हैदराबाद : भारत ने जिम्बाब्वे को टी20 सीरीज के तीसरे मैच में 23 रनों से हरा दिया है। इस जीत के साथ सीरीज में भारत ने 2-1 की बढ़त बना ली है। टीम इंडिया ने पहले बैटिंग करते हुए 20 ओवरों में 4 विकेट के नुकसान के साथ 182 रन बनाए।
इस दौरान कप्तान शुभमन गिल ने अर्धशतक लगाया। उन्होंने 66 रनों की पारी खेली। ऋतुराज गायकवाड़ ने 28 गेंदों में 49 रन बनाए। गायकवाड़ ने 4 चौके और 3 छक्के लगाए। यशस्वी जयसवाल ने 36 रन बनाए। संजू सैमसन 12 रन बनाकर नाबाद रहे।
भारत के दिए लक्ष्य का पीछा करने उतरी जिम्बाब्वे की टीम 20 ओवरों में 6 विकेट के नुकसान के साथ 159 रन ही बना सकी। उसके लिए मायर्स ने नाबाद अर्धशतक लगाया। हालांकि वे जीत नहीं दिला सके। मायर्स ने 7 चौकों और 1 छक्के की मदद से 65 रन बनाए। क्लाइ ने 37 रनों की पारी खेली। वेलिंगटन 18 रन बनाकर नाबाद रहे। (एजेंसियां)
संबंधित खबर-
మరోసారి చిత్తు చేసిన భారత్, మూడో టీ-20లో ఘన విజయం
హైదరాబాద్ : జింబాబ్వే జట్టును భారత్ మరోసారి చిత్తు చేశారు. ఐదు టీ-20ల సిరీస్‌లో భాగంగా బుధవారం హరేరా స్టేడియం వేదికగా జరిగిన మూడో మ్యాచులో టీమిండియా ఘన విజయం సాధించింది. జింబాబ్వేను 23 పరుగుల తేడాతో ఓడించి ఐదు మ్యాచులో సిరీస్‌లో 2-1 తేడాతో టీమిండియా అధిక్యంలోకి దూసుకెళ్లింది.
కాగా, మూడో టీ20లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 రన్స్ చేసింది. టీమిండియా బ్యాటర్లలో గిల్ 66 పరుగులతో కెప్టెన్ ఇన్సింగ్ ఆడగా గైక్వాడ్ 49, జైశ్వాల్ 36, శాంసన్ 12 (నాటౌట్) పరుగులు చేశారు. సెకండ్ మ్యాచ్ సూపర్ సెంచరీ హీరో అభిషేక్ శర్మ కేవలం 10 పరుగులు మాత్రమే చేసి నిరాశపర్చాడు. జింబాబ్వే బౌలర్లలో ముజరాబానీ, సికందర్జా చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం 183 పరుగుల భారీ లక్ష్యంగా ఛేదనకు దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.
డియోన్ మైయర్స్ 65, క్లైవ్ మదాండే 37 పరుగులతో చివరి వరకు గెలుపు కోసం పోరాటం చేసిన మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో జింబాబ్వేకు ఓటమి తప్పలేదు. టీమిండియా స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లతో జింబాబ్వేను దెబ్బకొట్టగా అవేశ్ ఖాన్ 2, ఖలీల్ అహ్మద్ 1 వికెట్ తీశారు. తాజా విజయంతో 2-1 తేడాతో సిరీస్‌లో టీమిండియా అధిక్యంలో ఉంది. (ఏజెన్సీలు)