Dr B R Ambedkar Open University: TELANGANA STATE FORMATION DAY CELEBRATIONS

Hyderabad: Prof. K. Seetharama Rao, Vice-Chancellor, Dr. B. R. Ambedkar Open University today hoisted the tri-colour National Flag on the occasion of 10th Telangana State Formation Day at the campus. Prof Rao extended State Formation day greetings to the Staff. He also congratulated the university officials, staff and students on the State Formation Day.

He remembered the sacrifices of the martyrs who participated in the formation of Telangana. He said that the country is recognizing the progress of Telangana in many sectors. In many departments, the state is a guide for most of the states in the country. In the coming days, the progress in the education sector should also be a compass for the country and the employees are advised to work in that same direction.

He revealed that there is a possibility the NAAC peer team will be visited upcoming month, and before that they will focus on the creation of infrastructure. In the next academic year, the employees to give more priority to student services. Dr.A.V.R.N. Reddy, Registrar, all Directors, Deans, Heads of Branches, Teaching and Non-Teaching Staff members and representatives of University Service Associations attended the Telangana State Formation Day Celebrations.

డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు

హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కే. సీతారామ రావు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అయన విశ్వవిద్యాలయ, విద్యార్ధులు, అధికారులు, సిబ్బందికి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

అయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు లో భాగస్వాములైన అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. చాలా విభాగాల్లో తెలంగాణ ప్రగతిని దేశం గుర్తిస్తోంధన్నారు. అనేక విభాగాల్లో రాష్త్రం దేశంలోని చాలా రాష్ట్రాలకు మార్గదర్శిగా నిలుస్తోందని రానున్న రోజుల్లో విద్యా రంగంలోని ప్రగతి కూడా దేశానికి దిక్సూచిలా కావాలని ఆ దిశగా ఉద్యోగులు పని చేయాలని సూచించారు.

విశ్వవిద్యాలయానికి వచ్చే నెలలో న్యాక్ పీర్ టీం పర్యటించే అవకాశం ఉందని, ఆ లోపు మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థులకు మెరుగైన సేవలు అందించడానికి ఉద్యోగులు మరింత నిబద్ధతతో పని చేయాలన్నారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్, డా. ఎ.వి.ఆర్.ఎన్. రెడ్డి, అన్ని విభాగాల డైరెక్టర్స్, అధిపతులు, డీన్స్, బోధన మరియు భోదనేతర సిబ్బంది, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X