ్డి, గడుగు గంగాధర్ తో చర్చించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం అని జాతీయ రైతు సంఘాల నాయకులు కొనియాడారు. తెలంగాణకు వచ్చిన జాతీయ రైతు సంఘాల నాయకులను సన్మానించింది రైతు కమిషన్