Telangana Elections-2023: शराब की रिकॉर्ड तोड़ बिक्री, चुनाव आयोग की आंख पर ऐसी बांध रहे हैं पट्टी

हैदराबाद: तेलंगाना विधानसभा चुनाव के मद्देनजर शराब की बिक्री बेहिसाब बढ़ गई है। बीयर की बोतलें, व्हिस्की और ब्रांडी क्वार्टर बड़े पैमाने पर बिक रहे हैं। अभी छह दिनों तक चुनाव प्रचार अभियान होने के कारण शराब कारोबारी थोक में माल लाकर स्टॉक कर रहे हैं। इस महीने की 28 तारीख से 3 दिनों के लिए शराब की दुकानें बंद करने के चुनाव आयोग के आदेश के मद्देनजर कई व्यापारी दुकानों के बाहर भारी मात्रा में शराब का स्टॉक कर रहे हैं।

सभी पार्टियां मतदाताओं को प्रभावित करने के लिए सभी प्रकार के इंतजाम कर रही हैं। इसमें शराब और चिकन-मटन शामिल है। चुनाव आचार संहिता लागू होने के 9 अक्टूबर के बाद से तेलंगाना में विभिन्न स्थानों पर लगभग 105 करोड़ रुपये की शराब जब्त की गई है।

एक्साइज विभाग के एक वरिष्ठ अधिकारी के मुताबिक, पिछले साल 1 से 20 नवंबर के बीच राज्य भर में 1,260 करोड़ रुपये की शराब बिकी थी। इस साल यह 1,470 करोड़ रुपये तक पहुंच गई है। पिछले साल की तुलना में इस बार 210 करोड़ रुपये की ज्यादा बिक्री हुई है। ध्यान देने वाली बात यह है कि बीयर की बिक्री में जबरदस्त इजाफा हुआ है। पिछले साल 1 से 20 नवंबर के बीच करीब 12.5 लाख रुपये कार्टन बीयर की बिक्री हुई थी। इस बार यह आंकड़ा 22 करोड़ रुपये को पार कर गया है।

इससे साफ होता है कि चुनाव के कारण शराब की बिक्री बढ़ी है। मालूम हो कि सभी पार्टियों के उम्मीदवार पहले ही अपने-अपने विधानसभा क्षेत्रों में विभिन्न माध्यमों से घर-घर शराब बांट चुके हैं। खबर है कि कई प्रत्याशियों ने शराब दुकानों के मालिकों से शराब बांटने का एग्रीमेंट कर लिया हैं। हर दिन का हिसाब-किताब साफ कर देने से शराब दुकान मालिक उम्मीदवारों के इशारे पर काम कर रहे हैं।

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మద్యం అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇటు బీరు బాటిళ్లు అటు విస్కీ, బ్రాందీ క్వార్టర్లు జోరుగా అమ్ముడవుతున్నాయి. మరో ఆరు రోజులపాటే ప్రచారం జరుగనుండటంతో మద్యం వ్యాపారులు సరుకును భారీగా తెప్పించుకుని స్టాక్ నిల్వ ఉంచుకుంటున్నారు. ఈనెల 28వ తేదీ నుంచి 3 రోజులపాటు మద్యం దుకాణాలను మూసివేయాలని ఎన్నికల కమిషన్​ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో చాలామంది వ్యాపారులు పెద్దమొత్తంలో మద్యాన్ని షాపుల బయట స్టాక్ చేసి పెట్టుకుంటున్నట్టు సమాచారం.

అన్ని పార్టీలు ఓటర్లను ఆకట్టుకోవటానికి, అనుచరగణం చెదిరిపోకుండా చూసుకోవటానికి చుక్క ముక్క ఇలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. ఎన్నికల కోడ్ ​అమల్లోకి వచ్చిన అక్టోబర్ ​9వ తేదీ నుంచి ఇప్పటి వరకు రాష్ర్టవ్యాప్తంగా వేర్వేరు చోట్ల దాదాపు రూ105 కోట్ల మద్యం పట్టుబడిందంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

ఎక్సయిజ్ ​విభాగానికి చెందిన ఓ సీనియర్ ​అధికారి తెలిపిన ప్రకారం కిందటి సంవత్సరం నవంబర్​ 1 నుంచి 20వ తేదీ మధ్యలో రాష్ట్రం మొత్తం మీద రూ1,260 కోట్ల విలువ చేసే మద్యం విక్రయాలు జరుగగా ఈ ఏడాది రూ1,470 కోట్లకు చేరాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి రూ210 కోట్ల మేర అదనంగా అమ్ముడైంది. అయితే బీర్ల అమ్మకాలు విపరీతంగా పెరిగిపోవటం గమనార్హం. కిందటేడాది నవంబర్ ​1 నుంచి 20వ తేదీ మధ్య దాదాపు రూ 12.5 లక్షల కార్టన్ల బీరు అమ్ముడుపోగా ఈసారి రూ.22 కోట్ల కార్టన్లు దాటింది.

ఎన్నికల కారణంగా విక్రయాలు పెరిగినట్టు స్పష్టమవుతున్నది. అన్ని పార్టీల అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో రకరకాల మార్గాల ద్వారా ఇప్పటికే ఇంటింటికీ మద్యం పంపిణీ చేసినట్టు తెలిసింది. పలువురు అభ్యర్థులు వైన్​షాపుల యజమానులతో ఒప్పందాలు కుదుర్చుకుని పంపిణీ చేస్తున్నట్టు సమాచారం. ఏ రోజు లెక్క ఆ రోజు క్లియర్​ చేస్తుండటంతో వైన్​షాపుల యజమానులు అభ్యర్థులు చెప్పినట్టుగా చేస్తున్నట్టు సమాచారం. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X