T20 World Cup 2026 Super 8: न्यूजीलैंड ने 61 रनों से जीता, खिताबी स्पर्धा से श्रीलंका बाहर న్యూజిలాండ్ భారీ విజయం

हैदराबाद : 25 फरवरी को टी20 वर्ल्ड कप 2026 सुपर 8 के अंतर्गत खेले गये मैच में न्यूजीलैंड ने 61 रनों से जीत लिया। न्यूजीलैंड बनाम श्रीलंका के बीच आर. प्रेमदासा स्टेडियम में खेला गया। टॉस जीतकर श्रीलंका ने गेंदबाजी चुनी। यह फैसला श्रीलंका को महंगा पड़ा।

पहले बल्लेबाजी करते हुए न्यूजीलैंड 20 ओवरों में 7 विकेट के नुकसान पर 168 रन बनाये। 169 रनों के लक्ष्य का पीछा करते हुए श्रीलंका की टीम ने 8 विकेट के नुकसान पर 107 बना पाई। इसके साथ ही श्रीलंका खिताबी स्पर्धा से बाहर हो गई।

इस जीत के साथ न्यूजीलैंड की टीम के 3 अंक हो चुके हैं और इंग्लैंड 4 अंक के साथ सेमीफाइनल में पहुंच चुकी है। जबकि पाकिस्तान की टीम 1 अंक के साथ तीसरे नंबर पर है और उसका सेमीफाइनल में पहुंच पाना बेहद मुश्किल है। आपको बता दें कि इंग्लैंड ग्रुप 2 से दो सेमीफाइनल में पहले ही पहुंच चुकी है।

26 फरवरी को दो मैच

26 फरवरी को टी20 वर्ल्ड कप 2026 में सुपर-8 के दो मैच खेले जाएंगे। पहला मैच वेस्टइंडीज बनाम साउथ अफ्रीका के बीच अहमदाबाद के नरेंद्र मोदी स्टेडिय में दोपहर 3 बजे से खेला जाएगा। इसके बाद दूसरा मैच भारत बनाम जिम्बाब्वे के बीच चेन्नई के एमए चिदंबरम स्टेडियम में शाम 7 बजे से होगा। ये दोनों मुकाबले दोनों टीमों के लिए अहम है।

న్యూజిలాండ్ భారీ విజయం

హైదరాబాద్ : టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్–8లో భాగంగా కొలంబోలోని ఆర్. ప్రేమదాస మైదానంలో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. కీలక మ్యాచ్ లో 61 పరుగులు తేడాతో గెలిచి గ్రూప్–2లో రెండో స్థానంలో నిలిచింది. అంతకు ముందు టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ తీసుకోవడంతో.. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. కాగా న్యూజిలాండ్ బ్యాటర్లలో కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (47), రచిన్ రవీంద్ర (32), కోల్ మెక్‌కాన్చీ (31), ఫిన్ అలెన్ (23) రాణించారు. అయితే న్యూజిలాండ్ బ్యాటర్లలో టిమ్ సీఫెర్ట్ (8), డారిల్ మిచెల్ (3), మార్క్ చాప్మన్ (0) ఘోరంగా విఫలమయ్యారు.

169 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక జట్టు ఓపెనర్ పథుమ్ నిశాంక (0) మరోసారి నిరాశ పరిచాడు. మ్యాట్ హెన్రీ బౌలింగ్ లో క్లిన్ బౌల్డ్ అయి, గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు. అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన లంక బ్యాటర్లు వరుసగా పెవిలియన్ కి క్యూ కట్టారు. శ్రీలంక బ్యాటర్లలో కమిందు మెండిస్ (31) ఒక్కడే కాసేపు న్యూజిలాండ్ బౌలర్లను ఎదుర్కొనే ప్రయత్నం చేసినప్పటికీ, కుశల్ మెండిస్ (11), పవన్ రత్నాయకే (10), చరిత్ అసలంక (5), కెప్టెన్ దసున్ శనక (3), దుషన్ హేమంత (3) ఏమాత్రం పోటీ ఇవ్వకపోగా తక్కువ పరుగులకే డగౌట్ కి వెళ్లిపోయారు.

మరోవైపు లంక బ్యాటర్లు అందరు వరుసగా పెవిలియన్ కి క్యూ కట్టిన కూడా దునిత్ వెల్లలాగే మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. 23 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సుతో 29 పరుగులు చేసి గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్ లో రచిన్ రవింద్రకు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. న్యూజిలాండ్ బౌలర్లు చెలరేగడంతో శ్రీలంక పరుగులకే ఆలౌట్ అయింది. కివీస్ బౌలర్లలో రచిన్ రవీంద్ర కీలకమైన 4 వికెట్లు తీసుకుని లంక జట్టు వెన్ను విరిచి సాంట్నర్ సేన విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాట్ హెన్రీ రెండు వికెట్లు తీసుకోగా, మిచెల్ సాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్ చెరో వికెట్ పడగొట్టారు. దీంతో శ్రీలంక జట్టు 8 వికెట్ల నష్టానికి 107 పరుగులే చేసి.. 61 పరుగుల తేడాతో ఘరంగా ఓడింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X