हैदराबाद : तेलंगाना के सीएम रेवंत रेड्डी द्वारा लॉन्च किए गए प्रजा दरबार को शानदार प्रतिक्रिया मिल रही है। महात्मा ज्योतिबा फुले प्रजा भवन में 8 दिसंबर से शुरू हुए प्रजा दरबार में हजारों अर्जियां आ रही हैं। लोग बड़ी संख्या में प्रजा भवन में अपनी समस्याओं के बारे में आवेदन देने आ रहे हैं।
इस कार्यक्रम की शुरुआत के बाद से अब तक 4,471 अर्जियां प्राप्त हो चुकी हैं। इनमें ज्यादातर डबल बेडरूम और पेंशन से जुड़ी अर्जियाां हैं। प्रजा दरबार के अंतर्गत सोमवार को आयोजित प्रजावाणी कार्यक्रम के दौरान 1,143 अर्जियां प्राप्त हुईं है।
तेलंगाना के मुख्यमंत्री के रूप में शपथ लेने के तुरंत बाद, रेवंत रेड्डी ने मुख्यमंत्री के आधिकारिक निवास का नाम, जो पहले प्रगति भवन था, बदलकर महात्मा ज्योतिबा फुले प्रजा भवन कर दिया। नई सरकार के गठन के अगले दिन से ही मुख्यमंत्री को प्रजा भवन में लोगों की अर्जियां मिलने लगे हैं।
हालाँकि, पिछली सरकार के शासनकाल में लोग प्रगति भवन परिसर के अंदर भी नहीं जा सकते थे। सीएम रेवंत रेड्डी ने घोषणा की कि उनकी सरकार में प्रजा दरबार के माध्यम से लोगों की समस्याओं के समाधान के लिए दरवाजे हमेशा खुले रहेंगे।
तेलंगाना प्रजा दरबार का नाम परिवर्तन
तेलंगाना सरकार ने एक अहम फैसला लिया है> प्रजा दरबार का नाम बदलकर प्रजावाणी करने का निर्णय लिया है। प्रजावाणी प्रत्येक मंगलवार एवं शुक्रवार को आयोजित होगी। यह घोषणा की गई है कि यह प्रत्येक मंगलवार और शुक्रवार को सुबह 10 बजे से दोपहर तक दो दिन आयोजित किया जाएगा।
सुबह 10 बजे से पहले ज्योति राव फुले प्रजा भवन पहुंचने वालों को मौका मिलेगा। सीएम रेवंत रेड्डी ने आदेश दिया कि विकलांगों और महिलाओं के लिए अलग-अलग कतारें लगाई जाएं, लोगों की सुविधा के लिए पीने का पानी और अन्य सुविधाएं प्रदान की जाएं।
ప్రజాదర్బార్కు విశేష స్పందన
హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించిన ప్రజాదర్బార్కు విశేష స్పందన లభిస్తోంది. డిసెంబర్ 8 నుంచి మహాత్మా జ్యోతిబాపూలే ప్రజాభవన్ లో ప్రారంభమైన ప్రజాదర్బార్ కు వేల సంఖ్యలో వినతులు వస్తున్నాయి. ప్రజలు తమ సమస్యలపై పెద్ద ఎత్తున వినతి పత్రాలను సమర్పించేందుకు ప్రజాభవన్ కు పెద్ద ఎత్తున వస్తున్నారు.
ఈ ప్రొగ్రాం ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు 4వేల 471 వినతి పత్రాలు అందాయి. అందులో ఎక్కువ శాతం డబుల్ బెడ్ రూం, పెన్షన్లకు సంబంధించిన వినతి పత్రాలు ఉన్నాయి. సోమవారం (డిసెంబర్11) నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 1,143 వినతి పత్రాలు అందినట్లు ప్రజాభవన్ వర్గాలు తెలిపాయి.
తెలంగాణ సీఎం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రేవంత్ రెడ్డి ..గతంలో ప్రగతిభవన్ గా ఉన్న సీఎం అధికారిక నివాసం పేరును మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ గా మార్చారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజునుంచే ప్రజాభవన్ లో ప్రజలనుంచి వినతులను స్వీకరించారు ముఖ్యమంత్రి.
అయితే గత ప్రభుత్వం హయాంలో ప్రగతి భవన్ ఆవరణలోకి కూడా ప్రజలు వెళ్లలేక పోయారని..తమ ప్రభుత్వంలో ప్రజాదర్భార్ ద్వారా ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం తలుపులు తెరిచి ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
తెలంగాణ ప్రజాదర్బార్ పేరు మార్పు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాదర్బార్ పేరును ప్రజావాణిగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రతి మంగళవారం, శుక్రవారం రోజున ప్రజావాణి నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ప్రతీ మంగళ, శుక్ర వారాల్లో రెండు రోజులు ఉదయం 10 గంటలనుండి మధ్యాహ్నం వంటి గంట వరకు నిర్వహిస్తామని ప్రకటించింది.
ఉదయం 10 గంటల లోపు జ్యోతి రావు పూలే ప్రజా భవన్ కు చేరుకున్న వారికి అవకాశం ఉంటుంది. వికలాంగులు, మహిళలకు ప్రత్యేక క్యూ-లైన్లు ఏర్పాటు చేయాలని, ప్రజల సౌకర్యార్థం త్రాగు నీరు, ఇతర సౌకర్యాలను కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. (ఏజెన్సీలు)