हैदराबाद : तेलंगाना की अमरनाथ मेला (जातरा) के नाम से मशहूर सलेश्वरम मेले में भयानक हादसा हुआ है। हादसे में तीन श्रद्धालुओं की मौत हो गई है। सलेश्वरम मेले में नगर कुर्नूल शहर निवासी गोडुगु चंद्रय्या (55) की श्रद्धालुओं के उमड़ने के बाद दिल का दौरा पड़ने से मौत हो गई। इसके अलावा वनपर्ती शहर निवासी अभिषेक (32) और अमनगल निवासी विजय (40) की दम घुटने से मौत हो गयी। दो अन्य गंभीर रूप से घायल हो गए और उन्हें बेहतर इलाज के लिए हैदराबाद रेफर कर दिया गया।
नल्लमाला के जंगलों में लगने वाले सलेश्वरम मेले में इस बार बड़ी संख्या में श्रद्धालु उमड़ पड़े। परिणामस्वरूप, तीर्थयात्री सलेश्वरम मंदिर के रास्ते में कतारबद्ध हो गए। मन्ननुर से सलेश्वरम जतारा जाने वाले मार्ग पर वाहनों का आवागमन बाधित हो गया। सलेश्वरम जातरा को कम से कम सात से दस दिनों तक आयोजित किया जाना चाहिए। लेकिन इस बार अधिकारियों ने घोषणा की कि यह केवल तीन दिनों तक आयोजित किया जाएगा। इसके चलते यहां बड़ी संख्या में श्रद्धालु पहुंच गये। स्थिति काबू से बाहर हो गई। इस पृष्ठभूमि में भीड़भाड़ के कारण दम घुटने से श्रद्धालुओं की मौत हो गई।
नागरकुर्नूल जिले के नल्लमाला जंगलों में सलेश्वरम में स्थित लिंगमय्या के दर्शन के लिए घने जंगल, पहाड़ियों और घाटियों के रास्ते में पत्थरों और चट्टानों को पार करते हुए लगभग 5 किमी पैदल चलना पड़ता है। मेला उगादी के बाद पहली पूर्णिमा को शुरू होता है। सलेश्वरम लिंगमय दर्शन के दर्शन के लिए संयुक्त जिले के साथ-साथ तेलंगाना, आंध्र प्रदेश, कर्नाटक और तमिलनाडु से लाखों तीर्थयात्री आते हैं।
इसी क्रम में इस साल सलेश्वरम मेला 5 अप्रैल से शुरू हुआ। सुबह 7 बजे से शाम 5 बजे तक ही श्रद्धालुओं को जंगल में प्रवेश की अनुमति है। लेकिन इस बार यह यात्रा सिर्फ 3 दिनों की ही रहेगी। इससे बड़ी संख्या में श्रद्धालुओं का हुजूम उमड़ पड़ा और बड़ा हादसा हुआ।
తెలంగాణ అమర్ నాథ్ యాత్ర : సలేశ్వరం జాతరలో ఊపిరాడక ముగ్గురు భక్తులు మృతి
హైదరాబాద్ : తెలంగాణ అమర్ నాథ్ యాత్రగా పేరొందిన సలేశ్వరం జాతరలో అపశృతి చోటు చేసుకుంది. ముగ్గురు భక్తులు మృతి చెందారు. సలేశ్వరం జాతరకు భక్తులు భారీగా పోటెత్తడంతో ఊపిరి ఆడక నాగర్ కర్నూల్ పట్టణానికి చెందిన గొడుగు చంద్రయ్య (55) గుండెపోటుతో మృతిచెందాడు. వనపర్తి పట్టణానికి చెందిన అభిషేక్ (32), ఆమన్ గల్ కు చెందిన విజయ్ (40) ఊపిరి ఆడక చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. వారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు.
నల్లమల అడవుల్లో ఉన్న సలేశ్వరం జాతరకు ఈ సారి భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో సలేశ్వరం ఆలయం వద్దకు వెళ్లే దారిలో యాత్రికులు బారులు తీరారు. మన్ననూర్ నుంచి సలేశ్వరం జాతరకు వచ్చే మార్గాల్లో వాహనాల రాకపోకలు స్తంభించాయి. సలేశ్వరం జాతర కనీసం వారం నుంచి 10 రోజులపాటు నిర్వహించాలి. కానీ ఈ సారి కేవలం మూడు రోజులపాటు మాత్రమే నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో అక్కడ పరిస్థితి అదుపుతప్పింది. ఈ నేపథ్యంలో రద్దీ కారణంగా ఊపిరాడక భక్తులు మృతి చెందారు.
నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమల అడవుల్లో ఉన్న సలేశ్వరంలో కొలువై ఉన్న లింగమయ్య దర్శనం కోసం దట్టమైన అడవీ, కొండలు, లోయల మార్గంలో రాళ్లు, రప్పలను దాటుకుంటూ సుమారు 5 కిలో మీటర్ల దూరం కాలినడకన నడవాలి. ఉగాది తర్వాత తొలి పౌర్ణమికి జాతర మొదలవుతుంది. సలేశ్వరం లింగమయ్య దర్శనానికి ఉమ్మడి జిల్లాతోపాటు తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు నుంచి యాత్రికులు లక్షలాదిగా తరలివస్తారు.
అయితే ఈ ఏడాది సలేశ్వరం ఏప్రిల్ 5న ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే భక్తులను అడవిలోకి అనుమతిస్తున్నారు. అయితే ఈ సారి యాత్ర కేవలం 3 రోజులు మాత్రమే కొనసాగనుంది. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. (ఏజెన్సీలు)