हैदराबाद: भारत निर्वाचन आयोग के अधिकारी आज दोपहर 12 बजे दिल्ली में प्रेस कॉन्फ्रेंस करेंगे। इस साल के अंत में होने वाले मिजोरम, छत्तीसगढ़, मध्य प्रदेश, राजस्थान और तेलंगाना राज्यों के विधानसभा चुनावों के कार्यक्रम की घोषणा की जाएगी। चुनाव अधिसूचना, नामांकन, मतदान और मतगणना की प्रक्रिया से संबंधित विवरण का खुलासा किया जाएगा।
इस बीच, सीईसी जो पिछले महीने से पांच राज्यों में चुनाव कराने पर काम कर रही है। आज चुनाव अधिसूचना जारी करेगी। सभी राजनीतिक दल इन पांच राज्यों के चुनावों को 2024 के लोकसभा चुनावों के लिए सबसे महत्वपूर्ण मान रहे हैं। इसी क्रम में सत्तापक्ष और विपक्ष दोनों बेसब्री से सीईसी के फैसले का इंतजार कर रहे हैं।
మధ్యాహ్నం 12 గంటలకు సీఈసీ విలేకరుల సమావేశం, మోగనున్న తెలంగాణ ఎన్నికల నగారా
హైదరాబాద్: ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు భారత ఎన్నికల సంఘం అధికారులు ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న మిజోరం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్లు, పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించనున్నారు.
కాగా, గత నెల రోజులుగా ఐదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేస్తున్న సీఈసీ.. ఈ రోజు ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలే అత్యంత కీలకంగా అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే సీఈసీ నిర్ణయంపై అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆత్రుతగా ఎదురు చూస్తున్నాయి. (ఏజెన్సీలు)