हैदराबाद : T20 वर्ल्ड कप 2026 का ग्रुप स्टेज लगभग खत्म हो गया है। आठ टीमें सुपर 8 में पहुंच गई हैं। लेकिन अभी, सारी बातें बेबी टीम ज़िम्बाब्वे के बारे में हो रही हैं! क्या किसी ने कभी सोचा होगा कि ऑस्ट्रेलिया और श्रीलंका के साथ ग्रुप में टॉप पर ज़िम्बाब्वे रहेगा? क्या किसी ने सोचा होगा कि एक मज़बूत ऑस्ट्रेलिया टीम वर्ल्ड कप टूर्नामेंट से बाहर हो जाएगी? बहुत ही शानदार प्रदर्शन के साथ एक मैच भी बिना हारे ज़िम्बाब्वे ग्रुप बी में टॉप पर रही है। साबित कर दिया कि ताकतवर ऑस्ट्रेलियाई टीम पर जीत कोई चमत्कार नहीं है। उसने आखिरी लीग मैच में श्रीलंका को भी हरा दिया है।

हालांकि, सुपर 8 के हिस्से के तौर पर, इंडिया, साउथ अफ्रीका, वेस्ट इंडीज़ और ज़िम्बाब्वे ग्रुप 1 में हैं। क्रिकेट विश्लेषकों का मानना है कि इंडिया और ऑस्ट्रेलियाई ही हॉट फेवरेट नहीं हैं, बल्कि वेस्ट इंडीज़ और ज़िम्बाब्वे भी कड़ी टक्कर दे सकते हैं। इसकी एक वजह भी है। वह यह है कि इन चारों टीमों को लीग स्टेज में एक भी हार नहीं मिली है। इससे कहा जा सकता है कि सुपर 8 में ग्रुप 1 का हर मैच का मुकाबला सेमीफाइनल जैसा रोमांचक होगा।

फॉर्म के तौर पर देखा जाये तो इंडिया और साउथ अफ्रीका सेमीफाइनल के लिए फेवरेट टीमें हैं। साउथ अफ्रीका हर समय बहुत खतरनाक टीम है। वे आखिरी बॉल तक जीत के लिए लड़ते हैं। टी20 वर्ल्ड कप 2024 इसका साफ उदाहरण है। इसमें कोई शक नहीं कि फाइनल में हारने के बावजूद उन्होंने इंडिया को कड़ी टक्कर दी। ह देखना बाकी है कि क्या अब सफारी टीम इंडिया से उस हार का बदला लेगी? साथ ही, वेस्टइंडीज को बिल्कुल भी कम नहीं आंका जा सकता। यह वही टीम है जिसने 2016 में इंडिया में हुए टूर्नामेंट में खिताब जीता था। इस कैरेबियाई (वेस्टइंडीज) टीम में ऐसे खिलाड़ी हैं जो बिना किसी उम्मीद के मैदान में उतर सकते हैं और शानदार परफॉर्म कर सकते हैं।

