हैदराबाद: प्रतिष्ठित ‘तेलंगाना गद्दर फिल्म पुरस्कार-2024’ समारोह का आयोजन हाईटेक्स में किया गया। इस भव्य समारोह में मुख्यमंत्री रेवंत रेड्डी ने भाग लिया और विभिन्न श्रेणियों में सर्वश्रेष्ठ पुरस्कारों के लिए चुनी गई हस्तियों को पुरस्कार प्रदान किए। सरकार ने न केवल 14 वर्षों से रुके इस पुरस्कार कार्यक्रम को पुनर्जीवित किया, बल्कि 2014-24 तक दस वर्षों की अवधि के लिए फिल्म उद्योग में सर्वश्रेष्ठ पुरस्कार भी प्रदान किए। साथ ही फिल्म दिग्गजों के नाम पर विशेष पुरस्कार भी स्थापित किए।
इस समारोह में उपमुख्यमंत्री भट्टी विक्रमार्क, सिनेमेटोग्राफी मंत्री कोमाटिरेड्डी वेंकट रेड्डी और तेलंगाना फिल्म विकास निगम के अध्यक्ष दिल राजू की मौजूदगी में सीएम रेवंत रेड्डी ने फिल्म उद्योग में उत्कृष्ट योगदान देने वाले अभिनेताओं, निर्देशकों, निर्माताओं, संगीतकारों, लेखकों, तकनीशियनों और मशहूर हस्तियों को तेलंगाना गद्दर फिल्म पुरस्कार-2024 प्रदान किए।

एनटीआर राष्ट्रीय फिल्म पुरस्कार नंदमुरी बालकृष्ण को, पैडी जयराज फिल्म पुरस्कार मणिरत्नम को, बीएन रेड्डी फिल्म पुरस्कार सुकुमार को, नागिरेड्डी-चक्रपाणि फिल्म पुरस्कार अटलुरी पूर्णचंदर राव को, कांता राव फिल्म पुरस्कार विजय देवरकोंडा को, रघुपति वेंकय्या फिल्म पुरस्कार यंडमुरी वीरेंद्रनाथ को, सर्वश्रेष्ठ अभिनेता पुरस्कार अल्लू अर्जुन को और सर्वश्रेष्ठ अभिनेत्री पुरस्कार निवेदा थॉमस को दिया गया। इनके अलावा कई अन्य श्रेणियों में भी पुरस्कार प्रदान किए गए।
यह भी पढ़ें-
मुख्यमंत्री ने इस अवसर पर ऑस्कर पुरस्कार विजेता चंद्र बोस और एमएम कीरवानी को सम्मानित किया। सरकार की ओर से गद्दर जयंती समारोह के आयोजन में भागीदारी के लिए गद्दर फाउंडेशन सूर्यकिरण को तीन करोड़ रुपये का दस्तावेज सौंपा गया। इस अवसर पर अभिनेताओं और फिल्म उद्योग की हस्तियों ने फिल्म उद्योग को बढ़ावा देने के लिए लोक गायक गद्दर के नाम पर पुरस्कारों को पुनर्जीवित करने के लिए सरकार को धन्यवाद दिया।
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2024 వేడుక గ్రాండ్ సక్సెస్
హైదరాబాద్ : ప్రతిష్టాత్మక ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2024’వేడుక హైదరాబాద్ హైటెక్స్‌లో కన్నుల పండుగగా సాగింది. అత్యంత వైభవంగా సాగిన ఈ వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని వివిధ విభాగాల్లో ఉత్తమ అవార్డులకు ఎంపికైన ప్రముఖులకు పురస్కారాలను అందించారు. 14 ఏళ్లుగా నిలిచిపోయిన ఈ అవార్డుల కార్యక్రమాన్ని ప్రజా ప్రభుత్వం పునరుద్ధరించడమే కాకుండా 2014-24 వరకు పదేళ్ల కాలానికి గానూ సినిమా రంగంలో ఉత్తమ అవార్డులతో పాటు చలనచిత్ర వైతాళికుల పేరుతో నెలకొల్పిన ప్రత్యేక పురస్కారాలను కూడా ఈ వేడుక ద్వారా అందించారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తెలంగాణ ఫిల్మ్ డెవల్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుల సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి అవార్డులకు ఎంపికైన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సంగీత, సాహిత్యకారులు, సాంకేతిక నిపుణులు, చలన చిత్ర పరిశ్రమలో విశేష కృషి చేసిన ప్రముఖులకు తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డులను అందజేశారు.
ఎన్టీఆర్ జాతీయ ఫిల్మ్ అవార్డును నందమూరి బాలకృష్ణకి, పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డును మణిరత్నంకి, బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డును సుకుమార్‌కి, నాగిరెడ్డి – చక్రపాణి ఫిల్మ్ అవార్డును అట్లూరి పూర్ణచందర్ రావుకి, కాంతారావు ఫిల్మ్ అవార్డును విజయ్ దేవరకొండకు, రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డును యండమూరి వీరేంద్రనాథ్‌కి, ఉత్తమ నటుడు అవార్డును అల్లు అర్జున్‌కు, ఉత్తమ నటి అవార్డును నివేదా థామస్‌కి అందజేశారు. ఇవే కాకుండా అనేక విభాగాల్లో అవార్డులను అందజేశారు.
ఆస్కార్ అవార్డు గ్రహీతలు చంద్రబోస్, ఎంఎం కీరవాణిని ఈ వేదికగా ముఖ్యమంత్రి సత్కరించారు. గద్దర్ జయంతి వేడుకల నిర్వహణలో భాగస్వామ్యం కల్పిస్తూ ప్రభుత్వం తరపున మూడు కోట్ల రూపాయలకు సంబంధించిన పత్రాన్ని గద్దర్ ఫౌండేషన్ సూర్యకిరణ్‌కు అందజేశారు. సినీ పరిశ్రమలను ప్రోత్సహించడానికి ప్రజాగాయకుడు గద్దర్ పేరిట అవార్డులను పునరుద్ధరించడం పట్ల నటీనటులు, సినీ పరిశ్రమ ప్రముఖులు ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. (ఏజెన్సీలు)
