हैदराबाद : तेलंगाना स्थापना दिवस के मौके पर रिहर्सल आयोजित की गई। इसी क्रम में तेलंगाना स्पेशल पुलिस (ट्विटर) एक्स ने तस्वीरें जारी की हैं। पुलिस परेड, मार्च फास्ट, ध्वज अनावरण और अन्य संबंधित रिहर्सल की तस्वीरें सोशल मीडिया पर साझा की गई हैं। इस बीच, रिहर्सल की पृष्ठभूमि में गन पार्क और सिकंदराबाद परेड ग्राउंड में यातायात प्रतिबंध लगा दिया गया।
इसी के चलते परेड ग्राउंड में अपर टैंक बंड पर ये यातायात प्रतिबंध शाम 7 से 9 बजे तक लागू रहेंगे। पुलिस ने कहा कि इन प्रतिबंधों को ध्यान में रखते हुए मोटर चालकों को वैकल्पिक मार्ग अपनाना चाहिए। तेलंगाना स्थापना दिवस समारोह को कांग्रेस सरकार भव्य तरीके से आयोजित करेगी। सुबह और शाम दोनों समय समारोह भव्य रूप से आयोजित किए जाएंगे।
2 जून को सुबह 9.30 बजे मुख्यमंत्री रेड्डी गनपार्क शहीद स्तूप पर शहीदों को श्रद्धांजलि अर्पित करेंगे। सुबह 10 बजे परेड ग्राउंड में पुलिस बलों की परेड, मार्च फास्ट और राष्ट्रीय ध्वज फहराकर सलामी दी जाएगी। इस दौरान तेलंगाना राज्य के आधिकारिक गान का अनावरण किया जाएगा। इसके बाद कांग्रेस पार्टी की वरिष्ठ नेता सोनिया गांधी और सीएम रेवंत रेड्डी के भाषण होंगे। पुलिस कर्मियों और सर्वश्रेष्ठ टुकड़ियों को पुरस्कार दिए जाएंगे। इसके बाद रात तक टैंक बंड पर विभिन्न प्रकार के सांस्कृतिक कार्यक्रम आयोजित किये जायेंगे।
संबंधित खबर-
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రిహార్సల్స్
హైదరాబాద్ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేడుకలకు సంబంధించిన రిహార్సల్స్‌ను నిర్వహించారు. ఈ క్రమంలోనే తెలంగాణ స్పెషల్ పోలీస్ (ట్విట్టర్) ఎక్స్ వేదికగా ఫోటోలు విడుదల చేసింది. పోలీసుల పరేడ్, మార్చ్ ఫాస్ట్, జెండా ఆవిష్కరణ, తదితర సంబంధిత రిహార్సల్స్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. కాగా, రిహార్సల్స్ నేపథ్యంలో గన్ పార్క్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
కాగా, పరేడ్ గ్రౌండ్ వద్ద, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు అప్పర్ ట్యాంక్ బండ్ మీద ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఈ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని పోలీసులు తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను కాంగ్రెస్ అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఉదయం, సాయంత్రం రెండు పూటలా వేడుకలు నిర్వహిస్తారు.
జూన్ 2న ఉదయం 9.30 గంటలకు గన్‌పార్క్ అమరుల స్తూపం వద్ద అమరవీరులకు సీఎం నివాళులు అర్పిస్తారు. ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు బలగాల పరేడ్, మార్చ్ ఫాస్ట్, వందన స్వీకార కార్యక్రమం ఉంటుంది. అక్కడే తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం సోనియా గాంధీ ప్రసంగం, సీఎం రేవంత్ ప్రసంగం ఉంటుంది. పోలీసు సిబ్బందికి, ఉత్తమ కాంటింజెంట్లకు అవార్డులను ప్రదానం చేస్తారు. అనంతరం ట్యాంక్ బండ్‌పై రాత్రి వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. (ఏజెన్సీలు)