हैदराबाद: तेलंगाना विधानसभा सत्र को अंतिम रूप दे दिया गया है। सरकार ने 24 जुलाई से बजट सत्र शुरू करने का फैसला किया है। विधानपरिषद के अध्यक्ष गुत्ता सुखेंदर रेड्डी और विधानसभा अध्यक्ष गड्डम प्रसाद राव ने इस आशय की समीक्षा बैठक की। बैठक में सरकारी सचेतक के साथ सीएस, डीजीपी व अन्य उच्चाधिकारी शामिल हुए।
तेलंगाना विधानसभा सत्र महीने की 24 तारीख से शुरू होंगी। इसी क्रम में स्पीकर ने विधानसभा सत्र के संचालन को लेकर समीक्षा की। इस बैठक में सरकारी सचेतक, सीएस, डीजीपी और अधिकारी शामिल हुए। फिलहाल किसान आश्वासन प्रक्रियाओं को अंतिम रूप देने के लिए गठित मंत्रिस्तरीय उप समिति जिले का दौरा कर रही है। इस समिति द्वारा जुटाए गए ब्यौरे पर विधानसभा सत्र में चर्चा की जाएगी. साथ ही संभावना है कि विधानसभा सत्र में पूर्ण बजट भी पेश किया जाएगा।
पार्टी सूत्रों ने बताया कि सरकार इन बैठकों में नौकरी कैलेंडर की भी घोषणा कर सकती है। हालांकि, पिछली बार भाग नहीं लेने वाले बीआरएस नेता और पूर्व सीएम केसीआर ने हाल ही में घोषणा की है कि वह आने वाले विधानसभा बैठकों में जरूर शामिल होंगे।
फिर भी इस बात को लेकर दिलचस्पी है कि क्या केसीआर इन सत्र में शामिल होंगे या नहीं। इस सत्र में बीआरएस अपनी पार्टी के विधायकों को कांग्रेस में शामिल करने को लेकर बड़े पैमाने पर विरोध प्रदर्शन कर सकती है। साथ ही, जॉब कैलेंडर, लागू नहीं की गई गारंटी पर सरकार की खिंचाई करने की रणनीति बना रही है।
జులై 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. బడ్జెట్ సమావేశాలను 2024, జూలై 24వ తేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఈ మేరకు రివ్యూ మీటింగ్ నిర్వహించారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్, అసెంబ్లీ స్పీకర్ ప్రసాదరావు. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్ లతోపాటు సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ నెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్ లు, సీఎస్, డీజీపీ, అధికారులు హాజరయ్యారు. ప్రస్తుతం రైతు భరోసా విధివిధానాల ఖరారు కోసం ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉపసంఘం జిల్లాలో పర్యటిస్తోంది. ఈ కమిటీ సేకరించిన వివరాలపై అసెంబ్లీలో చర్చించనున్నారు. అలాగే పూర్తి స్థాయి బడ్జెట్ ను కూడా అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అలాగే జాబ్ క్యాలెండర్ ను సైతం ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే గతంలో అసెంబ్లీ సమావేశాలు హాజరు కానీ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వచ్చే అసెంబ్లీ సమావేశాలకు తాను తప్పకుండా హాజరవుతానని ఇటీవల ప్రకటించారు.
మరి ఈ సమావేశాలు కేసీఆర్ హాజరవుతారా లేదా అనే ఆసక్తి నెలకొంది. తమ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ చేర్చుకోవడంపై బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళనలు చేసే అవకాశం ఉంది. ఇంకా జాబ్ క్యాలెండర్, అమలు కానీ గ్యారెంటీలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. (ఏజెన్సీలు)