दूसरी ओर, ग्रुप 2 में पाकिस्तान, इंग्लैंड, श्रीलंका और न्यूजीलैंड हैं। इस ग्रुप की हर टीम ग्रुप स्टेज में एक मैच हारी है। इंग्लैंड वेस्टइंडीज से, न्यूजीलैंड साउथ अफ्रीका से और पाकिस्तान इंडिया से हारा है। गौरतलब है कि श्रीलंका ने मजबूत ऑस्ट्रेलियाई टीम को हराया और बेबी जिम्बाब्वे से हार गया। हालांकि, ऐसे संकेत हैं कि सुपर 8 का हर मैच रोमांचक होगा। क्या ज़िम्बाब्वे की अंडरडॉग कहानी यहीं खत्म हो जाएगी? या यह एक और सनसनी की शुरुआत करेगी? यह देखना बाकी है।
यह भी पढ़ें-
జింబాబ్వే జట్టు మీదే చర్చంతా
హైదరాబాద్ : టీ20 ప్రపంచ కప్ 2026 గ్రూప్ స్టేజి దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఎనిమిది జట్లు సూపర్ 8కి చేరుకున్నాయి. అయితే ప్రస్తుతం చర్చంతా పసికూన జింబాబ్వే మీదే! ఎందుకంటారా ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లున్న గ్రూప్‌లో జింబాబ్వే జట్టు అగ్రస్థానంలో నిలుస్తుందని ఎవరైనా అనుకుని ఉంటారా? ఈ జట్టు ధాటికి బలమైన ఆస్ట్రేలియా ప్రపంచ కప్ టోర్నీ నుంచే నిష్క్రమిస్తుందని ఎవరైనా ఊహించి ఉంటారా? అనూహ్యంగా అసాధారణమైన ప్రదర్శనతో అజేయంగా నిలిచిన జింబాబ్వే గ్రూప్ బిలో ‘టాప్’ లేపింది. ఆసీస్‌పై విజయం అదృష్టం కాదని నిరూపిస్తూ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకనూ చిత్తు చేసింది.
అయితే సూపర్ 8లో భాగంగా భారత్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే జట్లు గ్రూప్ 1లో ఉన్నాయి. భారత్, సఫారీలు మాత్రమే హాట్ ఫేవరెట్లు కాదని వెస్టిండీస్, జింబాబ్వే కూడా గట్టి పోటీనివ్వనున్నాయని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం. దీనికి ఓ కారణం లేకపోలేదు లీగ్ స్టేజిలో ఈ నాలుగు జట్లు ఒక్క ఓటమిని కూడా చవి చూడలేదు. దీంతో సూపర్ 8లో గ్రూప్ 1 ప్రతి మ్యాచ్ సెమీ ఫైనల్ పోరులా రసవత్తరంగా మారనుంది.
ఫామ్ పరంగా చూస్తే భారత్, దక్షిణాఫ్రికా జట్లు సెమీస్‌కు ఫేవరెట్లు. ఎప్పుడైనా సరే సౌతాఫ్రికా జట్టు చాలా ప్రమాదకరం. ఆఖరి బంతి వరకు గెలుపు కోసం పోరాడటం వారి నైజం. దానికి టీ20 ప్రపంచ కప్ 2024 ప్రత్యక్ష ఉదాహరణ. ఫైనల్‌లో ఓడినప్పటికీ గట్టి పోటీనిచ్చి భారత్‌ను భయపెట్టిందనడంలో సందేహం లేదు. నాటి ఓటమికి టీమిండియాపై సఫారీలు ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటారా? అనేది చూడాల్సి ఉంది. అలాగే వెస్టిండీస్‌ను ఏమాత్రం తక్కువగా అంచనా వేయలేం. 2016లో భారత్ వేదికగా జరిగిన టోర్నీలో టైటిల్ గెలిచిన జట్టు అదే. అంచనాలు లేకుండా బరిలోకి దిగి అసాధారణమైన ప్రదర్శన కనబర్చగల ప్లేయర్లు ఈ కరేబియన్ జట్టు సొంతం.
మరోవైపు గ్రూప్ 2లో పాకిస్థాన్, ఇంగ్లాండ్, శ్రీలంక, న్యూజిలాండ్ జట్లు ఉన్నాయి. ఈ గ్రూప్‌లోని ప్రతి జట్టు గ్రూప్ దశలో ఒక మ్యాచ్ ఓడింది. ఇంగ్లాండ్ వెస్టిండీస్ చేతిలో, న్యూజిలాండ్ దక్షిణాఫ్రికా చేతిలో, పాకిస్థాన్ భారత్ చేతిలో పరాజయం పాలయ్యాయి. శ్రీలంక మాత్రం బలమైన ఆసీస్‌ను ఓడించి పసికూన జింబాబ్వే చేతిలో ఓడటం గమనార్హం. కాగా సూపర్ 8లో ప్రతి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి. జింబాబ్వే అండర్ డాగ్ కథ ఇక్కడితో ఆగుతుందా? లేక మరో సంచలనానికి నాంది పలుకుతుందా? అన్నది చూడాలి. (ఏజెన్సీలు)
