हैदराबाद: केंद्रीय चुनाव आयोग (ECI) ने आगामी पांच राज्यों के चुनावों को लेकर अहम आदेश जारी किये है। इस महीने की 7 तारीख को सुबह 7 से शाम अगले महीने की 30 तारीख 6:30 बजे तक एग्जिट पोल के नतीजों के प्रकाशन या प्रचार पर रोक लगा दिया है। पांच राज्यों की मतदान तारीखों पर नजर डालें तो इस महीने की 7 तारीख को मिजोरम, 7 और 17 को छत्तीसगढ़ (दो चरणों में), 17 को मध्य प्रदेश, 25 को राजस्थान और 30 को तेलंगाना में चुनाव होंगे। सभी राज्यों के नतीजे 3 दिसंबर को घोषित किए जाएंगे।
हालांकि, लोग वोट देने के अपने अधिकार का प्रयोग करते हैं, मीडिया हाउस और सर्वेक्षण एजेंसियां उनसे फीडबैक लेती हैं और चुनाव परिणामों की भविष्यवाणी करती हैं और उन्हें एग्जिट पोल के रूप में घोषित करती हैं। इस मूल्यांकन के नतीजे अन्य चुनावी राज्यों या उसी राज्य में मतदाताओं की राय को प्रभावित करेंगे जहां बाद के चरणों में मतदान होगा। चुनाव आयोग ने कहा, इस तरह वे अनिर्णीत मतदाताओं को प्रभावित करते हैं। पांच राज्यों के चुनाव 30 नवंबर को समाप्त होने वाले हैं। इसलिए चुनाव आयोग ने उस दिन शाम तक एग्जिट पोल पर प्रतिबंध लगाने का फैसला किया है।
తెలంగాణ ఎన్నికలు-2023: ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రచురణ లేదా ప్రసారంపై నిషేధం
హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 7వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 6:30 గంటల వరకు ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రచురించడం లేదా ప్రచారం చేయడంపై నిషేధం విధించింది. ఐదు రాష్ట్రాల పోలింగ్ తేదీలను పరిశీలిస్తే, ఈ నెల 7న మిజోరం, 7, 17 తేదీల్లో ఛత్తీస్‌గఢ్(రెండు దశల్లో)కు మధ్యప్రదేశ్‌కు 17న, రాజస్థాన్‌కు 25న, తెలంగాణకు 30న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అన్ని రాష్ట్రాల ఫలితాలు డిసెంబర్ 3న వెలువడనున్నాయి.
ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్న వెంటనే మీడియా సంస్థలు, సర్వే ఏజెన్సీలు వారి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుని ఎన్నికల ఫలితాలను అంచనా వేసి, వాటిని ఎగ్జిట్ పోల్స్‌గా ప్రకటిస్తాయి. ఈ అంచనా ఫలితాలు మిగతా ఎన్నికల రాష్ట్రాల్లో లేదా మరో దశలో పోలింగ్ జరిగే అదే రాష్ట్రంలోని ఓటర్ల ఆలోచనలపై ప్రభావం చూపుతాయి. ఒకరకంగా, ఇంకా నిర్ణయం తీసుకోని ఓటర్లను మభ్యపెడతాయని ఈసీ వెల్లడించింది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు నవంబర్ 30న ముగియనుండటంతో ఆ రోజు సాయంత్రం వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. (ఏజెన్సీలు)