కర్ణాటక రాష్ట్రానికి రావాలని ఆహ్వానించిన మంత్రి బోసు రాజు
హైదరాబాద్ : హైదరాబాద్ కు వచ్చిన కర్ణాటక రాష్ట్ర మైనర్ ఇరిగేషన్ శాఖ మంత్రి బోసు రాజు తో బేగం పేట టూరిజం ప్లాజా లో భేటీ అయిన రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు భవానీ రెడ్డి. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాలకు చెందిన మైనర్, మేజర్ ఇరిగేషన్ లపై చర్చించిన మంత్రి, రైతు కమిషన్.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం మైనర్ ఇరిగేషన్ ను మేజర్ ఇరిగేషన్ తో కలపడం వల్ల.. చెరువులు మరమత్తులు జరగక, కబ్జాలకు గురై భూ గర్భ జలాలు అడుగంటుకు పోయాయని, కమిషన్ ఇప్పటికే మైనర్ ఇరిగేషన్ ను విడదీసి స్థానిక రైతులను నీటి సంఘాలుగా ఏర్పాటు చేసి భూ గర్భ జలాలు పెంపొందింపజేయడానికి తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ఒక నివేదిక ఇచ్చినట్లు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి మంత్రి బోసు రాజుకి వివరించారు.

Also Read-
అదేవిదంగా కర్ణాటక ఇరిగేషన్ మంత్రి బోసు రాజు తో కోదండరెడ్డి భవానీ రెడ్డిలు కలిసి కర్ణాటక రాష్ట్రంలో అమలవుతున్న మైనర్ ఇరిగేషన్ పాలసీపై చర్చించారు. కర్ణాటక మంత్రి బోసు రాజు సమాధానం ఇస్తూ.. నేను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి చర్చిస్తానని, మీరు మా రాష్ట్రానికి వచ్చి మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఒకసారి సందర్శించండి అని చెప్పడం జరిగింది.